‘ఉడతా’భక్తిగా..
ఓ యువతి జుట్టులోంచి తొంగిచూస్తున్న ఈ ఉడత పేరు హమ్మీ...ఇక ఈమె పేరు అబ్బిపుటిరెల్(16)... వీళ్లిద్దరూ మంచి స్నేహితులు... రెండు నెలల నుంచి కలసిమెలసి ఉంటున్నారు. అబ్బి ఎక్కడికి వెళ్లిన తనతో పాటు హమ్మీ(ఉడత)ను కూడా వెంటతీసుకెళుతుంది. జింబాబ్వేలోని హరారే పట్టణానికి సమీపంలో ఉండే అబ్బిపుటిరెల్‌వాళ్లకు సొంతంగా జంతువుల అభయారణ్యం ఉంది.
ఒక రోజు అబ్బి అమ్మానాన్నలతో కలసి అభయారణ్యంలోని తమ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ అనుకోకుండా ఒక ఉడతపిల్ల వదలుగా ఉండే అబ్బి జుట్టులో దూరి అక్కడే ఉండిపోయింది. జుట్టునే తన గూడుగా భావిస్తూ గత రెండునెలలుగా అబ్బితోనే ఉంటుంది. అప్పటి నుంచి అబ్బి ఇంట్లోవాళ్లు కూడా హమ్మీని తమ ఇంట్లో మనిషిలాగే చూసుకుంటున్నారు. ఇక అబ్బి అయితే తన జుట్టును గూడుగా మార్చడమే కాదు...ఉడతను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ జంతువుల పట్ల తన ప్రేమను ‘ఉడతా’భక్తిగా చాటుకుంటోంది