జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్(ICC CWC Qualifiers 2023) మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మెయిన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా ఆ రెండు స్థానాల కోసం 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది.
కాగా క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.ఇక జింబాబ్వే జట్టుకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున్నఅభిమానులు తరలివచ్చారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా జింబాబ్వే అభిమానుల చర్య అందరిని ఆకట్టుకుంటుంది.
ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున నగరవా 4 వికెట్లు తీశాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రెయిగ్ ఎర్విన్ 128 బంతుల్లో 121 పరుగులు చేయగా.. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Shout out and respect to @ZimCricketv fans for remaining behind and clearing the litter.@AdamTheofilatos @GodwillMamhiyo @bayhaus @CastleCornerZW pic.twitter.com/pquPDTznRY
— Gildredge (@gillmbaku_zw) June 18, 2023
Comments
Please login to add a commentAdd a comment