ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం; బంగ్లాదేశ్‌ ఘనవిజయం | Bangladesh Clinches Super Victory Against Zimbabwe In 1st T20 | Sakshi
Sakshi News home page

Ban Vs Zim: ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం; బంగ్లాదేశ్‌ ఘనవిజయం

Published Fri, Jul 23 2021 9:31 AM | Last Updated on Fri, Jul 23 2021 9:40 AM

Bangladesh Clinches Super Victory Against Zimbabwe In 1st T20 - Sakshi

హరారే: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. బంగ్లా ఓపెనర్లు నైమ్‌, సౌమ్యా సర్కార్‌లు తొలి వికెట్‌కు 102 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో సూపర్‌ విక్టరీ నమోదు చేసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత జింబాబ్వే 19 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. చకాబ్వ (22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డియాన్‌ మేర్స్‌ (22 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించారు. ముస్తఫిజుర్‌ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో బంగ్లాదేశ్‌ 18.5 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు నైమ్‌ (51 బంతుల్లో 63 నాటౌట్‌; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్‌ (45 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement