
హనుమ విహారి
ధర్మశాల: దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో భారత్ ‘బి’ శుభారంభం చేసింది. ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి (76 బంతుల్లో 95 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో భారత్ ‘బి’ జట్టు 8 వికెట్లతో భారత్ ‘ఎ’పై నెగ్గింది. మొదట భారత్ ‘ఎ’ 41.2 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. ‘ఎ’ జట్టు స్కోరు 51/4 వద్ద ఉన్నపుడు వర్షంతో ఆటకు అంతరాయం కలిగింది.
దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ‘ఎ’ జట్టులోనూ ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (107 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ధర్మేంద్ర సింగ్ జడేజా 4, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘బి’ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 175 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని ఆ జట్టు 26.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఈశ్వరన్ (43), కెప్టెన్ అయ్యర్ (28 నాటౌట్) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే పోరులో భారత్ ‘బి’తో విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment