బంగ్లాదేశ్‌పై జింబాబ్వే గెలుపు  | Zim Vs Ban: Zimbabwe Clinches Super Victory In 2nd T20 | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌పై జింబాబ్వే గెలుపు 

Published Sat, Jul 24 2021 7:54 AM | Last Updated on Sat, Jul 24 2021 8:02 AM

Zim Vs Ban: Zimbabwe Clinches Super Victory In 2nd T20 - Sakshi

హరారే: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1–1తో సమం చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్‌ వెస్లీ మదెవెరె (57 బంతుల్లో 73; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివర్లో రైన్‌ బర్ల్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. షోరిఫుల్‌ ఇస్లామ్‌ మూడు వికెట్లు తీశాడు.

ఛేదనలో బంగ్లాదేశ్‌ 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. షమీమ్‌ (13 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వెల్లింగ్టన్‌ మసకద్జా (3/20), ల్యూక్‌ జాంగ్వే (3/31) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును మదెవెరె అందుకు న్నాడు. సిరీస్‌ విజేతను తేల్చే మూడో టి20 రేపు జరుగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement