ఈనెల 26 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఆరుగురు రిఫరీల ప్యానెల్‌లో హైదరాబాద్ మాజీ రంజీ ఆటగాడు డేనియల్ మనోహర్‌కు చోటు దక్కింది. ఈ ప్యానెల్‌లో మనోహర్.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్‌తో కలిసి పని చేయనున్నాడు. మనోహర్.. ఐపీఎల్‌లో రిఫరీగా వ్యవహరించబోయే తొలి హైదరాబాదీగా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.
గతంలో శివరాం, షంషుద్దీన్, నంద కిషోర్‌లు ఐపీఎల్‌లో హైదరాబాద్ నుంచి అంపైర్లుగా వ్యవహరించారు. మనోహర్.. 73 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీల సాయంతో 4009 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 65 వికెట్లు పడగొట్టాడు. 2007-08 సీజన్ అనంతరం అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 48 ఏళ్ల మనోహర్ భారత ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.
చదవండి: Maxwell: ప్రత్యర్ధులు బహు పరాక్.. కెప్టెన్సీ భారం లేని కోహ్లి ఉప్పెనలా విరుచుకుపడతాడు..
Comments
Please login to add a commentAdd a comment