Logan van Beek
-
భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. విలవిలలాడిన నెదర్లాండ్స్ బౌలర్, చెత్త రికార్డు
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్ జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు మెరుపు వేగంతో 50 అంటకంటే ఎక్కువ స్కోర్లు చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఒకరికిమించి ఒకరు పేట్రేగిపోవడంతో నెదర్లాండ్స్ బౌలర్లు విలవిలలాడిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ పేసర్ లొగాన్ వాన్ బీక్ భారత బ్యాటర్ల విధ్వంసం ధాటికి బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన వాన్ బీక్ ఏకంగా 107 పరుగులు సమర్పించుకుని వరల్డ్‌కప్‌లో మూడో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు కూడా నెదర్లాండ్స్ బౌలర్ పేరిటే ఉండటం విశేషం. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బాస్ డి లీడ్ ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. ఆతర్వాత వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ 110 పరుగులు సమర్పించుకున్నాడు. -
నెదర్లాండ్స్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. శ్రీలంక టార్గెట్ 263 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకపై నెదర్లాండ్స్ బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు 262 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడిన నెదర్లాండ్స్‌ను.. ఎంగెల్‌బ్రెచ్ట్, వాన్ బీక్ అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 135 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే 7వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరిద్దరూ నిలిచారు. ఎంగెల్‌బ్రెచ్ట్ 82 బంతుల్లో 70 పరుగులు చేయగా.. వాన్ బీక్ 75 బంతుల్లో 59 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అకెరమన్ 29 పరుగులతో పర్వాలేదనపించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో పేసర్లు మధుశంక, రజితా తలా నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్ రాజా -
కోహ్లిని ఔట్ చేయడానికి ఐదు బంతులు చాలు.. పసికూన బౌలర్ వార్నింగ్
నెదర్లాండ్స్.. వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టి భారత్ వేదికగా జరగనున్న ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌ను చిత్తు చేసి మరి డచ్ జట్టు ప్రపంచకప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. బెంగళూరు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమించింది. భారత నెట్‌బౌలర్లను ఎంపిక చేసి మరీ తమ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్, చెన్నైకు చెందిన నెట్‌బౌలర్లు డచ్ జట్టుతో జత కట్టారు. ఇక ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా, భారత్‌తో వార్మాప్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో నెదర్లాండ్స్.. టీమిండియాతో కూడా తలపడనుంది. భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 12 బెంగళూరు వేదికగా జరగనుంది. అయితే భారత్‌తో మ్యాచ్‌కు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు డచ్ స్టార్ ఆల్‌రౌండర్ లోగాన్ వాన్ బీక్ తెలిపాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్చేసేందుకు ఇప్పటికే ప్లాన్లు వేసేసుకున్నామని చెప్పాడు. తను కేవలం 5 బంతుల్లోనే కోహ్లిని ఔట్ చేస్తానని థీమా వ్యక్తం చేశాడు. "నేను విరాట్ కోహ్లికి బౌలింగ్ చేసేటప్పుడు మొదటి రెండు బంతులను ఔట్స్వింగర్లగా సంధిస్తాను. ఆ తర్వాత బంతని ఆఫ్ కట్టర్ స్లోయర్ బాల్ వేస్తాను. అప్పుడు విరాట్ పోర్ కొడతాడని నాకు తెలుసు. దీంతో చికాకు పడినట్లు నటిస్తా. ఒక ఐదు నిమిషాలు ఆట జరగకుండా ఆపేస్తా. కెప్టెన్‌ను పిలిచి ఏదో మాట్లాడుతున్నట్లు ఇద్దరం నటిస్తాము. ఏదో ఒక వైపు చెయ్యి చూపించి అటువైపు బౌలింగ్ చేస్తున్నట్లు యాక్ట్చేస్తాను. కానీ నేను ఆ దిశగా బౌలింగ్ చేయను. అతడిని నేను మోసం చేస్తాను. నాలుగో బంతిని హాఫ్ సైడ్‌గా వేస్తాను. అది కూడా అతడు బౌండరీకి పంపిస్తాడు. భారత అభిమానులు ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిస్తారు. కోహ్లిలో కూడా మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నాకు కూడా కావల్సింది అదే. ఈ సమయంలో ఐదో బంతిని వేసేముందు పైకి ఒక్కసారి చూస్తా. ఈ క్షణం నన్ను ఏం అడిగినా చేస్తా జస్ట్ కోహ్లి వికెట్ ప్రసాదించు స్వామీ అని క్రికెట్ దేవుళ్లను కోరుకుంటా. కళ్లు మూసుకొని వచ్చి వేస్తా ఆ బంతికి కోహ్లి అవుటైపోతాడు' అని క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోగాన్ వాన్ పేర్కొన్నాడు. -
Trending Pic: విండీస్ యోధుడి ముఖం చినబోయిన వేళ..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్ సూపర్ సిక్స్‌కు చేరినప్పటికీ.. వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్‌లో విండీస్ ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్‌కప్ బెర్త్ దొరకడం ఖాయమని తెలుస్తుంది. కాగా, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం యావత్ వెస్టిండీస్ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ కార్ల్ హూపర్తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రజంటేషన్ సందర్భంగా విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్.. యావత్ విండీస్ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్ వాన్ బీక్కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్‌వైట్ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పిక్ చూసి క్రికెట్ అభిమానులు విండీస్‌పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్ బ్రాత్‌వైట్ 2016లో విండీస్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్‌వైట్.. బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. -
చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా!
ఐసీసీ వన్డే క్వాలిఫయర్స్‌లో భాగంగా వెస్టిండీస్-నెదార్లాండ్స్ మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ మ్యాచ్‌లో పటిష్ట వెస్టిండీస్‌కు పసికూన నెదర్లాండ్స్ బిగ్‌షాక్ ఇచ్చింది. సూపర్ ఓవర్లో విండీస్‌పై డచ్ జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు.. ఆ జట్టు ఆల్‌రౌండర్ వాన్ బీక్ 4,6,4,6,6,4 బాది 30 పరుగులు అందించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే విండీస్ ఇన్నింగ్స్ సూపర్ ఓవర్ వాన్ బీక్ వేయడం గమనార్హం. అంతకుముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (65 బంతుల్లో 104) సెంచరీతో చెలరేగగా.. బ్రాండన్ కింగ్ 76, జాన్సన్ చార్లెస్ 54 పరుగులతో రాణించారు. అనంతరం 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డచ్ కూడా నిర్ణీత ఓవర్లలో 374 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. టైకావడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్లో తేల్చాల్సి వచ్చింది. కాగా డచ్ బ్యాటర్లో తేజ నిడమనూరు (111) సెంచరీతో కదం తొక్కాడు. వాన్ బీక్ ప్రపంచ రికార్డు.. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్లో ఊచకోత కోసిన వాన్ బీక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వాన్ బీక్ నిలిచాడు. జాసన్ హోల్డర్ వేసిన సూపర్ ఓవర్లో 4,6,4,6,6,4 బాది వాన్ బీక్ 30 పరుగులు రాబట్టాడు. టీ20, వన్డే ఫార్మాట్లో ఇదే అత్యధికం. ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. అదే విధంగా సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా కూడా నెదార్లాండ్స్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. వన్డే, టీ20 ఫార్మాట్లో విండీస్ సూపర్ ఓవర్లో 25 పరుగులు నమోదు చేసింది. చదవండి: నేడే వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ విడుదల Crazy SUPER OVER between Netherlands and West Indies Netherlands - 4,6,4,6,6,4 West Indies - 6,1,1,W,W NED won the Super over by 22 runs Logan Van Beek , The hero of the Match 🔥🔥🔥pic.twitter.com/aLDezsBdjw — . (@MSD_071113_) June 26, 2023