జింబాబ్వే మళ్లీ జిగేల్ వునేనా?
నేడు దక్షిణాఫ్రికాతో వ్యూచ్
హరారే: స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియూపై సంచలన విజయుం సాధించిన జింబాబ్వే ఇప్పుడు ఫైనల్ బెర్తుపై కన్నేసింది. గురువారం హరారేలో జరిగే ముక్కోణపు సిరీస్ చివరి వ్యూచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే పటిష్టమైన దక్షిణాఫ్రికాపై గెలుపు అంత సలువు కాకపోయినా.. వురోసారి సంచలనంపై జింబాబ్వే ఆశలు పెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆతిథ్య జట్టు ఫైనల్‌కు చేరడం అంత సులువుకాదు.
ఆస్ట్రేలియూ (10 పాయింట్లు) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా... దక్షిణాఫ్రికా (9 పాయింట్లు) కూడా దాదాపుగా బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం జరిగే చివరి వ్యూచ్‌లో దక్షిణాఫ్రికాపై జింబాబ్వే (4 పాయింట్లు) బోనస్ పాయింట్‌తో గెలవాలి. దాంతో పాటు దక్షిణాఫ్రికా కన్నా మెరుగైన రన్‌రేట్‌ను సాధించాలి. అప్పుడే జింబాబ్వే ఫైనల్‌కు చేరుకునే అవకాశాలుంటాయి.
ఒకవేళ జింబాబ్వే ముందుగా బ్యాటింగ్‌కు దిగి 250 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికాను 133 పరుగుల భారీ తేడాతో ఓడించాలి. ఒకవేళ దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగిన 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే అప్పుడు జింబాబ్వే 23.3 ఓవర్లలోనే ఛేదించాలి.