జింబాబ్వే 228/6  | Hundred International Test Match Between Bangladesh And Zimbabwe | Sakshi
Sakshi News home page

జింబాబ్వే 228/6 

Published Sun, Feb 23 2020 2:37 AM | Last Updated on Sun, Feb 23 2020 2:37 AM

Hundred International Test Match Between Bangladesh And Zimbabwe - Sakshi

ఢాకా: కెప్టెన్‌ క్రెగ్‌ ఇర్విన్‌ శతకం (107; 13 ఫోర్లు)తో ఆకట్టుకోవడంతో... బంగ్లాదేశ్‌తో శనివారం ఆరంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. ప్రిన్స్‌ మస్వౌరె (64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ బంగ్లా బౌలర్లను సమర్థంగా ఆడలేకపోయారు. నయీమ్‌ హసన్‌ నాలుగు వికెట్లు తీయగా... అబు జాయేద్‌ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య జరుగుతోన్న 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement