నెదర్లాండ్స్.. వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టి భారత్ వేదికగా జరగనున్న ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌ను చిత్తు చేసి మరి డచ్ జట్టు ప్రపంచకప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది.
బెంగళూరు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమించింది. భారత నెట్‌బౌలర్లను ఎంపిక చేసి మరీ తమ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్, చెన్నైకు చెందిన నెట్‌బౌలర్లు డచ్ జట్టుతో జత కట్టారు. ఇక ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.
అంతకంటే ముందు ఆస్ట్రేలియా, భారత్‌తో వార్మాప్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న నేపథ్యంలో నెదర్లాండ్స్.. టీమిండియాతో కూడా తలపడనుంది. భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 12 బెంగళూరు వేదికగా జరగనుంది.
అయితే భారత్‌తో మ్యాచ్‌కు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు డచ్ స్టార్ ఆల్‌రౌండర్ లోగాన్ వాన్ బీక్ తెలిపాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్‌చేసేందుకు ఇప్పటికే ప్లాన్లు వేసేసుకున్నామని చెప్పాడు. తను కేవలం 5 బంతుల్లోనే కోహ్లిని ఔట్ చేస్తానని థీమా వ్యక్తం చేశాడు.
"నేను విరాట్ కోహ్లికి బౌలింగ్ చేసేటప్పుడు మొదటి రెండు బంతులను ఔట్‌స్వింగర్లగా సంధిస్తాను. ఆ తర్వాత బంతని ఆఫ్ కట్టర్ స్లోయర్ బాల్ వేస్తాను. అప్పుడు విరాట్ పోర్ కొడతాడని నాకు తెలుసు. దీంతో చికాకు పడినట్లు నటిస్తా.
ఒక ఐదు నిమిషాలు ఆట జరగకుండా ఆపేస్తా. కెప్టెన్‌ను పిలిచి ఏదో మాట్లాడుతున్నట్లు ఇద్దరం నటిస్తాము. ఏదో ఒక వైపు చెయ్యి చూపించి అటువైపు బౌలింగ్ చేస్తున్నట్లు యాక్ట్‌చేస్తాను. కానీ నేను ఆ దిశగా బౌలింగ్ చేయను. అతడిని నేను మోసం చేస్తాను. నాలుగో బంతిని హాఫ్ సైడ్‌గా వేస్తాను.
అది కూడా అతడు బౌండరీకి పంపిస్తాడు. భారత అభిమానులు ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిస్తారు. కోహ్లిలో కూడా మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నాకు కూడా కావల్సింది అదే. ఈ సమయంలో ఐదో బంతిని వేసేముందు పైకి ఒక్కసారి చూస్తా.
ఈ క్షణం నన్ను ఏం అడిగినా చేస్తా జస్ట్ కోహ్లి వికెట్ ప్రసాదించు స్వామీ అని క్రికెట్ దేవుళ్లను కోరుకుంటా. కళ్లు మూసుకొని వచ్చి వేస్తా ఆ బంతికి కోహ్లి అవుటైపోతాడు' అని క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోగాన్ వాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment