two days tour
-
మణిపూర్‌లో ఇండియా
ఇంఫాల్: కొంతకాలంగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల పర్యటన శనివారం మొదలైంది. ఇందుకోసం కాంగ్రెస్‌తో పాటు పలు పారీ్టలకు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు కనిమొళి (డీఎంకే), సుష్మితా దేవ్ (తృణమూల్ కాంగ్రెస్), ఆర్జేడీ, ఆరెల్డీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ తదితర పారీ్టల ఎంపీలు వీరిలో ఉన్నారు. రాజకీయాలు చేసేందుకు రాలేదని అధీర్ స్పష్టం చేశారు. ‘‘కేవలం బాధితులను కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడమే మా ఉద్దేశం. సమస్యకు పరిష్కారానికి అన్ని పారీ్టలూ చిత్తశుద్ధితో కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. మణిపూర్ కల్లోలం దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందన్నారు. శనివారం తొలి రోజు ఇంఫాల్‌తో పాటు మొయ్రంగ్, విష్ణుపూర్ జిల్లాలతో పాటు తాజాగా హింసాకాండ చెలరేగిన చౌరాచంద్‌పూర్‌లో కూడా ఎంపీల బృందం పర్యటించింది. కుకీ తెగకు చెందిన బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. వారికి ధైర్యం చెబుతూ గడిపింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేలా ఒత్తిడి తేవాలని బాధితులు వారిని కోరారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హింసాకాండ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్న కుట్ర ఫలితమేనని ఆరోపించారు. మణిపూర్ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అ«దీర్ దుయ్యబట్టారు. ‘‘మమ్నల్ని పార్లమెంటులో నోరెత్తనివ్వడం లేదు. అందుకే నేరుగా ప్రభావిత ప్రాంతాలకే వచ్చి, బాధితులతో మమేకమవుతున్నాం. వారు అనుభవించిన చిత్రహింసలకు సంబంధించిన దారుణ గాథలను వారి నోటే విని చలించిపోయాం’’ అని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా ఇంఫాల్ నుంచి హెలికాప్టర్లో బృందం పర్యటన సాగింది. ఆదివారం వారు గవర్నర్ అనసూయా ఉయికెను కలిసి సమస్యపై చర్చిస్తారని సమాచారం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ఇరు తెగత వారితోనూ చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. శనివారం చౌరాచంద్‌పూర్‌లో పునరావాస శిబిరాన్ని ఆమె సందర్శించారు. భారీ ర్యాలీ విపక్ష ఎంపీలు మణిపూర్‌లో అడుగు పెట్టిన రోజే రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వేలాది మంది కుకీ తెగ ప్రజలు ఇంపాల్‌లో భారీ ర్యాలీ జరిపారు. తమ ప్రాబల్యమున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కావాలంటూ నినదించారు. మణిపూర్ సమగ్ర సమన్వయ కమిటీ సారథ్యంలో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. భర్త, కొడుకుల మృతదేహాలు చూపించండి తన కుమారుడు, భర్త మృతదేహాలనైనా చూపించండంటూ అత్యాచార బాధితురాలు విపక్ష ఎంపీలను కోరారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ప్రత్యర్థి తెగకు చెందినవారు నగ్నంగా ఊరేగించడం తెలిసిందే. వారిలో ఒక మహిళను ఎంపీలు కనిమొళి (డీఎంకే), సుషి్మతాదేవ్ (టీఎంసీ) కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ Mýఆమె భర్తను, కొడుకును చంపడంతో పాటు ఆమె కూతురిపై కూడా అత్యాచారనికి ఒడిగట్టారన్నారు. ఈ కేసు విచారణను శనివారం సీబీఐ చేపట్టింది. మణిపూర్ హింసపై ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ గొంతులు అప్పుడేమైనట్టు: బీజేపీ మణిపూర్‌లో విపక్ష ఎంపీల పర్యటన ఫక్తు రాజకీయ నాటకమని బీజేపీ దుయ్యబట్టింది. గత ప్రభుత్వాల హయాంలో మణిపూర్ భగ్గున మండి నెలల తరబడి స్తంభించినప్పుడు వీరంతా పార్లమెంటులో కనీసం నోరైనా ఎత్తలేదెందుకని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. బీజేపీ విమర్శలను ఇండియా బృందం తిప్పికొట్టింది. ‘‘ప్రధాని సారథ్యంలో అఖిలపక్ష బృందం మణిపూర్‌లో పర్యటిస్తే అందులో ఆనందంగా భాగస్వాములం అయ్యేవాళ్లం. కానీ అందరికంటే ముందుగా, ఎక్కువగా స్పందించాల్సిన ఆయన అసలు సోదిలో కూడా లేకుండాపోయారు’అంటూ దుయ్యబట్టింది. -
నేడు కేరళకు ప్రధాని మోదీ
కొచ్చిన్/తిరువనంతపురం: ప్రధాని మోదీ సోమవారం నుంచి కేరళలో రెండు రోజులపాటు పర్యటిస్తారు. సోమవారం ఆయన కొచ్చిన్‌లో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. దేశంలో తొలి డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతోపాటు చర్చి పెద్దలతో సమావేశమవుతారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. యువజనుల కార్యక్రమం యువమ్–2023కి హాజరవుతారు. ప్రధాని పర్యటన ద్వారా రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. కాగా, ప్రధాని పర్యటన బందోబస్తులో 2,060 మందిని వినియోగించనున్నారు. పర్యటన సమయంలో ప్రధాని మోదీని ఆత్మాహుతి బాంబర్‌తో చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రాసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పేరుతో ఆ లేఖ రాసిన కొచ్చిన్‌కు చెందిన వ్యాపారి జేవియర్‌ని అదుపులోకి తీసుకున్నామని, జానీ అనే వ్యక్తిపై కక్షతోనే అతడు ఈ పనికి పాల్పడినట్లు తేలిందని చెప్పారు. -
రెండు రోజులు.. ఒక్క నిమిషంలో పూర్తైతే..!
వైరల్: కాలం ఎంత వేగంగా గడుస్తుందో కదా. కానీ, రెండు రోజులు ఒక నిమిషంలో పూర్తి చేసుకుంటే ఎలా ఉంటుంది? మరి అంత వేగం భూమ్మీద ఎలాగంటారా? కంగారు పడకండి. అది టైమ్ ల్యాప్స్ ద్వారానే సుమి!. మంచు తుపాన్‌తో అతలాకుతలం అయిన అమెరికా నుంచి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందమైన ప్రాంతం.. దానికి తగట్లుగా మంచి రోడ్డు, ఆ పక్కన ఇల్లు. ఒక ఇంటి లాన్లో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ.. కట్ చేస్తే.. కాలం వేగంగా ముందుకు వెళ్తుంది. అదీ రెండు రోజులపాటు. ఆ ప్రాంతం మొత్తం మంచు కప్పేస్తుంది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యేంత పరిస్థితి దాపురిస్తుంది. అయినా ఆ వీడియో ఆగదు. రెండు రోజులపాటుగా పని చేసిన కెమెరా.. అక్కడి దృశ్యాలను రికార్డు చేసింది. ఆ రెండు రోజుల వీడియోనే వేగంగా.. 60 సెకండ్లలో చూపించింది ఆ వీడియో. సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, షేర్లతో దూసుకుపోతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.. 48 hour timelapse of Blizzard in 60 seconds. pic.twitter.com/tPjrUFnmzR — Weird and Terrifying (@weirdterrifying) December 29, 2022 -
నేడు వెంకటాచలానికి ఉపరాష్ట్రపతి రాక
సాక్షి, వెంకటాచలం: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం వెంకటాచలానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం 11 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక రైల్లో వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11:15 గంటలకు స్వర్ణభారత్‌ట్రస్ట్‌కు చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకుని 12:45 గంటలకు సరస్వతీనగర్‌లోని బీఎంపీటీసీ మోడల్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడే ఉన్న కమ్యూనిటీహాల్లో తెలుగు స్కాలర్స్‌తో సమావేశమై తిరిగి స్వర్ణభారత్‌ట్రస్ట్ చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ట్రస్ట్ ప్రాంగణంలో సాయంత్రం 5:15 నుంచి 7 గంటల వరకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై రాత్రి స్వర్ణభారత్‌ట్రస్ట్‌లోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం 7:40 గంటలకు అక్షర విద్యాలయం చేరుకుని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి అక్షర విద్యార్థులు, శిక్షణ పొందుతున్న యువకులతో సమావేశమవుతారు. 8:30 నుంచి 9:30 గంటల వరకు అక్షర విద్యాలయాన్ని ఉపరాష్ట్రపతితో పాటుగా గవర్నర్ సందర్శిస్తారు. అక్కడి నుంచి దీన్‌దయాళ్ అంత్యోదయ భవన్‌కు చేరుకుని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 9:55 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. 12:30 గంటలకు ఉపరాష్ట్రపతి అక్షర విద్యాలయం చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరగనున్న విక్రమసింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్ చేరుకుని ప్రత్యేక రైల్లో చెన్నైకి పయనమవుతారు. భద్రతా వలయంలో వెంకటాచలం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో వెంకటాచలంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకటాచలం రైల్వేస్టేషన్, స్వర్ణభారత్‌ట్రస్ట్, సరస్వతీనగర్, అక్షర విద్యాలయం తదితర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. వెంకటాచలం రైల్వేస్టేషన్‌ను రంగులతో ముస్తాబు చేశారు. అప్రమత్తంగా ఉండాలి – సిబ్బందికి ఎస్పీ సూచన నెల్లూరు(క్రైమ్) : ఉపరాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ సిబ్బందికి సూచించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పర్యటించనున్న ప్రాంతాలను ఆదివారం ఉదయం నుంచే పోలీసులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా బాంబ్, డాగ్‌స్కా్వడ్‌లు తనిఖీలు నిర్వహించాయి. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందితో ఎస్పీ ఆదివారం సమావేశం నిర్వహించారు. సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్థానిక పోలీసు కవాతు మైదానంలో కస్తూర్బా కళాక్షేత్రం, సరస్వతీనగర్‌లో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ విధిగా ఐడీకార్డులు, డ్యూటీ పాస్‌లు కల్గి ఉండాలని తెలిపారు. వీవీఐపీలు పర్యటించే సమయంలో అటుగా వాహనాల రాకపోకలను నిషేధించాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్వంలో ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ క్రైమ్స్ పి.మనోహర్‌రావు, డీఎస్పీలు కోటారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మగ్బుల్, మల్లికార్జున, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కరీంనగర్లో సీఎం రెండు రోజుల పర్యటన
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. హరితహారంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బస్సుయాత్ర ద్వారా బస్వాపూర్ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తారు. బస్వాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, ముల్కనూర్, కొత్తపల్లి, నుస్తులాపూర్, తిమ్మాపూర్, అలుగునూర్ వద్ద మొక్కలు నాటుతారు. రాత్రి కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి వద్ద నున్న ఉత్తర తెలంగాణభవన్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం కరీంనగర్లో మొక్కలు నాటి యాదాద్రికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి జిల్లాలోని పెద్దపల్లికి చేరుకుని పెద్దపల్లి, ధర్మారంలో మొక్కలు నాటి రాయపట్నం మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారు.