లండన్‌ వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. | London-Bound Air India Flight Gets Bomb Threat, Suspect Arrested | Sakshi
Sakshi News home page

లండన్‌ వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. కేరళ వ్యక్తి అరెస్ట్‌

Published Tue, Jun 25 2024 1:14 PM | Last Updated on Tue, Jun 25 2024 1:38 PM

London-bound Air India flight gets bomb threat, suspect arrested

తిరువ‌నంత‌పురం: లండన్‌కు వెళ్లే ఎయిరిండియా విమానానికి మంగ‌ళ‌వారం బాంబు బెదిరింపులు  అందాయి. కేర‌ళ‌లోని కొచ్చిన్ విమానశ్రాయం నుంచి లండ‌న్ వెళ్లేందుకు ఎయిర్‌ ఇండియాకు చెందిన AI 149 విమానం లండన్‌ గాట్విక్‌ వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే కొచ్చి అంత‌ర్జాతీయ విమ‌నాశ్ర‌యంలోని ఎఎయిరిండియా సిబ్బందికి చేరవేశారు. ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ, ఎయిర్‌లైన్‌ సెక్యూరిటీ అధికారులు విమానంలో విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఇన్‌లైన్‌ బ్యాగేజీ స్క్రీనింగ్‌ సిస్టమ్‌ ద్వారా భద్రతా తనిఖీలు జరిపారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

అన్ని తనిఖీలు అనంతరం విమానం లండన్‌ వెళ్లేందుకు అనుమతించినట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్య‌క్తిని గుర్తించారు. అదే విమానంలో లండన్‌ వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుహైబ్‌గా తేల్చారు.

కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లోని చెక్-ఇన్ సమయంలో సుహైబ్, అతని భార్య, కుమార్తెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ కోసం అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించిన‌ట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement