భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కొచ్చిలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
కొచ్చి : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కొచ్చిలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్ బలానికి... కరీబియన్ ఆల్‌రౌండర్ల జోరుకు వన్డే సిరీస్ వేదిక కానుంది. సచిన్ టెండూల్కర్ ‘ఫేర్‌వెల్ టెస్టు సిరీస్’ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన వన్డేలలోనూ అదే ఆధిపత్యాన్ని కనబర్చాలని భావిస్తుండగా... పోయిన పరువును కొంతైనా కాపాడుకోవాలని బ్రేవో సేన ప్రయత్నిస్తోంది.
జట్లు: భారత్: ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, ఎస్ ధావన్, ఆర్ఏ జడేజా, విరాట్ కోహ్లి, బి కుమార్, ఏ మిశ్రా, మహ్మద్ షమీ, ఎస్కె రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, ఆర్జీ శర్మ, ఉనాద్కట్, ఆర్ వినయ్ కుమార్, యువరాజ్ సింగ్
వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), గేల్, చార్లెస్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, దేవ్‌నారాయణ్, సిమ్మన్స్, స్యామీ, నరైన్, రాంపాల్, హోల్డర్.