Trolls Memes BCCI Secretary Jay Shah Getting Crucial Matches Ahmedabad - Sakshi
Sakshi News home page

#ICCWorldCup2023: వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల.. జైషాపై ట్రోల్స్‌, మీమ్స్‌

Published Tue, Jun 27 2023 4:32 PM | Last Updated on Tue, Jun 27 2023 5:26 PM

Trolls-memes-BCCI Secretary Jay Shah-Getting Crucial Matches-Ahmedabad - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరగనున్న మెగా సమరం దాదాపు 50 రోజులపాటు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మొత్తం 10 వేదికల్లో గ్రూప్‌ దశలో 48 మ్యాచ్‌లు జరగనుండగా.. నాకౌట్‌ దశలో మూడు మ్యాచ్‌లు ముంబై(సెమీఫైనల్‌-1), కోల్‌కతా(సెమీఫైనల్‌-2), అహ్మదాబాద్‌(ఫైనల్‌) జరగనున్నాయి.

ఇక ఆరంభమ్యాచ్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ విన్నర్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. అయితే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌ మొత్తంగా ఐదు మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లతో పాటు మధ్యలో చిరకాల ప్రత్యర్థులుగా భావించే టీమిండియా-పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లకు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మరో మ్యాచ్‌ సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికి మిగతా నాలుగు మ్యాచ్‌లకు టీఆర్పీ రేటింగ్‌ బద్దలవడం ఖాయం. 

కాగా అహ్మదాబాద్‌కు కేటాయించిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఆసక్తికరంగానే సాగుతాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా మ్యాచ్‌ల ఎంపికలో ఏ మేరకు చక్రం తిప్పాడో స్పష్టంగా అర్థమవుతుంది. తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన సొంత ఇలాకాలో జరిగే ఐదు మ్యాచ్‌లు మంచి ఆసక్తి కలిగించేవే. అందుకే జై షాను సోషల్‌ మీడియాలో అభిమానులు ట్రోల్‌ చేయడంతో పాటు మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''సొంత ఇలాకాలో మంచి మ్యాచ్‌లు పెట్టుకున్నాడు.. బయటి వేదికలకు మాత్రం పనికిరాని మ్యాచ్‌లు కొన్ని ఇచ్చాడు.. తన ఆధిపత్యం ఎంతలా ఉందనేది అర్థమవుతుంది.. మోదీ ఉన్నంతవరకు ప్రతి ప్రతిష్టాత్మక​ మ్యాచ్‌ అహ్మదాబాద్‌కే వెళుతుందన్నది సత్యం'' అంటూ పేర్కొన్నారు.

 ఈసారి అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగబోయే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేడియం సామర్థ్యం లక్ష మంది కాగా.. దాయాదుల మ్యాచ్‌కు లక్షకు పైగా వచ్చే అవకాశముంది. ప్రతిష్టాత్మక ఫైనల్‌తో పాటు మిగతా మ్యాచ్‌లు పరిశీలిస్తే ఆరంభమ్యాచ్‌ ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న తొలిమ్యాచ్‌ తొలిరోజే ఆసక్తిగా మొదలయ్యే చాన్స్‌ ఉంటుంది. ఇక ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా నవంబర్‌ 4న అహ్మదాబాద్‌లో ఆడనున్న మ్యాచ్‌కు కూడా యమా క్రేజ్‌ ఉంది. వీటితో పాటు ప్రతిష్టాత్మక ఫైనల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చదవండి: 'అప్పుడు సచిన్‌ కోసం.. ఇప్పుడు కోహ్లి కోసం'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement