ఐసీసీ వన్డే క్వాలిఫయర్స్‌లో భాగంగా వెస్టిండీస్-నెదార్లాండ్స్ మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ మ్యాచ్‌లో పటిష్ట వెస్టిండీస్‌కు పసికూన నెదర్లాండ్స్ బిగ్‌షాక్ ఇచ్చింది. సూపర్ ఓవర్‌లో విండీస్‌పై డచ్ జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత ఇరు జట్ల స్కోర్‌లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు.. ఆ జట్టు ఆల్‌రౌండర్ వాన్ బీక్ 4,6,4,6,6,4 బాది 30 పరుగులు అందించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే విండీస్ ఇన్నింగ్స్ సూపర్ ఓవర్ వాన్ బీక్ వేయడం గమనార్హం. అంతకుముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది.
విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (65 బంతుల్లో 104) సెంచరీతో చెలరేగగా.. బ్రాండన్ కింగ్ 76, జాన్సన్ చార్లెస్ 54 పరుగులతో రాణించారు. అనంతరం 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డచ్ కూడా నిర్ణీత ఓవర్లలో 374 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. టైకావడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్‌లో తేల్చాల్సి వచ్చింది. కాగా డచ్ బ్యాటర్లో తేజ నిడమనూరు (111) సెంచరీతో కదం తొక్కాడు.
వాన్ బీక్ ప్రపంచ రికార్డు..
ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ఊచకోత కోసిన వాన్ బీక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సూపర్ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వాన్ బీక్ నిలిచాడు. జాసన్ హోల్డర్ వేసిన సూపర్ ఓవర్‌లో 4,6,4,6,6,4 బాది వాన్ బీక్ 30 పరుగులు రాబట్టాడు. టీ20, వన్డే ఫార్మాట్‌లో ఇదే అత్యధికం. ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు.
అదే విధంగా సూపర్ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా కూడా నెదార్లాండ్స్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. వన్డే, టీ20 ఫార్మాట్‌లో విండీస్ సూపర్ ఓవర్‌లో 25 పరుగులు నమోదు చేసింది.
చదవండి: నేడే వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ విడుదల
Crazy SUPER OVER between Netherlands and West Indies
— . (@MSD_071113_) June 26, 2023
Netherlands - 4,6,4,6,6,4
West Indies - 6,1,1,W,W
NED won the Super over by 22 runs
Logan Van Beek , The hero of the Match 🔥🔥🔥pic.twitter.com/aLDezsBdjw
Comments
Please login to add a commentAdd a comment