Kusal Pereira
-
కివీస్‌తో సిరీస్‌లకు లంక జట్ల ప్రకటన.. వాళ్లకు మరోసారి మొండిచేయి
న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో టీ20, వన్డేలకు పదిహేడు మందితో కూడిన జట్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. చరిత్ అసలంక వన్డే జట్టుకు సారథిగా కొనసాగనుండగా.. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఈ జట్టులో స్థానం లభించలేదు.వారికి మొండిచేయిఇక వరల్డ్‌కప్-2023 తర్వాత కుశాల్ పెరీరా తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. మహ్మద్ షిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. షనకతో పాటు పేసర్ దుష్మంత చమీరాకు మరోసారి మొండిచేయి ఎదురుకాగా.. భనుక రాజపక్స కూడా జట్టుతో కొనసాగనున్నాడు.టీమిండియా, విండీస్లపై వరుస సిరీస్ విజయాలుకాగా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రీలంక వన్డేల్లో అద్వితీయ విజయాలు సాధించింది. స్వదేశంలో తొలుత టీమిండియాను 2-1తో చిత్తు చేసి సిరీస్ గెలుచుకున్న లంక.. తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది.ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు అసలంక బృందం సిద్ధమైంది. కాగా ఇటీవల శ్రీలంకలో పర్యటించిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే, వెంటనే ఇండియా టూర్లో 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు తిరిగి రానుంది. ఇందులో భాగంగా రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబరు 8, 10 తేదీల్లో లంక- కివీస్ మధ్య టీ20లకు డంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 13, 17, 19 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో వన్డేలకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక, మహ్మద్ షిరాజ్. న్యూజిలాండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక, పాతుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండీమాల్, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, నువాన్ తుషార, మతీషా పతిరానా, బినూరా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
కుశాల్ కౌశలం
ఇంటాబయట ఓటములు... ఆటగాళ్ల దారుణ వైఫల్యాలు... కొరవడిన సమష్టి ప్రదర్శన... వెరసి కొన్నేళ్లుగా పతనమవుతున్న శ్రీలంక క్రికెట్‌కు పునరుత్తేజం కలిగించే గెలుపు లభించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా మహాద్భుతం అనదగ్గ పోరాటంతో అజేయ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో లంక అసాధారణ విజయం నమోదు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో స్టెయిన్, రబడ, ఒలివియర్లాంటి సఫారీ పేసర్లకు ఎదురొడ్డిన కుశాల్... దూకుడు, సంయమనం కలగలిసిన బ్యాటింగ్‌తో జట్టుకు మరుపురాని గెలుపును అందించాడు. ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి పదో వికెట్‌కు విశ్వ ఫెర్నాండోతో కలిసి రికార్డు స్థాయిలో అభేద్యంగా 78 పరుగులు జోడించి అద్వితీయ విజయాన్ని ఖాయం చేశాడు. డర్బన్: విజయ లక్ష్యం 304 పరుగులు. ఓవర్‌నైట్ స్కోరు 83/3. శనివారం ఆట మొదలైన కాసేపటికే మరో రెండు వికెట్ల పతనం. పరిస్థితి 110/5..! ఎదురుగా దక్షిణాఫ్రికా భీకర పేసర్లు. ఏ విధంగా చూసినా పరాజయం ఖాయమనిపించే ఇలాంటి దశ నుంచి కుశాల్ పెరీరా (200 బంతుల్లో 153 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) శ్రీలంకను ఒంటిచేత్తో గెలిపించాడు. అతడి వీరోచిత ఇన్నింగ్స్‌కు తొలుత ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వా (79 బంతుల్లో 48; 6 ఫోర్లు); చివర్లో పేసర్ విశ్వ ఫెర్నాండో (27 బంతుల్లో 6 నాటౌట్) అండగా నిలవడంతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో సఫారీలపై లంక ఒక వికెట్ తేడాతో ఊహించని రీతిలో గెలుపొందింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1–0 ఆధిక్యం సాధించింది. ఈ నెల 21 నుంచి రెండో టెస్టు పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది. 226/9 నుంచి 304/9కు... చేతిలో ఉన్న ఏడు వికెట్లతో విజయానికి 221 పరుగులు చేయాల్సిన స్థితిలో శనివారం బ్యాటింగ్‌కు దిగిన లంకను స్టెయిన్ (2/71) బెంబేలెత్తించాడు. రెండు బంతుల వ్యవధిలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఒషాదా ఫెర్నాండో (37), వికెట్ కీపర్ డిక్వెల్లా (0)లను ఔట్ చేశాడు. 110/5తో నిలిచిన లంకను ఆరో వికెట్‌కు 96 పరుగులు జోడించి కుశాల్, ధనంజయ ఆదుకున్నారు. ఓ దశలో 206/5తో ఆతిథ్య జట్టు ఆశావహంగా కనిపించింది. అయితే, స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (3/71) వరుస బంతుల్లో ధనంజయ, లక్మల్ (0)లను కాసేపటికి రజిత (1)ను పెవిలియన్ పంపాడు. మధ్యలో లసిత్ ఎంబుల్దేనియా (4) వికెట్‌ను ఒలివియర్ పడగొట్టాడు. 226/9తో ఓటమి కొనకు చేరిన లంకను పదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించి కుశాల్, విశ్వ ఫెర్నాండో గెలిపించారు. ఔరా కుశాల్... లంక రికార్డు పదో వికెట్ భాగస్వామ్యంలో కుశాల్ పెరీరా ఆటే హైలైట్. జట్టు 9వ వికెట్ పడినప్పుడు 86 పరుగులతో ఉన్న అతడు... ఇక తాడోపేడో అన్నట్లు ఆడాడు. సెంచరీ తర్వాత మరింత చెలరేగాడు.స్టెయిన్, రబడ వంటి బౌలర్లను లెక్కచేయకుండా వారి ఓవర్లలో ఐదు సిక్స్‌లు బాదాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ ఫీల్డర్లను బౌండరీల వద్ద మోహరించాడు. అయినా కుశాల్ ఏమాత్రం తగ్గలేదు. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రయిక్ కాపాడుకుంటూ సమయస్ఫూర్తి చూపాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో 68 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో 27 బంతులను కాచుకుని విశ్వ ఫెర్నాండో అతడికి సంపూర్ణ సహకారం అందించాడు. కీలక సమయంలో దక్షిణాఫ్రికా ఓవర్‌త్రో రూపంలో 4 పరుగులు ఇవ్వడం కూడా లంకకు మేలు చేసింది. కుశాల్ పెరీరాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. ►పరుగులు 153 ►బంతులు200 ►ఫోర్లు 12 ►సిక్సర్లు 5 -
శ్రీలంకదే సిరీస్
డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 136 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (128 బంతుల్లో 135; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ప్రసన్న (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. గుణతిలక (78 బంతుల్లో 63; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి పెరీరా తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించాడు. ఐర్లాండ్ బౌలర్లలో ముర్తాగ్ మూడు, మెకార్తీ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఐర్లాండ్ జట్టు 45 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. మెక్‌బ్రైన్ (64 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
పెరీరాపై నాలుగేళ్ల నిషేధం!
కొలంబో: శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి. డోపింగ్ పరీక్షలో భాగంగా అతడి ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలడంతో వేటు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఐసీసీ తమకు చెప్పినట్టు శ్రీలంక క్రీడా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. ఇటీవలి పాక్ పర్యటన సందర్భంగా తీసుకున్న యూరిన్ శాంపిల్‌లో పెరీరా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. వెంటనే ఈనెల ఆరంభంలోనే కివీస్‌తో జరుగుతున్న సిరీస్ నుంచి పెరీరాను తొలగించారు. ‘దీన్ని మేం అప్పీల్ చేయాలని భావిస్తున్నాం. ఎందుకంటే గత నాలుగు పర్యాయాల్లో అతడి విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ కష్టకాలంలో మేం పెరీరాకు అన్ని విధాలా సహాయం అందిస్తాం’ అని జయశేఖర తెలిపారు. గతంలో 2011 ప్రపంచకప్ సందర్భంగా లంక బ్యాట్స్‌మన్ ఉపుల్ తరంగ డోపింగ్ టెస్టులో విఫలమై మూడు నెలల సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు.