భారత్తో గురువారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
మిర్పూర్: భారత్తో గురువారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం బారిన పడిన టెస్టు తర్వాత ఇప్పుడు ఇరు జట్లు కొత్తగా కనిపిస్తున్నాయి. పలువురు ఆటగాళ్లతో పాటు కెప్టెన్లు కూడా మారారు. ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత భారత్ తొలిసారి వన్డే ఆడబోతుండగా... ఇటీవల పాక్‌ను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం (నేడు) ఇక్కడ తొలి మ్యాచ్ (డేనైట్) జరగనుంది. అయితే టెస్టులాగే ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటం ఊరటనిచ్చే విషయం.