డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 136 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (128 బంతుల్లో 135; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ప్రసన్న (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
గుణతిలక (78 బంతుల్లో 63; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి పెరీరా తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించాడు. ఐర్లాండ్ బౌలర్లలో ముర్తాగ్ మూడు, మెకార్తీ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఐర్లాండ్ జట్టు 45 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. మెక్‌బ్రైన్ (64 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంకదే సిరీస్
Published Sun, Jun 19 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM
Advertisement
Advertisement