
ఇంగ్లండ్ శుభారంభం
పాకిస్తాన్‌తో తొలి వన్డేలో విజయం
సౌతాంప్టన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన ఇంగ్లండ్ 44 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 260 పరుగులు చేసింది. ఓపెనర్ అజహర్ అలీ (110 బంతుల్లో 82; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 33 ఓవర్లలో 185/3 స్కోరుతో ఉన్న సమయంలో భారీ వర్షం ఆటంకం కలిగించింది.
ఆ తర్వాత 84 బంతుల్లో 59 పరుగుల లక్ష్యాన్ని విధించినా మరో మూడు బంతులకే వర్షం కురవడంతో ఆట సాధ్యం కాలేదు. అయితే అప్పటికే డక్‌వర్త్ పద్దతిలో 44 పరుగుల ఆధిక్యంలో ఉండడంతో మోర్గాన్ సేనకు విజయం దక్కింది. ఓపెనర్ రాయ్ (56 బంతుల్లో 65; 6 ఫోర్లు; 1 సిక్స్), రూట్ (72 బంతుల్లో 61; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడారు.