అయిదు లేదా అంతకంటే ఎక్కువ వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై ఓడించిన రెండో జట్టు భారత్ మాత్రమే....ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా సాధించిన ఘనతకు ఇదో నిదర్శనం. మూడు టెస్టులతో పాటు అయిదు వన్డేలు కలిపి ప్రొటీస్ తరఫున నమోదైనది ఒకే ఒక్క సెంచరీ. మన ఆటగాళ్లు చేసినవి అయిదు. ...రెండు జట్ల ప్రదర్శన మధ్య ఉన్న తేడాకు, భారత బ్యాట్స్‌మెన్ జోరుకు ఇదో సాక్ష్యం.