తమీమ్‌ సెంచరీ: బంగ్లాదేశ్‌ విజయం | Tamim Iqbal Made Century Against Zimbabwe | Sakshi
Sakshi News home page

తమీమ్‌ సెంచరీ: బంగ్లాదేశ్‌ విజయం

Published Wed, Mar 4 2020 1:36 AM | Last Updated on Wed, Mar 4 2020 1:36 AM

Tamim Iqbal Made Century Against Zimbabwe - Sakshi

సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ నాలుగు పరుగుల ఆధిక్యంతో జింబాబ్వేపై గెలుపొందింది. చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 20 పరుగులు అవసరం కాగా... 15 పరుగులు చేయగలిగింది. టిరిపానో (28 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) 50వ ఓవర్‌ మూడు, నాలుగు బంతులను సిక్స్‌లుగా మలచడంతో... జింబాబ్వే విజయం సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులకు మారింది. అయితే ఆ రెండు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించిన జింబాబ్వే సంచలన విజయాన్ని దూరం చేసుకుంది. తొలుత బంగ్లాదేశ్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగులు చేసింది. తమీమ్‌ ఇక్బాల్‌ (136 బంతుల్లో 158; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. సికిందర్‌ రాజా (66; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మదెవెరె (52; 5 ఫోర్లు), తినాశే (51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2–0తో గెల్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement