
కాలం వేగంగా తిరుగుతుంది కానీ, మరి ఇంత వేగంగానా? అనే అనుమానం..
వైరల్: కాలం ఎంత వేగంగా గడుస్తుందో కదా. కానీ, రెండు రోజులు ఒక నిమిషంలో పూర్తి చేసుకుంటే ఎలా ఉంటుంది? మరి అంత వేగం భూమ్మీద ఎలాగంటారా? కంగారు పడకండి. అది టైమ్ ల్యాప్స్ ద్వారానే సుమి!.
మంచు తుపాన్‌తో అతలాకుతలం అయిన అమెరికా నుంచి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందమైన ప్రాంతం.. దానికి తగట్లుగా మంచి రోడ్డు, ఆ పక్కన ఇల్లు. ఒక ఇంటి లాన్‌లో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ.. కట్ చేస్తే..
కాలం వేగంగా ముందుకు వెళ్తుంది. అదీ రెండు రోజులపాటు. ఆ ప్రాంతం మొత్తం మంచు కప్పేస్తుంది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యేంత పరిస్థితి దాపురిస్తుంది. అయినా ఆ వీడియో ఆగదు. రెండు రోజులపాటుగా పని చేసిన కెమెరా.. అక్కడి దృశ్యాలను రికార్డు చేసింది. ఆ రెండు రోజుల వీడియోనే వేగంగా.. 60 సెకండ్లలో చూపించింది ఆ వీడియో. సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, షేర్లతో దూసుకుపోతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి..
48 hour timelapse of Blizzard in 60 seconds. pic.twitter.com/tPjrUFnmzR
— Weird and Terrifying (@weirdterrifying) December 29, 2022