ఫీల్డ్‌లో ఎప్పుడూ దూకుడుగా ఉండే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటగాళ్లతో ఎంత క్లోజ్‌గా ఉంటాడో తాజా ఘటనే ఉదాహరణ. గత రెండు రోజుల క్రితం కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ 20లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కోహ్లి మసాజ్ చేస్తూ కనిపించాడు. ఆ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ అవుటైన వచ్చిన తర్వాత అతనితో కోహ్లి ముచ్చటిస్తూ మసాజ్ చేశాడు. దాదాపు 20 సెకన్ల పాటు ధావన్ తలపట్టాడు కోహ్లి.