Zimbabwe Batter Ryan Burl Smashes 34 Runs In Single-Over Vs BAN T20 - Sakshi
Sakshi News home page

Zimbabwe Batter Ryan Burl: జింబాబ్వే బ్యాటర్‌ విధ్వంసం.. ఒకే ఓవర్లో 34 పరుగులు

Published Wed, Aug 3 2022 7:24 AM | Last Updated on Wed, Aug 3 2022 9:20 AM

Zimbabwe Batter Ryan Burl Smashes 34 Runs Single-Over Vs BAN T20 - Sakshi

ఇటీవలే టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించామన్న సంబరంలో ఉన్న జింబాబ్వే అందుకు తగ్గ ఆటతీరుతో దూసుకుపోతుంది. సొంత గడ్డపై జరిగిన టి20 సిరీస్‌లో విజృంభించిన జింబాబ్వే బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. జింబాబ్వే బ్యాటర్‌ రియాన్‌ బర్ల్‌ (28 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే చాన్స్‌ తృటిలో మిస్‌ అయినా దాదాపు ఆ ఫీట్‌ను అందుకున్నంత పని చేశాడు.

జింబాబ్వే ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ నసుమ్‌ అహ్మద్‌ వేశాడు. ఆ ఓవర్లో రియాన్‌ 6, 6, 6, 6, 4, 6 బాదాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన రియాన్‌ బర్ల్‌ ఐదో బంతిని బౌండరీ తరలించగా.. ఆ తర్వాత ఆఖరి బంతిని మరో సిక్స్‌గా మలిచాడు. ఓవరాల్‌గా ఐదు సిక్సర్లు, ఒక బౌండరీ కలిపి మొత్తం 34 పరుగుల్ని పిండేశాడు. టి20 చరిత్రలో యువరాజ్‌ (6 సిక్స్‌లు; భారత్‌), పొలార్డ్‌ (6 సిక్స్‌లు; విండీస్‌)ల తర్వాత రియాన్‌ బర్ల్‌ ఆడిన ఓవర్‌ మూడో విధ్వంసకర ఓవర్‌గా నిలిచింది.

ఇక మూడో టి20 లో జింబాబ్వే 10 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది.  మొదట జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిసిన ర్యాన్‌ బర్ల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకోగా.. తొలి రెండు టీ20ల్లో మెరుపు అర్ధసెంచరీలు సాధించిన సికందర్‌ రాజా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగస్ట్‌ 5 నుంచి ప్రారంభంకానుంది.

చదవండి: IND vs WI 3rd T20: సూర్యకుమార్‌ మెరుపులు.. మూడో టి20లో భారత్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement