కొచ్చిన్/తిరువనంతపురం: ప్రధాని మోదీ సోమవారం నుంచి కేరళలో రెండు రోజులపాటు పర్యటిస్తారు. సోమవారం ఆయన కొచ్చిన్‌లో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. దేశంలో తొలి డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతోపాటు చర్చి పెద్దలతో సమావేశమవుతారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. యువజనుల కార్యక్రమం యువమ్–2023కి హాజరవుతారు.
ప్రధాని పర్యటన ద్వారా రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. కాగా, ప్రధాని పర్యటన బందోబస్తులో 2,060 మందిని వినియోగించనున్నారు. పర్యటన సమయంలో ప్రధాని మోదీని ఆత్మాహుతి బాంబర్‌తో చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రాసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పేరుతో ఆ లేఖ రాసిన కొచ్చిన్‌కు చెందిన వ్యాపారి జేవియర్‌ని అదుపులోకి తీసుకున్నామని, జానీ అనే వ్యక్తిపై కక్షతోనే అతడు ఈ పనికి పాల్పడినట్లు తేలిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment