ODI World Cup qualifying
-
తిలక్ వర్మ... పేరు గుర్తుంచుకోండి!
తిలక్ పేరులో ‘లక్’ ఉంది. ఈ ‘లక్’ చోటు వచ్చేందుకు పనికొస్తుందేమో కానీ... రాణించేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. శక్తి, సామర్థ్యాలతో పాటు టెక్నిక్, వచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్న పట్టుదల, పాతుకుపోవాలన్న సంకల్పమే ఏ ఆటగాడినైనా నిలబెడతాయి. ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ కూడా అదే చేశాడు. కష్టపడే జట్టులోకి వచ్చాడు. వచ్చాక ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఈ నిలకడే భారత టీమ్ మేనేజ్మెంట్ కంట నాలుగో స్థానంపై ఆశాకిరణమయ్యేలా చేస్తోంది. ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో దంచేస్తుంటే అందరికి తెలిసొచి్చంది. కానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) డివిజన్ లీగ్ క్రికెట్లోనే అతను వార్తల్లో వ్యక్తి అని చాలా మందికి తెలియదు. మూడు రోజుల ఆటలో జట్టును అర్ధ సెంచరీలతో ఆదుకున్నాడు. సెంచరీలతో గెలిపించాడు. ఐపీఎల్ వేలంలోకి వచ్చాక లీగ్‌లో మనోడున్నాడు అనిపించాడు. నిలకడైన ఆటతో మెల్లిగా ముంబై ఇండియన్స్ జట్టు మొనగాడయ్యాడు. ఇప్పుడు కరీబియన్‌కు తీసుకెళ్తే భారత ఆశాకిరణమయ్యాడు. అలా ఒక్కో మెట్టెక్కుతూ... కింది నుంచే పైకొచ్చాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ ఆ సీజన్లో ముంబైని మురిపించాడు. షాట్ల ఎంపిక, బంతిని పంపిన ప్లేసింగ్ తీరు, ధాటిగా ఆడే నైపుణ్యం ఇవన్నీ గమనించిన ముంబై యాజమాన్యం అతనికి విరివిగా అవకాశాలిచి్చంది. అన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దింపింది. దాంతో 131.02 స్ట్రయిక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. 36.09 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్లోనూ 11 మ్యాచ్‌ల్లో ఆడిస్తే 164.11 స్ట్రయిక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు. సగటేమో 42.87! అంటే ఈ రెండేళ్లలో సగటు, స్ట్రయిక్‌రేట్ రెండు పెంచుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ గణాంకాలతోనే తిలక్ వర్మ అదరగొట్టాడనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ముంబై కష్టాల్లో ఉంటే ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే... అతను మాత్రం యథేచ్ఛగా ఆడిన తీరే అందరిమెప్పు పొందేలా చేసింది. క్రికెట్ విశ్లేషకులు, ప్రముఖ టీవీ వ్యాఖ్యా తలే కాదు... దిగ్గజ క్రికెటర్లు సైతం తిలక్ వర్మ ఆటకు, ఆడిన తీరుకు ముచ్చటపడ్డారు. ప్రశంసలు కురిపించారు. విండీస్‌లో సిక్సర్లతో... అతని ప్రతిభను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా గుర్తించి కరీబియన్ పర్యటనకు పంపింది. కేవలం టి20ల్లో మాత్రమే అవకాశమిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అరుదుగా లభించిన ఈ సదవకాశాన్ని హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ వదులుకోలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెపె్టన్ హార్దిక్ పాండ్యాల గేమ్ ప్లాన్‌లో భాగమైన తిలక్... విండీస్ తురుపుముక్కలైన సీమర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు... కానీ అంతర్జాతీయ పరుగుల ప్రయాణాన్ని మాత్రం సిక్సర్లతో ప్రారంభించాడు. తొలి రెండు టి20ల్లో 39 పరుగులు, 51 పరుగులు అతనిదే టాప్ స్కోర్! తర్వాత మూడు మ్యాచ్‌ల్లో 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు... ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యత కనబరిచాడు. ఓవరాల్‌గా 173 పరుగులతో ఈ సిరీస్‌లో భారత టాప్ స్కోరర్‌గా అవతరించాడు. అందుకే భారత కెపె్టన్ రోహిత్ ఓ ఇంటర్యూలో హైదరాబాదీ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ప్రశంసించాడు. ఆసియా కప్, ప్రపంచకప్‌లపై... యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత బదులు తోచని ప్రశ్నగా మిగిలిపోయిన నాలుగో స్థానం ఇప్పుడు తిలక్‌ను ఊరిస్తోంది. ఆసియా కప్‌లో సెలక్టర్లు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక అక్కడ కూడా మ్యాచ్ మ్యాచ్‌కు ఇలాంటి నిలకడ, ధాటైన జోరు కొనసాగిస్తే మాత్రం స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం అతని పేరును పరిశీలించడం, చోటివ్వడం ఖాయమవుతుందేమో చూడాలి. –సాక్షి క్రీడా విభాగం -
IND vs WI 3rd ODI: విజయమా... ప్రయోగమా!
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాత ‘మేం భవిష్యత్తుపై దృష్టి పెట్టాం. ప్రస్తుత ఫలితాలు ముఖ్యం కాదు. అందుకే భిన్నమైన కూర్పుతో తుది జట్టు కోసం ప్రయోగాలు చేస్తున్నాం’ అని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. నిజంగానే ద్రవిడ్ మాటలను చేతలకు అన్వయిస్తే మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మ్యాచ్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడం ఖాయం. ఇలాంటి స్థితిలో భారత్ చివరి వన్డేలో నెగ్గి సిరీస్ గెలుచుకుంటుందా లేక గత మ్యాచ్‌లాగే తలవంచుతుందా చూడాలి. తరూబా (ట్రినిడాడ్): వన్డే వరల్డ్‌కప్ ఆతిథ్య జట్టు హోదాలో సిద్ధమవుతున్న భారత్ జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధించని టీమ్‌తో సిరీస్ విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలోనే కష్టంగా నెగ్గిన టీమిండియా... రెండో వన్డేలో ఓటమిపాలు కావడంతో సిరీస్ 1–1గా సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఏకపక్షంగా మారకుండా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఆ ఇద్దరికీ... రోహిత్, కోహ్లి గత మ్యాచ్‌లాగే ఆడకపోతే భారత జట్టుకు సంబంధించి ఇద్దరు బ్యాటర్లపై ప్రధానంగా చర్చ సాగనుంది. తమను తాము నిరూపించుకోవాల్సిన స్థితిలో సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్‌లు బరిలోకి దిగుతున్నారు. కోచ్ చెప్పిన దాన్ని బట్టి వీరిద్దరికి మరో అవకాశం ఖాయం. సూర్య వన్డేల్లో ఇంకా తడబడుతుండగా... చాలా కాలం తర్వాత దక్కిన అవకాశాన్ని సామ్సన్ ఉపయోగించుకోలేకపోయాడు. మూడు, నాలుగు స్థానాల్లో వీరు రాణిస్తే జట్టుకు మేలు కలుగుతుంది. ఇషాన్ కిషన్ ఆకట్టుకోగా, గిల్ ఇంకా ప్రభావం చూపలేదు. హార్దిక్ కూడా అంచనాలకు తగిన విధంగా రెండు విభాగాల్లోనూ రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో ఉమ్రాన్, ముకేశ్, కుల్దీప్లు తమ సత్తా మేరకు ఆడితే విండీస్‌ను కట్టడి చేయగలరు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే భారత్ విజయావకాశాలు మెరుగవుతాయి. ఆత్మవిశ్వాసంతో... తొలి వన్డేలో కుప్పకూలినా... రెండో మ్యాచ్‌లో గెలుపు విండీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా కెపె్టన్ షై హోప్ చక్కటి ఫామ్‌తో ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మేయర్స్ గత మ్యాచ్‌లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. కింగ్, అతనజ్ కూడా రాణించడంతో పాటు కార్టీ కూడా నిలబడితే జట్టు మంచి స్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. విండీస్ బౌలింగ్ గత మ్యాచ్‌లో ఆకట్టుకుంది. పేసర్లలో అల్జారి జోసెఫ్ పదునైన పేస్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టగా రొమారియో షెఫర్డ్ కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి సమష్టిగా రాణించి సొంతగడ్డపై సిరీస్ సాధించాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. పిచ్, వాతావరణం బ్రియాన్ లారా స్టేడియం ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచి్చంది. ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. అయితే ఈ వేదికపై జరిగిన దేశవాళీ వన్డేల్లో స్వల్ప స్కోర్లే నమోదు కావడం పిచ్ పరిస్థితికి ఒక సూచిక. మ్యాచ్ రోజు వాన ముప్పు లేదు. -
నెదర్లాండ్స్ ఆశలు సజీవం
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ నిలిచింది. సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు. తర్వాత మళ్లీ వానతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్ ఖాన్ (92 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు. నేడు జింబాబ్వే గెలిస్తే... ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారుకాగా... రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్తో తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది. -
చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా!
ఐసీసీ వన్డే క్వాలిఫయర్స్‌లో భాగంగా వెస్టిండీస్-నెదార్లాండ్స్ మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ మ్యాచ్‌లో పటిష్ట వెస్టిండీస్‌కు పసికూన నెదర్లాండ్స్ బిగ్‌షాక్ ఇచ్చింది. సూపర్ ఓవర్లో విండీస్‌పై డచ్ జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు.. ఆ జట్టు ఆల్‌రౌండర్ వాన్ బీక్ 4,6,4,6,6,4 బాది 30 పరుగులు అందించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే విండీస్ ఇన్నింగ్స్ సూపర్ ఓవర్ వాన్ బీక్ వేయడం గమనార్హం. అంతకుముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (65 బంతుల్లో 104) సెంచరీతో చెలరేగగా.. బ్రాండన్ కింగ్ 76, జాన్సన్ చార్లెస్ 54 పరుగులతో రాణించారు. అనంతరం 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డచ్ కూడా నిర్ణీత ఓవర్లలో 374 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. టైకావడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్లో తేల్చాల్సి వచ్చింది. కాగా డచ్ బ్యాటర్లో తేజ నిడమనూరు (111) సెంచరీతో కదం తొక్కాడు. వాన్ బీక్ ప్రపంచ రికార్డు.. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్లో ఊచకోత కోసిన వాన్ బీక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వాన్ బీక్ నిలిచాడు. జాసన్ హోల్డర్ వేసిన సూపర్ ఓవర్లో 4,6,4,6,6,4 బాది వాన్ బీక్ 30 పరుగులు రాబట్టాడు. టీ20, వన్డే ఫార్మాట్లో ఇదే అత్యధికం. ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. అదే విధంగా సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా కూడా నెదార్లాండ్స్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. వన్డే, టీ20 ఫార్మాట్లో విండీస్ సూపర్ ఓవర్లో 25 పరుగులు నమోదు చేసింది. చదవండి: నేడే వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ విడుదల Crazy SUPER OVER between Netherlands and West Indies Netherlands - 4,6,4,6,6,4 West Indies - 6,1,1,W,W NED won the Super over by 22 runs Logan Van Beek , The hero of the Match 🔥🔥🔥pic.twitter.com/aLDezsBdjw — . (@MSD_071113_) June 26, 2023 -
'జట్టు గెలుపుకన్నా ఇదెక్కువ ఆనందాన్నిస్తోంది'
జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్(ICC CWC Qualifiers 2023) మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మెయిన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా ఆ రెండు స్థానాల కోసం 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. కాగా క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.ఇక జింబాబ్వే జట్టుకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున్నఅభిమానులు తరలివచ్చారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా జింబాబ్వే అభిమానుల చర్య అందరిని ఆకట్టుకుంటుంది. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున నగరవా 4 వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రెయిగ్ ఎర్విన్ 128 బంతుల్లో 121 పరుగులు చేయగా.. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Shout out and respect to @ZimCricketv fans for remaining behind and clearing the litter.@AdamTheofilatos @GodwillMamhiyo @bayhaus @CastleCornerZW pic.twitter.com/pquPDTznRY — Gildredge (@gillmbaku_zw) June 18, 2023 చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం' -
వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల
మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ 2023 (వన్డే ఫార్మాట్) క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం (మే 23) విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. జింబాబ్వే, వెస్టిండీస్, ద నెదార్లండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్ 2 ప్లేసెస్‌లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. కాగా, భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. The @ICC Men’s Cricket World Cup Qualifier 2023 Match Schedule is now available 🎉🤩 👇 Check it out 👇#RoadToCWC23 | #CWC23 | #VisitZimbabwe pic.twitter.com/Mu31QRdRdR — Zimbabwe Cricket (@ZimCricketv) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే -
బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత పర్యటనకు ఆఫ్గానిస్తాన్! 5 ఏళ్ల తర్వాత
ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన అనంతరం టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆసీస్‌తో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది. వన్డే ప్రపంచకప్ సన్నహాకాల్లో భాగంగా బీసీసీఐ పలు స్వదేశీ, విదేశీ సిరీస్‌లను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది జూన్‌లో ఆఫ్గాన్ జట్టు భారత పర్యటనకు రానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సిరీస్ ఐసీసీ ఫ్యూటర్ టూర్ ప్రోగామ్లో భాగంగా జరగడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌ను ప్రసారం చేసేందుకు మధ్యంతర మీడియా హక్కుల టెండర్లను బీసీసీఐ ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఎందుకంటే స్టార్ ఇండియాతో మార్చి నెలాఖరుతో బీసీసీఐ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. "మీడియా హక్కుల టెండర్ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (జూన్-జూలై)లో విడుదల చేయబడుతుంది. ఆఫ్గాన్ సిరీస్‌కు విడిగా టెండర్లను ఆహ్వానించే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్ నుంచి పూర్తి స్థాయి బ్రాడ్‌క్రాస్టింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది" అని జై షా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇక ఆఫ్గానిస్తాన్ చివరగా 2018లో భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆఫ్గానిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. కాగా ఆఫ్గాన్‌కు అదే తొలి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. చదవండి: IPL 2023: కోల్‌కతా కెప్టెన్ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్ -
IND vs SA 2nd ODI: సిరీస్ కాపాడుకునేందుకు...
రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఎంతో చేరువగా వచ్చినా, త్రుటిలో గెలుపు అవకాశం చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్‌లో ఓడి సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న టీమిండియా నేడు జరిగే రెండో వన్డేలో బరిలోకి దిగుతోంది. టాప్ ఆటగాళ్లు లేకుండా ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతోనే మైదానంలోకి అడుగు పెట్టిన భారత్‌కు సంబంధించి వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... దక్షిణాఫ్రికాకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్ గెలుపు ద్వారా లభించే 10 ‘సూపర్ లీగ్’ పాయింట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. పేస్ బౌలర్ దీపక్ చహర్ వెన్ను నొప్పితో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా, అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి వన్డేలోనూ చహర్ బరిలోకి దిగలేదు. షహబాజ్‌కు అవకాశం దక్కేనా! 40 ఓవర్లకు కుదించిన మొదటి వన్డేలో భారత్ కేవలం 9 పరుగులతో ఓడింది. ఇన్నింగ్స్ చివర్లో సామ్సన్‌కు మరికొన్ని బంతులు ఆడే అవకాశం వచ్చి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే అదే జట్టును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మన బ్యాటింగ్ బృందంలో సామ్సన్ తన సత్తా ఏమిటో చూపించగా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు తాను సరైనవాడినని నిరూపించుకున్నాడు. అయితే గత మ్యాచ్‌లో విఫలమైన టాప్–4 ఈసారి ఎలా ఆడతారన్నది చూడాలి. ఓపెనర్లు ధావన్, గిల్ ప్రభావం చూపించాల్సి ఉండగా... తొలి వన్డేలో మరీ పేలవంగా ఆడిన రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు ఏమాత్రం రాణిస్తారనేది కీలకం. ఆల్‌రౌండర్ శార్దుల్ రెండు విధాలా ఆకట్టుకోవడం సానుకూలాంశం. కుల్దీప్ యాదవ్ కూడా మరోసారి తన భిన్నమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించగలడు. అయితే రెండో స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ స్థానంలో షహబాజ్ అహ్మద్‌కు చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. షహబాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఇద్దరు పేసర్లు అవేశ్, సిరాజ్ మరోసారి కొత్త బంతిని పంచుకోవడం ఖాయం. ఇటీవల వన్డేల్లో ఎంతో మెరుగుపడిన సిరాజ్, చివరి ఓవర్లలో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. చహర్ స్థానంలో ఎంపికైన సుందర్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. రెండు మార్పులతో... వన్డే సూపర్ లీగ్ పాయింట్లలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో కొనసాగుతోంది. నేరుగా అర్హత సాధించేందుకు టాప్–8లో నిలవాల్సి ఉండగా ఆ జట్టుకు ప్రతీ వన్డే కీలకం కానుంది. రెండో వన్డేతో పాటు చివరి మ్యాచ్‌లో కూడా గెలిస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. అయితే లక్నో మ్యాచ్‌లోనూ అదృష్టవశాత్తూ గెలిచిన ఆ జట్టు మరో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. పూర్తి స్థాయి జట్టే అందుబాటులో ఉన్నా, భారత్‌ను ఓడించేందుకు సఫారీ టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఇలాంటి స్థితిలో జట్టులో అందరూ రాణించాల్సి ఉంది. కెప్టెన్ బవుమా జట్టుకు పెద్ద బలహీనతగా మారగా, ఆల్‌రౌండర్ మార్క్రమ్ గత కొంత కాలంగా వన్డేల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మలాన్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రూపంలో చెప్పుకోదగ్గ ఓపెనర్లు ఉండటం కాస్త నయం. గత మ్యాచ్‌లోనూ వీరిద్దరు శుభారంభం అందించగా, ఆ తర్వాత టీమ్ తడబడింది. మిల్లర్, క్లాసెన్ ఆదుకోవడంతో పరిస్థితి మెరుగైంది. మరోసారి ఈ జోడీపై దక్షిణాఫ్రికా అమితంగా ఆధారపడుతోంది. ఆల్‌రౌండర్ ప్రిటోరియస్ గాయంతో దూరం కావడం జట్టు సమతుల్యతను దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో జట్టులో రెండు మార్పులు కనిపిస్తున్నాయి. వేన్ పార్నెల్, షమ్సీ స్థానాల్లో మరో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జాన్సెన్, ఫెలుక్వాయోలకు అవకాశం దక్కవచ్చు. రబడ, కేశవ్ మహరాజ్ ప్రభావం చూపిస్తుండగా... ఇన్‌గిడి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో నాలుగింటిలో భారీ స్కోర్లే నమోదయ్యాయి. బౌలర్లూ ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ రోజు కొన్ని చినుకులు పడే అవకాశం ఉన్నా... ఆటకు అంతరాయం కలగకపోవచ్చు. -
ఐసీసీ వన్డే సూపర్ లీగ్ వచ్చేసింది..
దుబాయ్: 2023లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా క్వాలిఫికేషన్ రౌండ్‌కు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కొత్త వన్డే సూపర్ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు ఆరంభపు క్వాలిఫికేషన్ రౌండ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఐర్లాండ్ తలపడనుంది. గురువారం ఇరు జట్ల మధ సౌతాంప్టన్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ సూపర్ లీగ్‌లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన దేశాలతో పాటు నెదర్లాండ్స్‌కు పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్ రౌండ్‌కు నెదర్గాండ్స్ గతంలోనే అర్హత సాధించింది. 2015-17లో నిర్వహించిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్‌లో విజేతగా నిలవడం ద్వారా నెదర్లాండ్స్ వరల్డ్‌కప్- 2023 క్వాలిఫికేషన్ రేసులో నిలిచింది. ఈ సూపర్ లీగ్‌లో ప్రతీ జట్టు నాలుగు స్వదేశీ మ్యాచ్‌ల సిరీస్‌ను మరో నాలుగు విదేశీ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇవి మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా జరగనున్నాయి. (క్రికెట్ మ్యాచ్‌కు ప్రేక్షకులు షురూ) మొత్తం పది దేశాలు పాల్గొనే వరల్డ్‌కప్‌లో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన ఎనిమిది దేశాలు(ఆతిథ్య దేశం భారత్‌తో కలుపుకుని) ఆటోమేటిక్‌గా ఆ టోర్నీకి అర్హత సాధిస్తుండగా, మరో రెండు దేశాల కోసం క్వాలిఫికేషన్ రౌండ్ నిర్వహిస్తున్నారు. ఆతిథ్యం దేశం అనేది నేరుగా మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యే విషయం తెలిసిందే. అదే సమయంలో టాప్ స్థానాల్లో ఉన్న మరో ఏడు పూర్తిస్థాయి సభ్య దేశాలు కూడా పోటీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వన్డే క్రికెట్‌తో పాటు టి 20 ప్రపంచ కప్ షెడ్యూల్లు వాయిదాలు పడ్డాయి. ఆ క్రమంలోనే సూపర్ లీగ్ కూడా ఆలస్యమైంది. ఈ లీగ్‌ను మే నెలలోనే నిర్వహించాల్సి ఉండగా, కరోనాతో అది ఆలస్యమైంది. కొత్త సూపర్ లీగ్‌లో సిరీస్‌ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి ఆయా జాతీయ బోర్డులతో కలిసి పని చేయడానికి ఐసీసీ నడుంబిగించింది. కాగా, 2023 వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉండటంతో అర్హత ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు ఉండవని ఐసీసీ భావిస్తోంది. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా నిర్వహించిన క్వాలిఫైయింగ్ విధానాన్నే తాజా అర్హత ప్రక్రియకు అవలంభిస్తున్నారు. మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ లీగ్‌లో 156 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2022 చివరి వరకూ సూపర్ లీగ్ కొనసాగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం 2023 వరల్డ్‌కప్‌ను ఫిబ్రవరిలో నిర్వహించాల్సి ఉండగా, తాజా షెడ్యూల్లో మార్పుల వల్ల ఆ మెగా టోర్నీని ఆ ఏడాది అక్టోబర్‌కు పొడిగించారు.(బీసీసీఐ తీరు దారుణం: యువరాజ్) -
సినిమా ఇప్పట్లో కాదు!
► బయోగ్రఫీ ఆలోచన మాత్రం ఉంది ► వరల్డ్ కప్‌లోనూ సత్తా చూపిస్తాం ► ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెటర్‌గా 18 ఏళ్ల కెరీర్... దాదాపు 8 వేల పరుగులు... 133 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం... ప్రపంచ క్రికెట్‌పై హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ ముద్ర ప్రత్యేకం. ఇప్పటికీ వన్నె తగ్గని ఆటతో ఆమె తనదైన శైలిలో సత్తా చాటుతోంది. కెప్టెన్‌గా, అత్యుత్తమ బ్యాట్స్‌విమన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్న మిథాలీ నాయకత్వంలో ఇటీవలే భారత జట్టు వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. టోర్నీలో మూడు అర్ధ సెంచరీలతో ఆమె ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. బుధవారం బీసీసీఐ ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో 34 ఏళ్ల మిథాలీ రాజ్ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’గా అవార్డును సొంతం చేసుకుంది. మూడోసారి ఈ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో మిథాలీ రాజ్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ, ప్రధాన టోర్నీ కోసం జట్టు సన్నాహాలు, ఇతర అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంపై... చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడకపోవడం వల్ల క్వాలిఫయింగ్‌లో మేం తలపడాల్సి వచ్చింది. అయితే అది బోర్డు నిర్ణయం కాబట్టి మేమేం చేయలేం. మొదటి నుంచి టోర్నీలో మా స్థాయికి తగినట్లు ఆడి ఆధిక్యం ప్రదర్శించి అజేయంగా నిలవగలిగాం. అయితే క్వాలిఫయింగ్ టోర్నీ కూడా మంచే చేసింది. యువ క్రీడాకారిణులకు అవకాశమిచ్చేందుకు, వారిని పరీక్షించి అసలు ప్రపంచకప్ కోసం జట్టు కూర్పు గురించి ఒక అవగాహనకు వచ్చేందుకు ఇది ఉపయోగపడింది. మా అంచనాలకు తగినట్లుగా మోనా, దీప్తి, దేవిక, మాన్సి రాణించారు. నేను కూడా వేగంగా పరుగులు చేసేందుకు స్టాన్స్ మార్చి... కొత్తగా ప్రయత్నించి మంచి ఫలితాలు కూడా సాధించాను. ఉత్కంఠ భరిత ఫైనల్ గురించి... నిజానికి మేం ఆఖరి బంతి దాకా మ్యాచ్‌ను తీసుకు రాకుండా ఉండాల్సింది! వరుస ఓవర్లలో ముగ్గురు బ్యాట్స్‌విమన్ అవుట్ కావడం ఒక్కసారిగా దెబ్బ తీసింది. అయితే ప్రధాన ప్లేయర్ హర్మన్‌ప్రీత్ ఉంది కాబట్టి కాస్త ధైర్యంగా ఉన్నాం. అలాంటి స్థితిలో టెయిలెండర్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐదో బంతికి హర్మన్ కొట్టిన సిక్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దురదృష్టవశాత్తూ పాక్‌తో మ్యాచ్‌లో గాయపడటం వల్ల నేను ఫైనల్ ఆడలేకపోయినా, విజయం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రపంచ కప్‌లో అవకాశాలపై... మా సన్నాహాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. స్వదేశంలో విండీస్‌పై సిరీస్ విజయం, ఆసియా కప్, ఇప్పుడు క్వాలిఫయర్స్‌లో జట్టు విజయాలు సాధించింది. ఇప్పుడు నేరుగా ప్రపంచ కప్ బరిలోకే దిగుతాం కాబట్టి ఈ జోరును కొనసాగించడం ముఖ్యం. ఈ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కొత్త అమ్మాయిలు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచకప్ కోసం జులన్ గోస్వామి, స్మృతి మంథన తిరిగొస్తారు కాబట్టి టీమ్ ఇంకా పటిష్టంగా మారుతుంది. పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు చేయడం, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. వచ్చే మూడు నెలలు తీవ్రంగా సాధన చేయాలని పట్టుదలగా ఉన్నాం. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొనడంపై... తొలిసారి బిగ్‌బాష్ టి20 లీగ్ ప్రకటించినప్పుడు నాకు కూడా ఆహ్వానం వచ్చింది. అయితే అప్పుడు ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆడలేకపోయాను. అయితే ఈసారి అవకాశం దక్కించుకున్న హర్మన్‌ప్రీత్, స్మృతి దానిని చక్కగా ఉపయోగించుకున్నారు. క్వాలిఫయర్‌లో ధాటిగా ఆడేందుకు హర్మన్‌ప్రీత్‌కు బిగ్‌బాష్ అనుభవం ఉపయోగపడిందని చెప్పగలను. వీరిద్దరిని జాతీయ శిక్షణ శిబిరం కోసం బోర్డు వెనక్కి పిలిపించడంలో తప్పు లేదు. అన్నింటికంటే భారత జట్టుకు ఆడటమే ముఖ్యం. మున్ముందు నేనూ ఆడతానా లేదా చెప్పలేను. బోర్డు ప్రయోజనాలు అందించే విషయంపై... గతంతో పోలిస్తే బీసీసీఐ నుంచి మాకు మంచి మద్దతు లభిస్తోంది. గెలిచినప్పుడు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. అయితే ఇటీవలే పెన్షన్, ఏక మొత్తపు ప్రయోజనం గురించి చర్చ జరిగినట్లుంది. దీని కోసం కనీసం ఐదు టెస్టులు ఆడాలనే నిబంధన పెట్టారని తెలుస్తోంది. అయితే దీని వల్ల ఎక్కువ భాగం మందికి ప్రయోజనం దక్కదు. 2002 నుంచి గత పదిహేనేళ్లలో నేను కేవలం 10 టెస్టులే ఆడగలిగానంటే ఇక మిగతా వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు! మాకు సంబంధించి టెస్టు మ్యాచ్‌లు దాదాపు అంతర్ధానమైపోయాయి. కాబట్టి ఐదు వన్డేలను ఒక టెస్టు మ్యాచ్‌గా గుర్తిస్తే బాగుంటుందని నా సూచన. అప్పుడు 30 వన్డేలు ఆడినవారు కనీసం ఆరు టెస్టుల అర్హత మార్క్‌ను అందుకుంటే వారికి మేలు జరుగుతుంది. సీఓఏలో డయానా ఎడుల్జీ భాగమే అయినా ఆమె ప్రత్యేకంగా మహిళల క్రికెట్‌ను పర్యవేక్షించడం లేదు కాబట్టి ఆమె రాక వల్ల అదనపు లాభం ఉంటుందని భావించడం లేదు. సుదీర్ఘ కెరీర్‌పై... ఇంత కాలంగా ఆడటం చాలా సంతృప్తినిచ్చింది. వ్యక్తిగతంగా నా బ్యాటింగ్ ఫామ్‌ను ప్రపంచ కప్‌లోనూ కొనసాగించాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదిస్తున్నాను. వీలైనంత కాలం ఆడుతూనే ఉంటాను. ఈ విషయంలో రెండో ఆలోచనకు తావు లేదు. బయోగ్రఫీ, సినిమాపై... కొన్నాళ్ల క్రితమే నా బయోగ్రఫీ రాయడం గురించి కొంత మంది నన్ను సంప్రదించారు. అయితే నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నా బిజీ షెడ్యూల్లో దానికి సమయం కేటాయించలేకపోవడం కూడా ఒక కారణం. ఎప్పుడో చెప్పలేను కానీ కెరీర్ ముగించే సమయంలో ఆత్మకథ మాత్రం వస్తుంది. క్రికెట్‌ను ఎంచుకున్న నాటినుంచి కెరీర్లో ఈ స్థాయికి చేరే వరకు నా జీవితంలో కూడా ఎన్నో మలుపులు, విశేషాలు ఉన్నాయి. స్పోర్ట్స్‌మన్ బయోపిక్‌లు అందరినీ ఆకట్టుకుంటున్న మాట వాస్తవం. కానీ నాకు సంబంధించి అయితే ప్రస్తుతానికి సినిమాపరంగా ఎలాంటి ఆలోచన లేదు.