స్కార్ బారోగ్: భారత్ మహిళలతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ఆదిలో కాస్త దూకుడిగా ఆడినా 214 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ ఓపెనర్లలో ఎడ్వర్డ్స్ (108) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడింది. అనంతరం ఏ ఒక్కరూ నిలకడగా ఆడలేదు. తొలి వన్డేలో విఫలమైన భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో రాణించారు. గైక్వాడ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీయగా, గోస్వామి మూడు వికెట్లతో ఆకట్టుకుంది.ప్రస్తుతం బ్యాటింగ్ దిగిన భారత జట్టు 10.4 ఓవర్లలో వికెట్టు నష్టానికి 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఓటమి చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఇంమూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ ను వరుణుడు ఎక్కిరించాడు. ఆ మ్యాచ్ లో పదే పదే వర్షం అంతరాయ కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ విజయం సాధించింది.