హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహ్ముదుల్లా (150 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. దీంతో 294/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 126 ఓవర్లలో 468 పరుగుల వద్ద ఆలౌటైంది. మహ్ముదుల్లా, టెయిలెండర్ టస్కిన్ అహ్మద్ (75; 11 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 191 పరుగులు జోడించడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక తొమ్మిదవ వికెట్ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. కైటనో (33 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment