
Hardik Panya Wont Bowl T20WC.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ ఒక క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. కొన్నిరోజులుగా హార్దిక్ పాండ్యాను టీమిండియా టి20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం హార్దిక్ జట్టులోనే ఉంటాడని.. బౌలింగ్ మాత్రం చేయడని.. కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడుతాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
చదవండి: T20 World Cup 2021: మెంటార్‌గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్
''హార్దిక్ పాండ్యా విషయంలో ఒక క్లారీటితో ఉన్నాం. హార్దిక్ బౌలింగ్ చేయడు.. అతను బ్యాటర్‌గా కొనసాగుతాడు. అయితే టి20 ప్రపంచకప్ మధ్యలో బౌలింగ్ వేసే అవకాశం మాత్రం ఉంది.. ఇప్పుడైతే కుదరదు. అక్షర్ పటేల్ విషయం కాస్త బాధను కలిగించింది. జట్టులో స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్‌లు ఉండడంతో పేస్ బౌలింగ్‌లో సమతూకం పాటించడానికి శార్దూల్‌ను జట్టులోకి తీసుకొని అక్షర్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంచాం.'' అంటూ అధికారి పేర్కొన్నారు.
వాస్తవానికి హార్దిక్ జట్టులో నుంచి తొలగించే ఉద్దేశం లేకపోవడంతోనే అక్షర్ పటేల్‌ను పక్కకు పెట్టాలని బీసీసీఐ భావించిదంటూ పలువురు అభిమానులు పేర్కొన్నారు. టీమిండియా 15 మంది జట్టులో ముగ్గరు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు ఉండాలని భావిస్తున్న టీమిండియా.. హార్దిక్‌ను నాలుగో పేసర్‌గా వాడుకోవాలనుకుంది. కానీ హార్దిక్ బౌలింగ్ చేయడని తేలడంతో అక్షర్‌ను తప్పించి శార్దూల్‌ను తీసుకున్నట్లు సమాచారం. అంతేగాక అక్షర్‌తో పోలిస్తే శార్దూల్‌కు బ్యాటింగ్‌లో మంచి స్ట్రైక్‌రేట్ ఉంది. ఒకరకంగా హార్దిక్ పాండ్యా కోసం అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టారని అభిమానులు ఉహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..
ఇక అక్షర్ పటేల్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉంచిన బీసీసీఐ మరో ఎనిమిది మందిని యూఏఈలోనే ఉండాలంటూ తెలిపింది. వారిలో ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, వెంకటేశ్ అయ్యర్‌లు నెట్‌బౌలర్లుగా.. హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కె గౌతమ్‌లను కూడా అందుబాటులో ఉండాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment