Harare
-
Ind vs Zim: సికందర్ రజా వరల్డ్ రికార్డు
టీమిండియా నాలుగో టీ20లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా పట్టుదలగా నిలబడి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అయితే, భారత అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రజా విఫలమయ్యాడు.అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతిని మోకాలి మీద కూర్చుని గాల్లోకి లేపాడు. అయితే, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేగంగా కదిలి బంతిని అందుకున్నాడు. ఫలితంగా సికందర్ రజా ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా వరల్డ్ రికార్డుఇదిలా ఉంటే.. హరారే వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికందర్ రజా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో యాభైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు పూర్తి చేసుకున్న జింబాబ్వే తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్‌రౌండర్‌గా రికార్డు సాధించాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సికందర్ రజా.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!అంతర్జాతీయ టీ20(పురుష క్రికెట్)లలో 2 వేలకు పైగా పరుగులు, యాభైకి పైగా వికెట్లు సాధించిన క్రికెటర్లు వీరే1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2551 రన్స్, 149 వికెట్లు2. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 2165 రన్స్, 96 వికెట్లు3. విరన్‌దీప్ సింగ్(మలేషియా)- 2320 రన్స్, 66 వికెట్లు4. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- 2514 రన్స్, 61 వికెట్లు5. సికందర్ రజా(జింబాబ్వే)- 2001 రన్స్,65 వికెట్లుమెరుగ్గా రాణించిటీమిండియాతో నాలుగో టీ20లో టాస్ ఓడిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. -
టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే
Zimbabwe vs India, 4th T20I Updates: జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో టీ20 ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో శుబ్‌మన్ గిల్ సేన ఆధిక్యంలో ఉంది. శనివారం టీ20లో టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ విజృంభించింది. ఓపెర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దంచికొట్టారు. జైస్వాల్ 93 పరుగులతో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్( వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.జింబాబ్వే తుదిజట్టు: వెస్లీ మెదెవెరె, తాడివానాషే మరుమానీ, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చటారా.అప్డేట్స్14.1: గిల్ అర్ధ శతకం12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/0 (12)జింబాబ్వే బౌలింగ్‌ను చిత్తు చేస్తూ టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 12వ ఓవర్ముగిసే సరికి జైస్వాల్ 75, గిల్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలోనే టీమిండియా స్కోరు: 106-0శుబ్‌మన్ గిల్ 37, యశస్వి జైస్వాల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.6.3: 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకు న్న యశస్వి జైస్వాల్పవర్ ప్లేలో యశస్వి పరుగుల వరదఆరో ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ 47(26), శుబ్‌మన్ గిల్ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 61/0 (6)దంచికొడుతున్న యశస్విజింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఘనంగా తమ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆది నుంచే జింబాబ్వే బౌలర్లపై అటాక్ చేస్తున్నారు.మూడు ఓవర్లు ముగిసే సరికి యశస్వి 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించగా.. గిల్ ఐదు బంతుల్లో 11 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 153ఆతిథ్య జట్టు ఓపెనర్లు వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) సహా కెప్టెన్ సికందర్ రజా(46) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లుఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి మేయర్స్(12), ఆఖరి బంతికి మందాడే(7)ను పెవిలియన్‌కు పంపాడు.18.3: రజా హాఫ్ సెంచరీ మిస్ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరం(28 బంతుల్లో 46) నిలిచిపోయాడు. రజా రూపంలో జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది.జింబాబ్వే స్కోరు: 147/5 (19) పదిహేడు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 129/4రజా 42, మేయర్స్ తొమ్మిది పరుగులతో ఆడుతున్నారు14.4: నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వేబ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో సికందర్ రజా పరుగుకు యత్నించగా.. మరో ఎండ్‌లో ఉన్న క్యాంప్‌బెల్ వేగంగా కదలలేకపోయాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న బిష్ణోయి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా.. బాల్ వికెట్లను గిరాటేసింది. ఫలితంగా క్యాంప్‌బెల్(3) రనౌట్ అయ్యాడు. 13.4: మూడో వికెట్ డౌన్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బ్రియాన్ బెనెట్ యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.జొనాథన్ క్యాంప్‌బెల్ క్రీజులోకి వచ్చాడు. సికందర్‌రజా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే స్కోరు: 93/3 (14).9.6: రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వేపేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే బౌలింగ్‌లో జింబాబ్వే ఓపెనర్ వెస్లీ(25) పెవిలియన్ చేరాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. రింకూ సింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వెస్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా 0, బ్రియాన్ బెనెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 67-2.7.1: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకు న్న జింబాబ్వేవాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమానీ రెండు పరుగులు తీయగా.. జింబాబ్వే యాభై పరుగుల మార్కు అందుకుంది.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 44/0ఆరు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 19, మరుమానీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. తన పేస్ పదనుతో జింబాబ్వేకు తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.ఇక రెండో ఓవర్ వేసిన అరంగట్రే పేసర్ తుషార్ దేశ్‌పాండే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 15 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 12, మరుమానీ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన భారత జట్టుశనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. హరారే వేదికగా జరుగనున్న ఈ టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.తుషార్ దేశ్‌పాండే అరంగేట్రంఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే అరంగేట్రం చేస్తున్నట్లు గిల్ తెలిపాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.మరోవైపు.. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తెలిపాడు. వెల్లింగ్టన్ మసకజ్ద స్థానంలో ఫరాజ్ అక్రం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. -
'జట్టు గెలుపుకన్నా ఇదెక్కువ ఆనందాన్నిస్తోంది'
జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్(ICC CWC Qualifiers 2023) మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. జింబాబ్వేలో జరుగుతున్న టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మెయిన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా ఆ రెండు స్థానాల కోసం 8 జట్ల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. కాగా క్వాలిఫయర్ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ తలపడ్డాయి. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ ఆటతో జింబాబ్వే అద్భుత విజయాన్ని అందుకుంది.ఇక జింబాబ్వే జట్టుకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున్నఅభిమానులు తరలివచ్చారు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్లే ముందు స్టేడియం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా జింబాబ్వే అభిమానుల చర్య అందరిని ఆకట్టుకుంటుంది. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్స్ షువావ్ బర్టెల్, ఆసిఫ్ షేక్ మెుదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, కుశాల్ 95 బంతుల్లో 99 పరుగులు చేసి.. సెంచరీకి 1 పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఆసిఫ్ 66 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున నగరవా 4 వికెట్లు తీశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి గెలిచింది. జొలార్డ్ గుంబి(25), వెస్లీ మాధేవేర్(32) త్వరగానే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు గెలుపుని అందించారు. క్రెయిగ్ ఎర్విన్ 128 బంతుల్లో 121 పరుగులు చేయగా.. విలియమ్స్ 70 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. Shout out and respect to @ZimCricketv fans for remaining behind and clearing the litter.@AdamTheofilatos @GodwillMamhiyo @bayhaus @CastleCornerZW pic.twitter.com/pquPDTznRY — Gildredge (@gillmbaku_zw) June 18, 2023 చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం' -
Zim Vs Ire: ఐర్లాండ్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సిరీస్ కైవసం
Zimbabwe vs Ireland, 3rd T20I: సొంతగడ్డపై జింబాబ్వే సత్తా చాటింది. ఐర్లాండ్‌తో మూడో టీ20లో విజయం సాధించింది. పర్యాటక జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకై ఐర్లాండ్ జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో జింబాబ్వే ఆఖరి వరకు పోరాడి ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది. టెక్టర్ ఒక్కడే ఐర్లాండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 47 పరుగులతో ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కర్టిస్ కాంఫర్ 27, డాక్రెల్ 23 పరుగులతో రాణించారు. సిరీస్ విజేత జింబాబ్వే (PC: Zimbabwe Cricket) చివరి వరకు పోరాడినా ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకం(54)తో రాణించి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నాడు. అయితే, ఐర్లాండ్ మాత్రం పట్టు సడలించలేదు. ఈ దశలో ఆల్‌రౌండర్ ర్యాన్ బర్ల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత రెండు మ్యాచ్‌లలోనూ రాణించిన అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మూడో టీ20 స్కోర్లు ఐర్లాండ్- 141/9 (20) జింబాబ్వే- 144/6 (19) చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? -
Ind Vs Zim: కచ్చితంగా టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: జింబాబ్వే కోచ్
India tour of Zimbabwe, 2022- ODI Series: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసం చేసుకుని జోరు మీదుంది జింబాబ్వే క్రికెట్ జట్టు. టీ20, వన్డే సిరీస్‌లో అనూహ్య రీతిలో పర్యాటక బంగ్లాకు షాకిచ్చి 2-1తో ఓడించింది. ఇదే జోష్‌లో టీమిండియాతో పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జింబాబ్బే జట్టు హెడ్ కోచ్ డేవిడ్ హౌన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి పటిష్ట జట్టుతో ఆడటం తమకు లభించిన గొప్ప అవకాశమన్న డేవిడ్.. తాము కచ్చితంగా గట్టి పోటీనిస్తామనే భావిస్తున్నామని తెలిపాడు. గత కొన్ని రోజులుగా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నామని.. రానున్న సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. గట్టి పోటీనిస్తాం! ఈ మేరకు స్పోర్ట్స్ స్టార్‌తో డేవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఇండియా ఇక్కడికి రావడం మనకు లభించిన మంచి అవకాశం అని డ్రెస్సింగ్ రూంలో మా వాళ్లకు నేను చెప్పాను. మెరుగైన స్కోర్లు నమోదు చేయడంతో పాటుగా.. ప్రపంచంలోని మేటి జట్టుపై మెరుగైన స్కోరు నమోదు చేసే విధంగా ముందుకు సాగాలన్నాను. అయితే, కేవలం నంబర్లకే పరిమితమైతే సరిపోదు కచ్చితంగా రాణించాలని.. గట్టి పోటీనివ్వాల్సి ఉంటుందని వాళ్లకు చెప్పాను. నిజంగానే మా వాళ్లు ఆ పని చేస్తారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే! అదే విధంగా.. ‘‘నా దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మేము గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగినపుడే అన్నీ సాధ్యమవుతాయి. గత కొన్ని రోజులుగా మేము ఇలాంటి ఆశావహ దృక్పథం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. ఇకపై కూడా.. ముఖ్యంగా టీమిండియా విషయంలోనూ ఇదే కొనసాగించగలమని నమ్ముతున్నా’’ అని డేవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో లాల్‌చంద్ రాజ్‌పుత్ స్థానంలో జింబాబ్వే హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు డేవిడ్. అతడి మార్గదర్శనంలో జింబాబ్వే జట్టు టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి అర్హత సాధించడంతో పాటుగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అదరగొట్టింది. ఇక.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 18, 20, 22 తేదీల్లో హరారే వేదికగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య జట్టుతో తలపడనుంది. చదవండి: IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ -
ఎనిమిదో నెంబర్ ఆటగాడు అజేయ శతకం; బంగ్లా భారీస్కోరు
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహ్ముదుల్లా (150 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. దీంతో 294/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 126 ఓవర్లలో 468 పరుగుల వద్ద ఆలౌటైంది. మహ్ముదుల్లా, టెయిలెండర్ టస్కిన్ అహ్మద్ (75; 11 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 191 పరుగులు జోడించడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక తొమ్మిదవ వికెట్ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. కైటనో (33 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
'ఈ అవార్డు నా చిట్టితల్లికి అంకితం'
హరారే: పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం జింబాబే దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న పాక్ రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది. జింబాబ్వేతో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన హసన్ అలీ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఓవరాల్‌గా 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం పాక్ క్రికెటర్ హసన్ అలీకి 2019లో వివాహమైంది. 'గత ఏప్రిల్ నెలలో హసన్ అలీకి కూతురు పుట్టింది. కూతురు రాక అతని అదృష్టం కలిసొచ్చిందంటూ' ఒక జర్నలిస్ట్ ట్విటర్లో కామెంట్ చేశాడు. దీనిపై హసన్ అలీ రీట్వీట్ చేశాడు. '' నా కూతురు పుట్టినప్పటి నుంచి నా ప్రదర్శన చాలా మెరుగైంది. నా కూతురే దేవుడి రూపంలో నా వెంట ఉంటూ నాకు ఆశీర్వాదం అందించింది. అందుకే ఈరోజు మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. అందుకే నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది అవార్డును నా చిట్టితల్లికి అంకితమిస్తున్నా. నా కూతురును చాలా మిస్సవుతున్నా.. కానీ బందుత్వం కంటే దేశానికి ఆడాలనేది నా మొదటి ప్రాధాన్యత.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హసన్ అలీ పాక్ తరపున 12 టెస్టుల్లో 52, 54 వన్డేల్లో 83, 36 టీ20ల్లో 48 వికెట్లు తీసుకున్నాడు. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ బ్యాటింగ్‌లో పవాద్ ఆలమ్ 140 పరుగులతో రాణించాడు. అనంతరం ఫాలోఆన్ ఆడిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా రెండో టెస్టు మే 7 నుంచి 11 వరకు జరగనుంది. చదవండి: మరణించిన క్రికెటర్‌కు ‘హ్యాపీ బర్త్‌డే‘ చెప్పిన బోర్డు! -
వికెట్ తీశాడు.. చిత్రమైన సెలబ్రేషన్‌తో మెరిశాడు
హరారే: క్రికెట్లో బౌలర్ వికెట్ తీసినప్పుడు.. బ్యాట్స్‌మన్ సెంచరీ చేసినప్పుడు.. ఒక జట్టు మ్యాచ్ గెలిచినప్పుడు రకరకాలుగా తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అందునా కొందరు క్రికెటర్లు మాత్రం తమ సెలబ్రేషన్స్‌తో ఎప్పటికీ మదిలో నిలిచిపోతుంటారు. ఇలాంటి సెలబ్రేషన్స్ ఎక్కువగా మనం విండీస్ క్రికెటర్లలో చూస్తుంటాం. వీరంతా డ్యాన్స్.. సెల్యూట్ ఇలా రకరకాల వేరియేషన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటే.. దక్షిణాఫ్రికా క్రికెటర్ తబ్రేజ్ షంసీ వికెట్ తీసినప్పుడల్లా తన కాలికున్న షూను తీసి చెవి దగ్గరు పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా చేస్తూ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకుంటాడు. అచ్చం అతని తరహాలోనే జింబాబ్వే క్రికెటర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో జింబాబ్వే బౌలర్ ల్యూక్ జోంగ్వే ఇన్ఫాం బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో పెద్ద వికెట్ తీశానన్న ఆనందంలో జోంగ్వే తన కాలికున్న షూ తీసి చెవి దగ్గరు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనిపై దక్షిణాఫ్రికా బౌలర్ షంసీ స్పందించాడు..'' కూల్ బ్రదర్.. ఇంత మంచి గేమ్‌లో నీ సెలబ్రేషన్ సూపర్.. నన్ను మరిపించేలా నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావ్..'' అంటూ కామెంట్ చేశాడు. షంసీ కామెంట్స్‌పై ల్యూకో జోంగ్వే తనదైన రీతిలో స్పందించారు. ''దీనికి ఆద్యుడు నువ్వే.. ఒక బ్రదర్‌గా నేను బోర్డర్ నుంచి నిన్ను ఇమిటేట్ చేశా'' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. ల్యూకో జోంగ్వే 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం అయింది. ఇరు జట్లకు కీలకమైన మూడో టీ20 రేపు (ఏప్రిల్ 25న) జరగనుంది. చదవండి: ఆ బౌన్సర్‌కు హెల్మెట్ సెపరేట్ అయ్యింది..! Shamsi's brother spotted in Zimbabwe ❤️@shamsi90 #PakvZim #ZimvPak #Cricket #BabarAzam pic.twitter.com/YQ6T80qjZ4 — Noman Views (@Noman2294) April 23, 2021 -
మిలటరీ గుప్పిట్లో జింబాబ్వే
హరారే : దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది. అధ్యక్షుడి చుట్టూ ఉన్న కొందరు దేశానికి సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొంది. అయితే, ముగాబే(93), ఆయన కుటుంబం తమ రక్షణలోనే ఉన్నట్లు దేశ అధికారిక టీవీలో మేజర్ జనరల్ ఎస్బీ మోయో చెప్పారు. దేశంలోని కీలకప్రాంతాల్లో(పార్లమెంటు, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు) జింబాబ్వే మిలటరీ పెద్ద ఎత్తున ఆయుధ వాహనాలను మోహరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. క్రిమినల్స్‌ను మట్టుబెట్టిన అనంతరం దేశంలో ప్రశాంతతను పునః ప్రతిష్టిస్తామని మోయో పేర్కొన్నారు. బుధవారం ఉదయం జింబాబ్వే ఆర్థిక శాఖ మంత్రిని మిలటరీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముగాబే పార్టీ జాను-పీఎఫ్ కేంద్ర కార్యాలయాన్ని మంగళవారం మిలటరీ సీజ్ చేసింది. జానూ-పీఎఫ్ మిత్రపక్షాల మధ్య ఉన్న సమస్యలపై తాను జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నట్లు మిలటరీ చీఫ్ జనరల్ కన్స్టాంటినో చివాంగా చెప్పిన 24 గంటల్లోనే మిలటరీ దళాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అనంతరం జింబాబ్వే అధికారిక టీవీ జింబాబ్వీ స్టేట్ బ్రాడ్‌కాస్టర్(జెడ్‌బీసీ)లోకి సైనికులు చొచ్చుకెళ్లారు. కొందరు జెడ్‌బీసీ ఉద్యోగులపై సైనికులు చేయి చేసుకున్నట్లు కూడా తెలిసింది. 1980లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన నాటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే గెలుపొందుతూ వస్తున్నారు. -
జింబాబ్వే మళ్లీ జిగేల్ వునేనా?
నేడు దక్షిణాఫ్రికాతో వ్యూచ్ హరారే: స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియూపై సంచలన విజయుం సాధించిన జింబాబ్వే ఇప్పుడు ఫైనల్ బెర్తుపై కన్నేసింది. గురువారం హరారేలో జరిగే ముక్కోణపు సిరీస్ చివరి వ్యూచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే పటిష్టమైన దక్షిణాఫ్రికాపై గెలుపు అంత సలువు కాకపోయినా.. వురోసారి సంచలనంపై జింబాబ్వే ఆశలు పెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆతిథ్య జట్టు ఫైనల్‌కు చేరడం అంత సులువుకాదు. ఆస్ట్రేలియూ (10 పాయింట్లు) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా... దక్షిణాఫ్రికా (9 పాయింట్లు) కూడా దాదాపుగా బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం జరిగే చివరి వ్యూచ్‌లో దక్షిణాఫ్రికాపై జింబాబ్వే (4 పాయింట్లు) బోనస్ పాయింట్‌తో గెలవాలి. దాంతో పాటు దక్షిణాఫ్రికా కన్నా మెరుగైన రన్‌రేట్‌ను సాధించాలి. అప్పుడే జింబాబ్వే ఫైనల్‌కు చేరుకునే అవకాశాలుంటాయి. ఒకవేళ జింబాబ్వే ముందుగా బ్యాటింగ్‌కు దిగి 250 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికాను 133 పరుగుల భారీ తేడాతో ఓడించాలి. ఒకవేళ దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగిన 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే అప్పుడు జింబాబ్వే 23.3 ఓవర్లలోనే ఛేదించాలి. -
సెంచరీల మోత
- ఆసీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం - ముక్కోణపు సిరీస్ హరారే: కెప్టెన్ డివిలియర్స్ (106 బంతుల్లో 136 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (98 బంతుల్లో 106; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో ముక్కోణపు సిరీస్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ప్రొటీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 327 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (116 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు బెయిలీ (66), హ్యూస్ (51) ఫర్వాలేదనిపించారు. మోర్నీ మోర్కెల్, తాహిర్, మెక్లారెన్ తలా రెండు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 3 వికెట్లకు 328 పరుగులు చేసింది. డు ప్లెసిస్, డివిలియర్స్ మూడో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. మరో 20 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా భారీ లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. స్టార్క్ 2 వికెట్లు తీశాడు. -
‘ఉడతా’భక్తిగా..
ఓ యువతి జుట్టులోంచి తొంగిచూస్తున్న ఈ ఉడత పేరు హమ్మీ...ఇక ఈమె పేరు అబ్బిపుటిరెల్(16)... వీళ్లిద్దరూ మంచి స్నేహితులు... రెండు నెలల నుంచి కలసిమెలసి ఉంటున్నారు. అబ్బి ఎక్కడికి వెళ్లిన తనతో పాటు హమ్మీ(ఉడత)ను కూడా వెంటతీసుకెళుతుంది. జింబాబ్వేలోని హరారే పట్టణానికి సమీపంలో ఉండే అబ్బిపుటిరెల్వాళ్లకు సొంతంగా జంతువుల అభయారణ్యం ఉంది. ఒక రోజు అబ్బి అమ్మానాన్నలతో కలసి అభయారణ్యంలోని తమ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ అనుకోకుండా ఒక ఉడతపిల్ల వదలుగా ఉండే అబ్బి జుట్టులో దూరి అక్కడే ఉండిపోయింది. జుట్టునే తన గూడుగా భావిస్తూ గత రెండునెలలుగా అబ్బితోనే ఉంటుంది. అప్పటి నుంచి అబ్బి ఇంట్లోవాళ్లు కూడా హమ్మీని తమ ఇంట్లో మనిషిలాగే చూసుకుంటున్నారు. ఇక అబ్బి అయితే తన జుట్టును గూడుగా మార్చడమే కాదు...ఉడతను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ జంతువుల పట్ల తన ప్రేమను ‘ఉడతా’భక్తిగా చాటుకుంటోంది