evil
-
‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’
ప్రపంచకుబేరుడు, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌పై ఉక్రెయిన్ మండిపడుతోంది. గత ఏడాది రష్యా యుద్ధనౌకలపై డ్రోన్ దాడిని నిరోధించేందుకు తన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించడానికి అనుమతిని ఎలా నిరాకరించారనే వివరాలు కొత్త జీవిత చరిత్రలో వెల్లడైన నేపథ్యంలో ఉక్రేనియన్ సీనియర్ అధికారి ఎక్స(ట్విటర్)లో స్పందించారు. మస్క్ చాలా పాపానికి పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రేనియన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ మస్క్ జోక్యం తీరని నష్టానికి, అనేకమంది పౌరుల మరణాలకు దారితీసిందని ఆరోపించారు. ఒకోసారి పొరపాటు తీవ్ర తప్పిదంగా మారుతుంది. ఇది అజ్ఞానం, అహం కలయిక ఫలితం. స్టార్‌లింక్ జోక్యం ద్వారా రష్యన్ నౌకాదళంలో కొంత భాగాన్ని నాశనం చేయడానికి ఉక్రేనియన్ డ్రోన్లను అనుమతించి, రష్యా నౌకాదళాన్ని ఉక్రేనియన్ నగరాలపై కాలిబర్ క్షిపణుల దాడికి అనుమతించింది. ఫలితంగా, అనేకమంది పిల్లలు, పౌరులను పొట్టన పెట్టుకుంటోందంటూ ట్వీట్ చేశారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) అసలు కొంతమంది యుద్ధ నేరస్థులను, హత్య చేయాలనే వారి కోరికను ఎందుకు రక్షించాలనుకుంటున్నారు. తద్వారా వారు పాపానికి ఒడిగడుతున్నారని , దాన్ని ప్రోత్సహిస్తున్నారని ఇప్పటికైనా గ్రహించారా? అని ప్రశ్నించారు. టెక్ బిలియనీర్ మస్క్ జీవిత చరిత్రలోని దీనికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మైఖైలో పోడోల్యాక్ ప్రకటన వచ్చింది. కాగా బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ సీఎన్ఎన్ ప్రచురించిన పుస్తకంలో సాయుధ జలాంతర్గామి డ్రోన్లు "కనెక్టివిటీని కోల్పోయినప్పుడు , ప్రమాదకరం లేకుండా ఒడ్డుకు కొట్టుకుపోయినప్పుడు" క్రిమియా తీరానికి సమీపంలో ఉన్న రష్యన్ నౌకాదళాన్ని ఎలా సమీపిస్తున్నాయో వివరించింది.రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రేనియన్ దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలతో ప్రతిస్పందిస్తాడనే ఆందోళన కారణంగా దాడి జరిగిన ప్రాంతంలో సేవలను నిలిపి వేయమని మస్క్ స్టార్‌లింక్ ఇంజనీర్లను ఆదేశించారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. మరోవైపు స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను ఆపివేసినట్లు వచ్చిన ఆరోపణలను మస్క్ ఖండించారు. రష్యా -ఉక్రెయిన్ వార్కి మరింత ఆజ్యం పోయకూడదనే ఉద్దేశంతోనే నో చెప్పా నన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ నుండి క్రిమియన్ నౌకాశ్రయ నగరమైన సెవాస్టోపోల్ వరకు సక్రియం చేయమని చేసిన అభ్యర్థనకు తాను అంగీకరించ లేదని వివరణ ఇచ్చాడు. తన స్పేస్ఎక్స్ కంపెనీ "యుద్ధం-సంఘర్షణ తీవ్రతరం చేసే చర్యలకు సహకరించడం" తనకు ఇష్టం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. అటు రచయిత ఐజాక్సన్ కూడా దీనిపై స్పందించి స్పష్టత ఇచ్చారు. To clarify on the Starlink issue: the Ukrainians THOUGHT coverage was enabled all the way to Crimea, but it was not. They asked Musk to enable it for their drone sub attack on the Russian fleet. Musk did not enable it, because he thought, probably correctly, that would cause a… — Walter Isaacson (@WalterIsaacson) September 9, 2023 Sometimes a mistake is much more than just a mistake. By not allowing Ukrainian drones to destroy part of the Russian military (!) fleet via #Starlink interference, @elonmusk allowed this fleet to fire Kalibr missiles at Ukrainian cities. As a result, civilians, children are… — Михайло Подоляк (@Podolyak_M) September 7, 2023 -
