లిటన్‌ దాస్‌ శతకం: బంగ్లాదేశ్‌ భారీ గెలుపు | Liton Das Made A Century In ODI Against Zimbabwe | Sakshi
Sakshi News home page

లిటన్‌ దాస్‌ శతకం: బంగ్లాదేశ్‌ భారీ గెలుపు

Published Mon, Mar 2 2020 2:20 AM | Last Updated on Mon, Mar 2 2020 2:20 AM

Liton Das Made A Century In ODI Against Zimbabwe - Sakshi

సిల్హెట్‌: ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (105 బంతుల్లో 126 రిటైర్డ్‌ హర్ట్‌) కెరీర్‌లో రెండో సెంచరీ సాధించడంతో... జింబాబ్వేతో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు 169 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం నమోదు చేసింది. పరుగుల పరంగా వన్డేల్లో బంగ్లాదేశ్‌కిదే భారీ విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసింది. మొహమ్మద్‌ మిథున్‌ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 39.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో సైఫుద్దీన్‌ (3/22), మష్రఫె మొర్తజా (2/35), మిరాజ్‌ (2/33) ఆకట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement