![World Cup Qualifier 2023 Fixtures Announced - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/23/Untitled-16.jpg.webp?itok=wLpgCAZ7)
మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ 2023 (వన్డే ఫార్మాట్) క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం (మే 23) విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. జింబాబ్వే, వెస్టిండీస్, ద నెదార్లండ్స్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి.
తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి.
సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్ 2 ప్లేసెస్‌లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి.
కాగా, భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
The @ICC Men’s Cricket World Cup Qualifier 2023 Match Schedule is now available 🎉🤩
— Zimbabwe Cricket (@ZimCricketv) May 23, 2023
👇 Check it out 👇#RoadToCWC23 | #CWC23 | #VisitZimbabwe pic.twitter.com/Mu31QRdRdR
Comments
Please login to add a commentAdd a comment