నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన రాహుల్‌, గిల్‌.. కోహ్లి డుమ్మా | Shubman Gill tonks bowlers in nets, Kohli skips session ahead of IND vs NED game | Sakshi
Sakshi News home page

WC 2023: నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన రాహుల్‌, గిల్‌.. కోహ్లి డుమ్మా

Published Wed, Nov 8 2023 9:43 PM | Last Updated on Thu, Nov 9 2023 10:58 AM

Shubman Gill tonks bowlers in nets, Kohli skips session ahead of IND vs NED game - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడనుంది. ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్న భారత జట్టు.. బుధవారం తమ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోంది. నెట్‌ ప్రాక్టీస్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడ్చారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ ప్రాక్టీస్‌ సెషన్‌​కు భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి దూరమయ్యాడు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఎక్కువ సమయం పాటు నెట్స్‌లో గడిపినట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ప్రసిద్ద్‌ కృష్ణను తుది జట్టులోకి తీసుకురానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
చదవండిWC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్‌ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement