cochin
-
లండన్ వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..
తిరువనంతపురం: లండన్‌కు వెళ్లే ఎయిరిండియా విమానానికి మంగళవారం బాంబు బెదిరింపులు అందాయి. కేరళలోని కొచ్చిన్ విమానశ్రాయం నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 విమానం లండన్ గాట్విక్ వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే కొచ్చి అంతర్జాతీయ విమనాశ్రయంలోని ఎఎయిరిండియా సిబ్బందికి చేరవేశారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్‌లైన్ సెక్యూరిటీ అధికారులు విమానంలో విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఇన్లైన్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా భద్రతా తనిఖీలు జరిపారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.అన్ని తనిఖీలు అనంతరం విమానం లండన్ వెళ్లేందుకు అనుమతించినట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. అదే విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుహైబ్‌గా తేల్చారు.కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లోని చెక్-ఇన్ సమయంలో సుహైబ్, అతని భార్య, కుమార్తెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
Reeni Tharakan: బామ్మ పవర్
53 ఏళ్ల వయసులో ఆమె జిమ్‌లో చేరింది ఫిట్నెస్ కోసం. పదేళ్లు తిరిగేసరికి 63 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ అయ్యింది. ఇటీవల మంగోలియాలో నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. ఏ వయసులోనైనా ఆరోగ్యంగా... దృఢంగ శరీరాన్ని మలుచుకునేందుకు స్త్రీలు శ్రద్ధ పెడితే సాధ్యం కానిది లేదని కొచ్చికి చెందిన రీని తారకన్ సందేశం ఇస్తోంది. మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్‌లో ఇటీవల ‘ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఫెడరేషన్’ (ఐ.పి.ఎఫ్) చాంపియన్‌షిప్స్ జరిగాయి. మన దేశం నుంచి 25 మంది పాల్గొంటే వారిలో 15 మంది స్త్రీలే. వారిలో కొచ్చిన్‌కు చెందిన రీని తారకన్ నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. 63 ఏళ్ల వయసులో ఆమె ఇలా దేశం తరఫున పతకాలు గెలుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలా జరిగింది. అందుకు ఆమె చేసిన పరిశ్రమ, చూపిన శ్రద్ధే కారణం. భారీ పోటీ మంగోలియాలో జరిగిన ఐ.పి.ఎఫ్‌కు 44 దేశాల నుంచి 145 మంది పవర్‌లిఫ్టర్లు హాజరయ్యారు. వీరిని 40, 50, 60, 70 ఏళ్లుగా నాలుగు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. మళ్లీ ఈ కేటగిరీల్లో బరువును బట్టి పోటీదార్లు ఉంటారు. స్త్రీ, పరుషులు వేరువేరుగా పాల్గొంటారు. రీని తారకన్ అరవై ఏళ్ల కేటగిరిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది. డెడ్లిఫ్టింగ్లో 112.5 కిలోల బరువు ఎత్తగలిగింది. ప్రశంసలు అందుకుంది. ‘ఈ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో నాకు బాగా నచ్చిన అంశం స్త్రీలు ఎక్కువగా పాల్గొనడం. మన దేశం నుంచి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నాం. అంటే నేటì కాలంలో స్త్రీలు తమ సామర్థ్యాలను ఏ వయసులోనైనా మెరుగు పరుచుకోవడానికి వెనుకాడటం లేదని తెలుసుకోవాలి’ అంది రీని తారకన్. బరువు తగ్గడానికి వెళ్లి రీని తారకన్ కొచ్చిన్ శివార్లలోని తైకట్టశ్శేరి అనే గ్రామంలో ఉంటుంది. భర్త ఆంటోని తారకన్ రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అమెరికాలో స్థిరపడితే మరొకరు చెన్నైలో రెస్టరెంట్‌ను నడుపుతున్నారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండటం వల్ల తాను బరువు పెరుగుతున్నానని రీని తారకన్కు అనిపించింది. దాంతో కొచ్చిన్ సిటీలోని వైట్టిలా ప్రాంతంలో ఒక జిమ్ లో చేరింది. ఇంటినుంచి జిమ్ పాతిక కిలోమీటర్ల దూరమైనా బరువు తగ్గాలనే కోరికతో రోజూ వచ్చేది. భర్త ఆమెను తీసుకొచ్చి దిగబెట్టేవాడు. అయితే ఆ జిమ్‌లోని ట్రైనర్ ఆమెలో బరువులెత్తే సామర్థ్యం ఉందని ఆ దారిలో ప్రోత్సహించాడు. పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా మారొచ్చని చెప్పాడు. అందుకు తర్ఫీదు ఇస్తానన్నాడు. 2021 నుంచి ఆమెను పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నాడు. అప్పటి నుంచి రీని మెడల్స్ సాధిస్తూనే ఉంది. ‘పదేళ్ల క్రితం నాకు జిమ్ అంటేనే తెలియదు. కాని క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు పవర్లిఫ్టర్ని అయ్యాను. ఈ గుర్తింపు సంతృప్తినిస్తోంది’ అంది రీని తారకన్. సమర్థింపులు, సూటిపోట్లు ‘నేను పవర్‌లిఫ్టర్ కావాలని ప్రయత్నించినప్పుడు నా కుటుంబం పూర్తి సహకారం ప్రకటించింది. నా పిల్లలు ‘‘ట్రై చెయ్యమ్మా’’ అన్నారు. కాని బంధువుల్లో కొందరు సూటిపోటి మాటలు అన్నారు. ఈ వయసులో ఇదంతా అవసరమా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారికి పని చేస్తూనే సమాధానం చెప్పాలనుకున్నాను. అప్పుడు అలా అన్నవాళ్లు ఇవాళ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిమ్ స్త్రీలకు చాలామంచిది. పవర్‌లిఫ్టింగ్ లాంటివి మన ఎముకలకు బలాన్నిస్తాయి. నేను నా బరువును అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉంటున్నాను. వారంలో నాలుగు రోజులు జిమ్‌కు వచ్చి రెండు గంటలు వర్కవుట్ చేస్తాను. రెండు రోజులు ఇంట్లో వ్యాయామం చేస్తాను. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను. వ్యాయామం ఉత్సాహాన్నిస్తుంది. తప్పక చేయండి’ అంటోంది రీని తారకన్. -
రజనీ చాయ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కోసారి విసుగుపుట్టి హిమాలయాలకు వెళుతుంటారు. ఈసారి కొచ్చిన్‌లో టీ అమ్ముకుంటున్నారా? అవుననే కొంతమంది కంగారు పడ్డారు. తీరా చూస్తే ‘దక్కేది దక్కకుండా పోదు... దక్కనిది ఎప్పటికీ దక్కదు’ అని డైలాగ్ కొడుతూ తనకు దక్కిన టీ స్టాల్‌ను నడుపుకుంటున్న ఓ వ్యక్తి... ఇంకేముంది... నెట్లో హల్చల్. కొచ్చిన్‌లో ఏదో షూటింగ్ కోసం వెళ్లిన సినిమా యూనిట్ వారు అతణ్ణి చూసి ఆగిపోయారు. రజనీకాంత్! టీ అమ్ముతూ. రజనీకాంత్ సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని అందరికీ తెలుసు. కొంపదీసి టీ అమ్ముతున్నాడా? పరిశీలించి చూశారు. కాదు. రజనీకాంత్లానే ఉన్నాడు. పలకరిస్తే అచ్చు రజనీకాంత్లానే నవ్వుతున్నాడు. పేరు సుధాకర్ ప్రభు. ఫోర్ట్ కొచ్చిన్ పట్టాలం రోడ్డులో ‘వెంకటేశ్వర హోటల్’ అనే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నాడు. లెమన్ టీ చేయడంలో దిట్ట. మొన్న మొన్నటి వరకూ ఎవరూ అతణ్ణి రజనీకాంత్‌తో పోల్చలేదు కాని ఈ మధ్య గెడ్డానికి రంగేయడం మాని, కళ్లద్దాలు మార్చేసరికి అచ్చు రజనీ గెటప్‌లోకి వచ్చేశాడు. నాదిర్షా అనే మలయాళం డైరెక్టర్ ఇతణ్ణి ఫేస్బుక్లో పెట్టేసరికి వైరల్ అయ్యాడు. అప్పటినుంచి ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేరళలో ఇతణ్ణి ఫంక్షన్స్‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ‘మా పిల్లలు పెద్దగా పట్టించుకోరుగాని నేను రజనీ అన్ని సినిమాలు చూస్తుంటా’ అంటాడు. ఈ పాపులారిటీ పెరిగి అతని హోటల్‌కు కస్టమర్లు పెరిగితే అదే పది ప్లేట్లు. -
కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి
తిరువనంతపురం: కేరళలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తున్న ఈ కారు ఎడమవైపుకు వెళ్లాల్సి ఉండగా పొరపాటున నేరుగా వెళ్లడంతో కారు పెరియార్ నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా మరో ముగ్గురు మాత్రం సురక్షితంగా బయట పడ్డారని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ముగ్గురు కలిసి హోరువానలో కారులో వెళ్తున్నారు. వీరు కొచ్చిన్ నుంచి కొడంగళ్లుర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా తిరిగి వెళ్తుండగా వర్షం మరింత జోరుగా కురిసింది. మధ్యలో వారు ఎడమవైపు వెళ్లాలని మ్యాప్ సూచించగా వారు పొరపాటున నేరుగా వెళ్లిపోయారు. ఎదురుగా మొత్తం నీరు కనిపిస్తున్నప్పటికీ అక్కడ రోడ్డు నీటిలో మునిగి ఉంటుందని భావించి కారును అలాగే ముందుకు పోనిచ్చారు. కారు నీటిలోకి వెళ్లిన క్షణాల వ్యవధిలోనే అందులోకి జారుకుని పూర్తిగా మునిగిపోయింది. కారు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చెరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురు మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. మిగిలిన ఇద్దరు మాత్రం ఆ నీటిలో గల్లంతయ్యారన్నారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా వారిద్దరు అప్పటికే మృతిచెందడంతో మృతదేహాలను మాత్రం వెలికితీశారు. మృతులు అద్వైత్(29), అజ్మల్(29) ఇద్దరూ కొచ్చిన్ లో ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు! -
కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య..
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఓ వలస కార్మికుడు ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపి గోనుసంచిలో కుక్కిన ఘటన సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదేరోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎర్నాకుళం ఎస్పీ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్న ఓ జంట తమ కూతురు కనిపించడంలేదని శనివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పాప కోసం గాలించగా మరో బృందం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. కొద్దిసేపు పరిశీలించిన తరవాత సీసీటీవీ ఫుటేజిలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. అందులో అదే ఇంటికి పై పోర్షన్లో ఉండే బీహార్ కు చెందిన అస్ఫాక్ అస్లామ్ పాపను శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఎత్తుకెళ్ళడం గమనించడం జరిగింది. వెంటనే అదేరోజు రాత్రి 9.30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నాం. కానీ అతడు మద్యం మత్తులో పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నందున రాత్రంతా విచారించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం ఉదయాన్న అతడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. అస్ఫాక్ అస్లామ్ చిన్నారిని తీసుకుని వెళ్తుండడం స్థానికంగా ఉన్న మరొక వ్యాపారి కూడా చూశానని చెప్పడంతో తమ అనుమానం నిజమైందని.. మా శైలిలో విచారణ జరిపించగా మద్యం మత్తులో బాలికపై అమానుషంగా బలాత్కారం చేసి, చంపి పక్కనే ఉన్న బురదలో పడేసి పైకి కనిపించకుండా గోనె సంచులను కప్పినట్లు అతడు నేరాన్ని అంగీకరించాడన్నారు. బాలికను సజీవంగా ఇవ్వలేకపోతున్నందుకు ఆ కుటుంబానికి ఎస్పీ క్షమాపణ చెప్పారు. ఇది కూడా చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం -
11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..
కొచ్చిన్: కేరళలోని 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి చందాలు వేసి కొనుక్కున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకుంది. రాత్రికి రాత్రే అంత పెద్ద మొత్తంలో నడమంత్రపుసిరి సొంతం కావడంతో వారంతా ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. కేరళ ప్రభుత్వం 2023 వర్షాకాలం బంపర్ లాటరీ టికెట్ కొనడం కోసం 11 మంది మహిళా పారిశుధ్య కార్మికులు తలా కొంచెం చందాలు వేసుకున్నారు. పరప్పనంగడి మునిసిపాలిటీలోని హరిత కర్మ సేనకు చెందిన వీరందరివి అత్యంత నిరుపేద కుటుంబాలు. చందాలు పోగు చేసే సమయానికి వారిలో కొందరి వద్ద కనీసం రూ. 25 కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో చేతిలో ఎంత ఉంటే అంత పెట్టి ఎలాగోలా రూ. 250 పోగుచేసి బంపర్ లాటరీ టికెట్టు కొన్నారు. వారు కష్టపడి కొన్న అదే టికెట్‌కు రూ.10 కోట్లు బహుమతి లభించిందని తెలియగానే వారంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారిలో ఒకామె మాట్లాడుతూ.. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మేము మరికొంతమందిని అడిగి దీన్ని నిర్ధారించుకోవాలి. మేమంతా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చినవారమే. మాలో చాలామందికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయి. నాకే రూ.3 లక్షలు అప్పు ఉంది. ఇందులో నా వాటా డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాను. డబ్బు సరైన సమయానికి చేతికందిందని అనుకుంటున్నానంది. ఇక హరిత కర్మ సేన కోఆర్డినేటర్ వారి సిబ్బందిలో కొంతమంది లాటరీ గెలవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వారంతా తమ జీవనాన్ని సాఫిగా గడపడం కోసం ఏంతో కష్టపడేవారు. వారు సాధారణంగా ప్రతి ఇల్లు తిరిగి చెత్తను సేకరిస్తూ ఉంటారు. వారి నెల జీతం కూడా రూ. 8000 నుండి రూ. 15000 మాత్రమేనని అన్నారు. ఈ లాటరీలో వారి జీవితాలు మారిపోయినట్లేనని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 11 మంది పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగేళ్లుగా ఈ బంపర్ కాటరీ టికెట్ కొంటుండగా గతంలో ఒకసారి వీరికి ఓనమ్ బంపర్ లాటరీలో రూ. 1000 బహుమతి లభించగా ఈ సారి మాత్రం ఏనుగు కుంభస్థలాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా చదవండి: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్
-
నేడు కేరళకు ప్రధాని మోదీ
కొచ్చిన్/తిరువనంతపురం: ప్రధాని మోదీ సోమవారం నుంచి కేరళలో రెండు రోజులపాటు పర్యటిస్తారు. సోమవారం ఆయన కొచ్చిన్‌లో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. దేశంలో తొలి డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతోపాటు చర్చి పెద్దలతో సమావేశమవుతారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. యువజనుల కార్యక్రమం యువమ్–2023కి హాజరవుతారు. ప్రధాని పర్యటన ద్వారా రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. కాగా, ప్రధాని పర్యటన బందోబస్తులో 2,060 మందిని వినియోగించనున్నారు. పర్యటన సమయంలో ప్రధాని మోదీని ఆత్మాహుతి బాంబర్‌తో చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రాసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పేరుతో ఆ లేఖ రాసిన కొచ్చిన్‌కు చెందిన వ్యాపారి జేవియర్‌ని అదుపులోకి తీసుకున్నామని, జానీ అనే వ్యక్తిపై కక్షతోనే అతడు ఈ పనికి పాల్పడినట్లు తేలిందని చెప్పారు. -
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్ -
నీకు లైసెన్స్ ఇవ్వలేమమ్మా..
ఇరవై ఎనిమిదేళ్ల జిలిమోల్ మారియట్ థామస్.. కారు డ్రైవింగ్ లైసెన్సు కోసం వచ్చినప్పుడు ఆర్టీయే అధికారులు ‘‘నీకు లైసెన్స్ ఇవ్వలేమమ్మా’’అన్నారు.‘‘నాకు డ్రైవింగ్ వచ్చు సార్, కావాలంటే మీ కళ్ల ముందే కారు నడిపి చూపిస్తాను’’ అంది జలిమోల్. చక్కగా డ్రైవ్ చేస్తే ఎవరికైనా లైసెన్స్ ఇచ్చి తీరవలసిందే కానీ, ఆమెకు ఇవ్వడానికి మాత్రం అధికారులు నిరాకరించారు. కారణం.. ఆమె చేతులతో కాకుండా కాళ్లతో కారు నడిపింది. జిలిమోల్కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. చేతులు లేవన్నది అధికారుల అభ్యంతరం. ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. ఏం చేయాలో తోచక ఆమె లైసెన్స్ విషయాన్ని అలా ఫైళ్లలో ఉంచేశారు.థలిడోమైడ్ సిండ్రోమ్ అనే జన్యు అపసవ్యత కారణంగా రెండు చేతులూ లేకుండా పుట్టింది జిలిమోల్. తన పనులైనా తను చేసుకోలేదు. కానీ కాస్త వయసు రాగానే జిలిమోల్ సొంతంగా పనులు చేసుకోవడం నేర్చుకుంది. ఎవరిపైనా దేనికీ ఆధార పడకూడదు అని మనసులో గట్టిగా సంకల్పించుకున్నాక.. తనకు చేతులు లేవన్న భావను తుడిచిపెట్టేసింది. చురుగ్గా ఉండటం, చదువుల్లో రాణించడం ఆమెకు కష్టం కాలేదు కానీ.. ఆమెకు ఉన్న ఒక కోరిక తీరడానికి మాత్రం ఇంట్లోవాళ్లను ఆమె సంసిద్దులను చెయ్యాల్సి వచ్చింది. కారు నడుపుతున్న జిలిమోల్ ‘‘కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను నాన్నా’’ అంది ఓ రోజు. ఆ మాటకు తల్లిదండ్రులిద్దరూ సంశయంలో పడ్డారు. నాన్న థామస్ రైతు. అమ్మ అన్నాకుట్టి గృహిణి. ఆ వంశం లో డ్రైవింగ్ తెలిసినవాళ్లే లేరు. ‘అది కాదు తల్లీ..’ అనబోయారు కానీ, కూతురి పట్టుదల తెలిసి ఆమె ముచ్చట తీర్చారు. మారుతి సెలరో–ఆటోమేటిక్కి తనకు అనుకూలంగా మార్పులు చేయించుకుని (ఒక ఆర్టీయే అధికారి సూచనలతో) కాళ్లతో డ్రైవింగ్ నేర్చుకుంది జిలిమోల్. చాలా త్వరగా డ్రైవింగ్ వచ్చేసింది! అమ్మానాన్న, చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎర్నాకులంలో వాళ్లుంటున్న నివాసం పక్కన వైఎంసిఎ కాంపౌండ్‌లో డ్రైవింగ్ నేర్చుకుంది జిలిమోల్. కాళ్లతో కారు డ్రైవ్ చేసుకుంటూ ధైర్యంగా ఎర్నాకులం రోడ్లన్నీ తిరిగేస్తోంది కూడా. కానీ, ఆమెకు లైసెన్స్ ఇచ్చే చొరవనే అధికారులు చూపించలేకపోతున్నారు. తనకు లైసెన్స్ ఇప్పించమని జిలిమోల్ 2018లో హైకోర్టుకు కూడా వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే అంది. రాష్ట్ర ప్రభుత్వమే వెనకాడుతోంది. జిలిమోల్ మాత్రం లైసెన్స్ సాధించి తీరుతాను అంటోంది. -
ఐసీఐసీఐ బ్యాంక్, కొచర్‌లపై అమెరికా ఎస్ఈసీ దర్యాప్తు!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలివ్వడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారన్న(క్విడ్ ప్రో కో) ఆరోపణలపై అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. ఎస్ఈసీ కూడా రంగంలోకి దిగనుంది. ఈ ఉదంతంలో ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్‌లపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీబీఐతోపాటు పలు దేశీ దర్యాప్తు ఏజెన్సీలు దీనిపై విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తమకు సహకరించాల్సిందిగా మారిషస్ ఇతర విదేశీ దర్యాప్తు సంస్థలను దేశీ నియంత్రణ సంస్థలు, ఏజెన్సీలు కోరినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, అమెరికా నియంత్రణ సంస్థ దర్యాప్తు వార్తలపై ఇటు ఐసీఐసీఐ బ్యాంక్, ఇటు ఎస్ఈసీ ప్రతినిధులు కూడా స్పందించలేదు. ఈ ఏడాది మార్చిలో ఈ క్విడ్ ప్రో కో వ్యవహారం వెలుగు చూసిన వెంటనే కొచర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందంAటూ పేర్కొన్న ఐసీఐసీఐ డైరెక్టర్ల బోర్డు.. తాజాగా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అమెరికాలో కూడా లిస్టయిన నేపథ్యంలో(ఏడీఆర్) ఈ అంశంపై మన స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఎస్ఈసీ వివరాలను కోరనుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తులో భాగంగా సెబీ ఇప్పటికే ఐసీఐసీఐ, కొచర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. -
సముద్ర తీర ప్రాంతాల సందర్శన
పాఠక పర్యటన మూడు సముద్రాలు కలిసే చోట స్నానాలు... మంచుకొండలలో అద్భుతాలు... ‘పచ్చని తరులు నెలకొన్న గిరులు మండువేసవిలో చల్లందనాన్ని... అలలు లేని సముద్రంపై లాంచీలలో విహారం ఆహ్లాదాన్ని ... ఆలయాల సందర్శన ఆధ్యాత్మికత సౌరభాలను ఎదనిండా నింపింది’ అంటూ కొచ్చిన్ నుంచి కన్యాకుమారి వరకు సాగిన తమ ప్రయాణపు అనుభూతుల గురించి వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులైన వీరయ్యకొంకల. మండువేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడానికి విహారయాత్ర చేద్దామని మిత్రులు జె.కె శ్రీనివాస్, కె.భరత్‌ల కుటుంబాలతో కలిసి రెండు నెలల ముందుగానే ప్లాన్ చేశాం. దీని వల్ల మొత్తం తొమ్మిది రోజులలో 14 ముఖ్య ప్రదేశాలను చూడగలిగాం. దాదాపు 4,220 కి.మీ... కొచ్చిన్ నుండి చెన్నై వరకు ఉన్న అన్ని సముద్ర తీర ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేశాం. రాత్రి హైదరాబాద్ నుండి బయల్దేరి మరుసటి ఉద యం 10 గంటలకు కోయంబత్తూరులో రైలు దిగాం. ఘాట్రోడ్లో దారి కిరువైపుల ఎత్తై చెట్లు, వంపుల రోడ్లు, సన్నగా ఉన్న సింగిల్ రోడ్లో మా ప్రయాణం సాగింది. పచ్చందనాల ఊటి... ముందుగా ఊటి చేరుకున్నాం. తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేశాయి. ఇక్కడ భోజనాల సమయంలో తాగడానికి వేడినీళ్ళు ఇచ్చారు. ముందు ఆశ్చర్యం అనిపించినా, వేసవిలోనూ చల్లగా ఉండే వాతావరణం అబ్బురమనిపించింది. అలలు లేని సముద్రం.. రెండవరోజు ఉదయం కొయంబత్తూరుకు వెళుతూ మధ్యలో తేయాకు తోటలను సందర్శించాం. కోయంబత్తూరు నుండి ఎర్నాకుళం చేరుకుని, సాయంకాలం కొచ్చిన్ ఓడరేవుకు చేరుకున్నాం. అలలు లేని గంభీర సముద్రం.. అక్కడక్కడా ఆగి ఉన్న పెద్ద పెద్ద ఓడలను చూస్తూ ఎంజాయ్ చేశాం. ద్వీపాల సముదాయం... మూడవరోజు ఉదయం అలెప్పీ చేరుకున్నాం. ఇక్కడంతా సముద్రం బ్యాక్ వాటర్, చిన్న చిన్న ద్వీపాల సముదాయాలతో ఉంటుంది. నీటిలో అక్కడక్కడా లాంచీల స్టాండులు, చిన్న చిన్న గ్రామాలు... వింతగా అనిపించాయి. అలెప్పీ బీచ్‌కు వెళ్లి 4 గంటలకు పైగా సముద్రంలో ఎంజాయ్ చేసి తిరిగి ఎర్నాకుళం చేరుకున్నాం. రాత్రి కి తిరువనంతపురం బయల్దేరాం. పద్మనాభుని సందర్శన... నాలుగవ రోజు కేరళలోని తిరువనంతపురం లో పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి, అటు నుంచి 10 కి.మీ దూరంలో కోవలం బీచ్‌లో గంటల తరబడి చల్ల చల్లగా ఎంజాయ్ చేశాం. పడమటి సింధూరం కన్యాకుమారి... భారతదేశానికి దక్షిణ దిక్కున చిట్టచివరి ప్రదేశమైన కన్యాకుమారి ప్రకృతి సిద్ధమైన అద్భుతం. ఇక్కడ సూర్యోదయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అరేబియా, బంగాళాఖాతం, హిందూమహాసముద్రం కలిసే చోట అందరం స్నానాలు చేశాం. ఆసియాలో అతి పెద్ద విగ్రహం తిరుళ్ళువార్ సముద్రంలో 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానికి దగ్గరలోనే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ నుంచి మధురై బయల్దేరాం. పవిత్ర నగరం మదురై... తమిళనాడులోని మదురై నగరంలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని, అనంతరం ట్రావెల్ బస్సులో రామేశ్వరంకు ప్రయాణించాం. తమిళనాడులోని ముఖ్య పట్టణాలలో రామేశ్వరం ఒకటి. శ్రీలంకకు అతి దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటుంది. మేమంతా సముద్రంలో స్నానాలు చేసి, ఆలయానికి చేరుకున్నాం. మేఘాలలో విహారం... కొడెకైనాల్! ఏడో రోజు ఉదయం ట్రావెల్ బస్సులో కొడెకైనాల్ బయల్దేరాం. ఘాట్‌రోడ్డు మీద ప్రయాణం.. కొంతసేపు ఎండకాస్తే, మరికొంతసేపు వానజల్లులతో తడిసిపోతున్న కొండకోనలు కనువిందుచేశాయి. మే చివరి వారంలో.. అదీ మండువేసవిలో... స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించినా చలికి తట్టుకోలేకపోయాం. మధ్య మధ్యలో జలపాతాలు.. వాటి పరిసరాలలో వేడి వేడి పదార్థాలు తిని చలి నుంచి సాంత్వన పొందాం. రైలులో రాత్రికి చెన్నై బయల్దేరి, ఎనిమిదవ రోజు ఉదయం చెన్నై నుండి 70 కి.మీ దూరంలో కంచీపురం చేరుకున్నాం. అక్కడ కంచికామాక్షి, ఏకాంబరేశ్వర, కంచి మఠం దర్శించుకొని, కంచి పట్టుచీరల సొగసు, మెరీనా బీచ్ అందాలను గుండెల్లో నింపుకుని, రాత్రి రైలులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాం. -
మళ్లీ ఎయిర్‌లైన్స్... డిస్కౌంట్ ఆఫర్లు
ముంబై: స్పెస్‌జెట్, ఇండిగో విమానయాన సంస్థలు నాలుగో రౌండ్ ధరల పోరుకు తెర తీశాయి. ఈ రెండు కంపెనీలు సూపర్ హోలి సేల్స్, ఫ్లాష్ సేల్స్ పేరుతో ఎంపిక చేసిన రూట్లలో విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించాయి. ఈ విషయాన్ని స్పైస్‌జెట్ ధ్రువీకరించగా, ఇండిగో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇండిగో కంపెనీ 30% వరకూ డిస్కౌంట్‌ను ఇస్తోందని, ఈ ఆఫర్ మరో 5 రోజుల వరకూ ఉంటుందని సమాచారం. స్పైస్‌జెట్ ఎంపిక చేసిన రూట్లలో సూపర్ హోలి సేల్ పేరుతో డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ధరలు రూ.1,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 16 వరకూ బుక్ చేసుకునే, వచ్చే నెల 14 నుంచి జూన్ 30 మధ్య ప్రయాణాలకు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రయాణాలకు 30 రోజుల ముందు బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. తాజా ఆఫర్ కారణంగా హైదరాబాద్-కొచ్చిన్ చార్జీ రూ.2,999గా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి రెండో వారంలో తొలి సారి, గత నెలలో 2 సార్లు విమాన యాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. -
మనుసు దోస్తున్న కొచ్చిప్లవర్ షో
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్
కొచ్చి : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కొచ్చిలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్ బలానికి... కరీబియన్ ఆల్‌రౌండర్ల జోరుకు వన్డే సిరీస్ వేదిక కానుంది. సచిన్ టెండూల్కర్ ‘ఫేర్వెల్ టెస్టు సిరీస్’ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన వన్డేలలోనూ అదే ఆధిపత్యాన్ని కనబర్చాలని భావిస్తుండగా... పోయిన పరువును కొంతైనా కాపాడుకోవాలని బ్రేవో సేన ప్రయత్నిస్తోంది. జట్లు: భారత్: ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, ఎస్ ధావన్, ఆర్ఏ జడేజా, విరాట్ కోహ్లి, బి కుమార్, ఏ మిశ్రా, మహ్మద్ షమీ, ఎస్కె రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, ఆర్జీ శర్మ, ఉనాద్కట్, ఆర్ వినయ్ కుమార్, యువరాజ్ సింగ్ వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), గేల్, చార్లెస్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, దేవ్‌నారాయణ్, సిమ్మన్స్, స్యామీ, నరైన్, రాంపాల్, హోల్డర్.