హైదరాబాద్: మన్కడింగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో తెరపైకి వచ్చిన పేరు. సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ రనౌట్ చేయడంతో దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ఈ విషయంలో పలువురు అశ్విన్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది.
అయితే ‘మన్కడింగ్’ భారి నుంచి బ్యాట్స్‌మెన్ ఎలా తప్పించుకోవచ్చో గల్లీ క్రికెటర్లు ఫన్నీగా వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నాన్ స్ట్రయికర్ బ్యాట్‌కు బదులు కొబ్బరి మట్టతో క్రీజులోకి వచ్చాడు. బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టిన కాసేపటికి నాన్‌స్ట్రయికర్ పరుగు కోసం ప్రయత్నించడం.. క్రీజు మధ్యలో నిలుచొని కొబ్బరి మట్టతో సులువుగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘ఈ విధమైన క్రికెట్‌కు ఐసీసీ ఒప్పుకుంటే మన్కడింగ్ వివాదమే ఉండదు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
చదవండి: మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా?
అశ్విన్ ఏందీ తొండాట..!
Comments
Please login to add a commentAdd a comment