హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జనవరి18న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేకు సంబంధించిన టికెట్లను పేటీఎంలో అందుబాటులో ఉంచినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తెలిపింది.
ఓవరాల్‌గా 29 వేల టికెట్స్‌ను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే తొలి రోజు (జనవరి13) కేవలం 6వేల టికెట్స్‌ను మాత్రమే హెచ్‌సీఎ అందుబాటులో ఉంచింది. ఈ నెల 16 వరకు ఆన్‌లైన్‌లో టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇక ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు క్యూ ఆర్ కోడ్ చూపించి ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. కాగా ఫిజికల్ టికెట్లు జనవరి 15 నుంచి 18 వరకు పొందవచ్చు.
కాగా గతేడాది జింఖానా గ్రౌండ్‌లో టికెట్లు కోసం జరిగిన తొక్కిసలాట ను దృష్టిలో పెట్టుకున్న హెచ్‌సీఎ ఈసారి మొత్తం టికెట్లను ఆన్‌లైన్‌లోనే విక్రయించనుంది.
చదవండి: మహిళా క్రికెటర్ అనుమానస్పద మృతి.. అడవిలో మృతదేహం!
Comments
Please login to add a commentAdd a comment