
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ నిలిచింది. సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు. తర్వాత మళ్లీ వానతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్ ఖాన్ (92 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు.
నేడు జింబాబ్వే గెలిస్తే...
ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారుకాగా... రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్‌తో తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment