సెంచరీల మోత
- ఆసీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
- ముక్కోణపు సిరీస్
హరారే: కెప్టెన్ డివిలియర్స్ (106 బంతుల్లో 136 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (98 బంతుల్లో 106; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో ముక్కోణపు సిరీస్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ప్రొటీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 327 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (116 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు బెయిలీ (66), హ్యూస్ (51) ఫర్వాలేదనిపించారు.
మోర్నీ మోర్కెల్, తాహిర్, మెక్‌లారెన్ తలా రెండు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 3 వికెట్లకు 328 పరుగులు చేసింది. డు ప్లెసిస్, డివిలియర్స్ మూడో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. మరో 20 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా భారీ లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. స్టార్క్ 2 వికెట్లు తీశాడు.