ఇమామ్ త్యాగం.. స్మరణీయం స్ఫూర్తిదాయకం
సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమామ్ త్యాగం స్ఫూర్తిగా నిలవాలి. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్తసంవత్సరం ‘ముహర్రం’ నుండే ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల (ఉపవాసాలు) తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంత మాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాలపరంగా బాధాకరం కావచ్చునేమోగాని, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యం లో పూర్తిగా విషాదానికి పరిమితం కావడమూ అంత సరికాకపోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త(స) నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సార«థ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం,‘దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు’. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంతమాత్రంకాదు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛీలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్నిశాఖల అధికారులు ఎంతో నిజాయితీపరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు. అనుక్షణం దైవానికి భయపడుతూ, ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. ప్రతిరోజూ నమాజుల సమయంలో ప్రజల్ని కలుసుకొని, వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కాని ఖలీఫాల తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోయాయి. దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకూ ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) కంకణబద్ధులయ్యారు. లక్ష్యసాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిధ్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు. ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మనముందున్నాయి. ఇమామె హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమరాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోడానికి ’కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ పదవ తేదీన (యౌమె ఆషూరా) ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం ఆషామాషీ మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జుట్టు విరబోసుకుంటే పిశాచాల దాడా?
న్యూఢిల్లీ: ఆడవాళ్లు తమ జుట్టును ముడివేయకుండా విరబోసుకున్నట్లు అలా వదిలేయకూడదట. అలా చేసినట్లయితే సెక్స్ ఆలోచనలు బుర్రను తినేయడమే కాకుండా బూత, ప్రేత, పిశాచాల లాంటివి ఆవహిస్తాయట. అందుకేనేమో సినిమాల్లో బూత, ప్రేత, పిశాచాలను జుట్టు విరబోసుకున్నట్లు చూపిస్తారు. జట్టును ముడేయకపోతే ఇంకా చాలా అనర్థాలే ఉన్నాయట. జబ్బు పడడం దగ్గర నుంచి మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాకుండా పరాయి సంపర్కానికి కూడా దారితీసే ప్రమాదం ఉందట. వీటన్నింటినీ హిందూ జన జాగృతి సమితి వెబ్సైట్లో పేర్కొన్నారు. మంగళవారాలు, శనివారాలు ఆడవాళ్లు తలంటూ స్నానాలు చేయకూడదని, అలా చేసినట్లయితే అన్న దమ్ములకు హాని కలుగుతుందని కూడా హెచ్చరించారు. ఆడవాళ్లు ఎందుకు తమ జట్టును చిన్నగా కత్తిరించకోకూడదో, కనుబొమ్మలను ఎందుకు తీర్చి దిద్దుకో కూడదో వివరిస్తూ కూడా హిందూ జన జాగృతి సంస్థ ఇంతకుముందు వరుస వార్తాకథనాలను ప్రచురించింది. మహాభారతంలో ద్రౌపదీ దేవీ ఒక వారం కాదు, రెండు వారాలు కాదు, ఏకంగా 13 ఏళ్లపాటు తలంటు స్నానం చేయకుండా జట్టు విరబోసుకునే ఉంది. అందుకు ఆమెను బూత, ప్రేత, పిశాచాలు వెంటాడినట్లుగానీ, కొత్త కష్టాలు వచ్చినట్లుగాగానీ మహా భారతంలో ఎక్కడా లేదు. నిండు సభలో ధ్రుతరాష్ట్రుడు వలవలు వలచి ఆమెను అవమానించడంతో ధ్రుతరాష్ట్రుడి రక్తంతో తడిపాకే కురులను ముడుచుకుంటానని ద్రౌపది శపథం చేయడం తెల్సిందే. అడవాళ్ల జట్టుకు సంబంధించిన అపోహలు ఒక్క హిందువుల్లోనో, హిందూ ఇతిహాసాలకో పరిమితం కాలేదు. ఇతర మతాలు, ఇతిహాసాల్లోను ఉన్నాయి. ఇప్పటికి కూడా నీగ్రో యువతుల్లో వారి జట్టు సై్టల్నుబట్టి వారి తల్లిదండ్రులు ఎలాంటి వారో అంచనా వేస్తారు. ఇక వారి పొట్టి ఉంగరాల జుట్టును పట్టుకున్నా, పట్టుకోమని ఎవరైనా ఆదేశించినా వారి దేశాల్లో జాతి విద్వేష నేరం అవుతుంది. -
శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు
శ్లోకనీతి పద్యం-6 కర్మములు మేలునిచ్చును కర్మంబులు కీడునిచ్చు కర్తలు తనకుం కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల దడవగా నేమిటికిన్ కావున బరులకు హింసలు, గావింపగ వలదు తనకు కల్యాణముగా భావించి పరుల నొంచిన బోవునె తత్ఫలము పిదప బొందక యున్నే వ్యాఖ్యాన భావం... ప్రతి జీవుడికి తన పుణ్య కర్మల వల్ల మేలు, పాప కర్మల వల్ల కీడు సంభవిస్తుంది. సృష్టికర్త దృష్టిలో శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు. కనుక కర్మానుసారంగా ప్రాప్తించే సుఖదుఃఖాలకు ఇతరులు కారకులని భావించకూడదు. అంతేకాదు ఆ కారణంగా ఇతరులను హింసించటం ఏ మాత్రం తగదు. తనకు మేలు కలుగుతుందని భావించి ఎవరైనా సరే ఇతరులను హింసిస్తే, వారు ఆ పాప కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పే. శిక్ష తప్పదు. అందుకే కర్మలు ఆచరించేటప్పుడు అందులోని మంచిచెడులను సమీక్షించుకోవాలి. తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. సాధ్యమైనంతవరకు సత్కర్మలను అచరించడానికే ప్రయత్నించాలి. అప్పుడు సత్కర్మ ఫలితాలను అనుభవించవచ్చు.... అని వసుదేవుడు కంసునితో అంటున్నాడు. - డా. పురాణపండ వైజయంతి -
నిర్విన్‌కు దెయ్యం పట్టిందా?
- ఏదో శక్తులున్నాయని ప్రజల మూఢవిశ్వాసం - కొన్నాళ్లుగా వ్యాధుల బారిన పడుతున్న జనం కొత్తకోట: హైటెక్ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. తమను ఏదో శక్తులు ప్రభావితం చేస్తున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నిర్విన్ గ్రామస్తులు భయపడుతున్నారు. ఒక రోజు గ్రామం విడిచి వెళితే ఊరికి పట్టుకున్న శక్తులు తొలగిపోతాయని భావించి, ఆదివారం వనంబాట పట్టారు. వివరాల్లోకి వెళితే.. నిర్విన్‌లో కొన్నాళ్లుగా ప్రజలు తరుచు వ్యాధుల బారిన పడటంతో గ్రామానికి ఏదో అయిందన్న భావన గ్రామస్తుల్లో నెలకొంది. దీంతో ఒకరోజు గ్రామాన్ని వదిలి వెళ్లాలని కొందరు పెద్దలు నిర్ణయించారు. గ్రామంలో ఎవరు సంచరించకుండా ఉంటే ఊరికి పట్టుకున్న శక్తి తొలగిపోతుందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గ్రామస్తులందరూ ప్రధాన వీధిలో ఒకచోట పూజలు చేశారు. గ్రామంలో ఒక్కరూ ఉండకుండా అందరూ ఊరు విడిచి వనాలకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులు వనాల్లోనే గడిపారు. చిన్న పిల్లలు చెట్ల కింద ఆటలాడుకున్నారు. మహిళలు బొడ్డెమ్మలు వేశారు. గ్రామంలోకి ఎవరు వెళ్లకుండా నాలుగు పొలిమేరల్లో రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేశారు. గ్రామసేవకులు పొలిమేరల్లో కాపలా కాశారు. ఈ సంప్రదాయంతో తమ గ్రామానికి పట్టుకున్న శక్తి వదులుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఆ ఎస్సై దెయ్యమై తిరుగుతున్నాడు!!
'నెల రోజుల క్రితం ఆత్మహత్యచేసుకున్న ఎస్సై దెయ్యమై తిరుగుతున్నాడు. గ్రామంలోని పిల్లాజల్లా అందరినీ భయపెడుతున్నాడు' అంటూ విశాఖ జిల్లా గోపాలపురంలోని లక్ష్మీనగర్ గ్రామస్తులు హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా సదరు ఎస్సై ఇంటిముందు మంట పెట్టి, గ్రామం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఇంటిముందు బైఠాయించారు. మూఢనమ్మకాలకు పరాకాష్టలాంటి ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో భయాందోళనకు గురైన ఎస్సై వీరాంజనేయుడు కుటుంబ సభ్యులు సాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన వీరాంజనేయుడు ఎంబీఏ పూర్తిచేసి 2008లో ఎస్సై ఉద్యోగంలో చేరాడు. ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అయితే తాను నిర్దోషినని, కొందరు రాజకీయనాయకులు కావాలనే తననీ కేసులో ఇరికించారని సూసైడ్ నోట్ రాసి గత ఏప్రిల్ నెలలో వీరాంజనేయుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలే కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు గ్రామస్తుల వికృతచర్యలతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
సర్వం శక్తిమయం జగత్
సందర్భంనేడు విజయదశమి ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృథివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది. అఖిలానికి ‘అయ్య’ అయిన శంకరుని గురించి అలవోకగా శ్లోకాన్ని చెప్పబోతూ ఆది శంకరులవారు అలా గలగలా నవ్వేశారు. దానిక్కారణం ఎక్కడెక్కడ అయ్య గురించి అలోచించినా అక్కడక్కడ అమ్మ మాత్రమే కనిపించడం! అందుకే ఆయన అమ్మ గురించి చెప్పదలచిన సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ‘శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలుః కుశలః స్పందితు మపి అనేశాడు. (అమ్మతో కూడి ఉంటేనే అయ్య దేన్నైనా చేయ సమర్థుడౌతాడు. ఆమె లేకుంటే అసలాయన దేన్నీ చేయలేడు అని అర్థం). పోనీ ఆది శంకరులవారు అలా రాసారు అనుకున్నా, ‘నేను నేనే’ అని అయ్య ఏమైనా అన్నాడేమోనని వెతికి వెతికి చూస్తే ఆయనంతట ఆయన అననే అనేశాడు. అంతా నిన్ను పెళ్లాడాకే సుమా! లేకపోతే నా మహిమేముంది? (భవాని! త్వత్పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదమ్) అని. సరే బ్రహ్మగారేమైనా తన భార్య లేకుండా శక్తిమంతుడా అని అలోచిస్తే, ఆయన తన నాలుగు ముఖాల నుండీ నిరంతరం వేద గానాన్ని చేస్తూండడాన్ని బట్టి ఆయనంటూ ఒకరున్నారని లోకానికి తెలుస్తోంది కానీ, అసలు బ్రహ్మ ఉనికికి కూడా కారణం ఆయనకున్న శక్తి (భార్య అయిన సరస్వతి) అనే అర్థమౌతోంది. ఇక శ్రీహరి మాట చెప్పేదేముంది? విష్ణుశక్తి మొత్తం లక్ష్మిదే కదా! ఆ శక్తి లేని పక్షంలో విష్ణుదర్శనానికి ఎవరొస్తారు? నిత్య కల్యాణమెక్కడ? పచ్చతోరణమెక్కడ? కాబట్టి ఏ బ్రహ్మకి శక్తి సరస్వతి ఔతోందో, ఏ విష్ణువుకి శక్తి లక్ష్మిగా కనిపిస్తోందో, ఏ శంకరునికి శక్తి పార్వతి మాత్రమే అని రుజువయిందో ఆ కారణంగా ‘శక్తి’ అంటే పురుషునికి సహకరించే భార్య అనీ, శక్తిపూజ (అమ్మవారి పూజ) చేయడం అంటే దంపతుల అన్యోన్యత కోసం చేయబడే పూజ అనీ, ఈ త్రిశక్తుల పూజ ఆశ్వయుజ మాసంలో నెలరోజుల పొడుగునా జరుగుతోందనీ గ్రహించాలి. అయితే ఈ త్రిశక్తుల్లో కూడా ఎవరు అత్యంత ముఖ్యం? అని ఆలోచించారు రుషులు. నెల మొదట్లో పది రోజులు పార్వతీదేవికి ఉత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజ జరుగుతుంది. తర్వాత దీపావళి అమావాస్యనాడు లక్ష్మీపూజ. పౌరుషంలో శక్తి శక్తి అంటే అమ్మవారే అనుకున్నాం కదా. అమ్మ భండుడనే రాక్షసుణ్ణి వధించడానికి గజసైన్యం, అశ్వసైన్యం, రథబలం, పదాతి బలంతో బయల్దేరడమే కాకుండా తనకు సహాయకునిగా వచ్చిన వినాయకునితోపాటు, విఘ్నయంత్రాన్ని కూడా తీసుకెళ్లింది. ఇతర దేవతాయుధాలన్నింటినీ తనే ఒక్కొక్క చేతిలోనూ (మొత్తం ఇరవై చేతులు) ఉంచుకుని యుద్ధానికి తలపడింది. ఆమె రాక, ఆమె యుద్ధ ప్రణాళిక చూసి అందరూ కూడా దుర్గ (ఆమెను సమీపించలేం సుమా! గంతుం దుర్గమా) అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే అమ్మ తానింత పౌరుషంతో (పురుష లక్షణంతో) ఉన్నా కూడా తన భర్తని తక్కువ చేయకుండా భర్త అయిన కామేశ్వరుని పేరిట ఉన్న అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని రాజధానిని నాశనం చేసింది. తన విజయంలో ఆయన్ని కూడా భాగస్వామిగా ప్రకటించి లోకంలో స్త్రీలందరికీ మార్గదర్శకురాలయింది. ఆలోచనలో శక్తి ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృథివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది. అలాగే సుందోపసుందుల్ని వధించేందుకు- మీలో ఎవరు బలిష్టులు? అని ప్రశ్నించి పరస్పరం చంపుకునేలా పథకం రచించింది. అలాగే హయగ్రీవుడనే రాక్షసుడు కోరిన వరానికి అనుగుణంగా శ్రీహరికి హయముఖం వచ్చేందుకై శ్రీహరి శిరస్సును ఖండింపజేసింది పరమ సాహసంతో. ఇలా సాహసోపేత విధానంతో రాక్షసవధని చేపట్టి మళ్లీ ఆ రాక్షస జాతితోనే శక్తి పూజలు చేయించుకున్న నేర్పరి అమ్మ. చక్రాల్లో శక్తి ప్రతి వ్యక్తికీ ఉండే సప్త చక్రాల్లోనూ, సప్త రూపాల్లోనే అమ్మ ఉంటుంది. లోకమంతా ఆమెని నాలుగు చేతులున్న రూపంతో ఊహిస్తుంది కానీ, ఆమె ప్రతి వ్యక్తి శరీరంలోని భాగంలోనూ ఉంటుంది. విశుద్ధి చక్రంలో ఎర్రని రంగులో, డాకినీ నామంతో; అనాహత చక్రంలో శ్యామవర్ణంతో, రాకినీ నామధేయంతో; మణిపూరక చక్రంలో రక్తం రంగులో, లాకినీ అనే పేరుతో; స్వాధిష్ఠాన చక్రంలో పచ్చని రంగులో కాకినీ దేవి పేరుతో; మూలాధార చక్రంలో రెండు రంగుల జమిలి వర్ణంతో, సాకినీ నామంతో; ఆజ్ఞా చక్రంలో తెల్లని వర్ణంతో, హాకినీ రూపంతో ఉంటూ సహస్రారంలో అన్ని రంగుల కలయికతో యాకినీ నామంతో శక్తిగా ఆమె విరాజిల్లుతోంది. విశుద్ధి చక్రంలో చర్మంలో, అనాహతంలో రక్తంలో, మణిపూరంలో మాంసంలో, స్వాధిష్ఠానంలో మేధస్సులో, మూలాధారంలో ఎముకల్లో, ఆజ్ఞాచక్రంలో మజ్జలో, సహస్రారంలో శుక్లంలో... ఇలా శరీరంలోని సప్తధాతువుల్లోనూ ఉండి మనని నడిపిస్తోంది అమ్మ. లోకంలో ప్రజలకు 1000 విధాల కష్టాలుంటాయని గ్రహించి, ఏ కష్టానికి ఏ నామం పఠిస్తే కష్ట నివారకమో చెప్తూ, అలాంటి వెయ్యి కష్టాలకీ వెయ్యి నామాలని కూర్పించి, ఆ నామాలకి శక్తి పెరిగేందుకై వాటన్నిటినీ ఒకేచోట ‘లలితా సహస్ర నామాలు’ అంటూ చేర్చి మననం చేసుకుంటూ ఉండవలసిందని చెప్తోంది అమ్మ. - డా ॥మైలవరపు శ్రీనివాసరావు -
మంచిని పెంచడమే విశ్వాసుల కర్తవ్యం
ఇస్లాం వెలుగు స్వీయ సంస్కరణతో పాటు, సమాజ సంస్కరణ బాధ్యత కూడా దైవ విశ్వాసులపై ఉంది. నైతిక, మానవీయ విలువలతో కూడిన సుందర సత్సమాజ నిర్మాణం కోసమే విశ్వాసులను ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. సమాజంలో ఏ విధమైన దుష్కార్యాలు, దుర్మార్గాలు జరగకుండా చూడడం; మంచిని, సత్కార్యాలను పెంపొందించడం విశ్వాసుల విధి. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది. ‘‘విశ్వసించిన ప్రజలారా! ఇక నుంచి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ, వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడులనుండి వారిస్తారు’’ (3-110). అంటే సమాజంలో మంచిని వ్యాపింపజేయడం, చెడులను నిరోధించడం దైవ విశ్వాసుల విద్యుక్త ధర్మమన్నమాట. సమాజంలో దుర్మార్గాలు ప్రబలిపోతూ ఉంటే చూస్తూ కూర్చోవడం విశ్వాసుల లక్షణం ఎంతమాత్రం కాదు. చెడులకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా శక్తి మేరకు పోరాడాలి. చెడులు అంతమయ్యే వరకు పోరాటం ఆపరాదు. అందరూ కలసి సంఘటిత ఉద్యమం ద్వారా వీటి నిర్మూలనకు కృషి చేయాలి. అదే సమయంలో మంచి పనుల వైపునకు ప్రజలను ప్రోత్సహించాలి. సత్కార్యాల వల్ల ఒనగూడే ప్రయోజనాలను వారికి వివరించాలి. దుష్కార్యాల పర్యవసానాన్ని ఎరుక పరుచుకోవాలి. ఇహ పర లోకాల్లో ఎదురయ్యే పరాభవాల పట్ల ప్రజలను అప్రమత్తుల్ని చేయాలి. దైవ విశ్వాసం, పరలోకం, మరణానంతర జీవితం పట్ల విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంటే, అంతగా విశ్వాసుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. - మహ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
‘ఉడతా’భక్తిగా..
ఓ యువతి జుట్టులోంచి తొంగిచూస్తున్న ఈ ఉడత పేరు హమ్మీ...ఇక ఈమె పేరు అబ్బిపుటిరెల్(16)... వీళ్లిద్దరూ మంచి స్నేహితులు... రెండు నెలల నుంచి కలసిమెలసి ఉంటున్నారు. అబ్బి ఎక్కడికి వెళ్లిన తనతో పాటు హమ్మీ(ఉడత)ను కూడా వెంటతీసుకెళుతుంది. జింబాబ్వేలోని హరారే పట్టణానికి సమీపంలో ఉండే అబ్బిపుటిరెల్వాళ్లకు సొంతంగా జంతువుల అభయారణ్యం ఉంది. ఒక రోజు అబ్బి అమ్మానాన్నలతో కలసి అభయారణ్యంలోని తమ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ అనుకోకుండా ఒక ఉడతపిల్ల వదలుగా ఉండే అబ్బి జుట్టులో దూరి అక్కడే ఉండిపోయింది. జుట్టునే తన గూడుగా భావిస్తూ గత రెండునెలలుగా అబ్బితోనే ఉంటుంది. అప్పటి నుంచి అబ్బి ఇంట్లోవాళ్లు కూడా హమ్మీని తమ ఇంట్లో మనిషిలాగే చూసుకుంటున్నారు. ఇక అబ్బి అయితే తన జుట్టును గూడుగా మార్చడమే కాదు...ఉడతను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ జంతువుల పట్ల తన ప్రేమను ‘ఉడతా’భక్తిగా చాటుకుంటోంది