వైరల్‌: ‘మన్కడింగ్‌’కు గల్లీ క్రికెటర్ల పరిష్కారం | Viral Video New Technique Of Running Between Wickets In Cricket | Sakshi
Sakshi News home page

వైరల్‌: ‘మన్కడింగ్‌’కు గల్లీ క్రికెటర్ల పరిష్కారం

Published Mon, Apr 8 2019 6:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

మన్కడింగ్.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో తెరపైకి వచ్చిన పేరు. సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ రనౌట్ చేయడంతో దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ఈ విషయంలో పలువురు అశ్విన్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్‌ నియమావళి  41.16 ప్రకారం బౌలర్‌ బంతి విసరకముందే నాన్‌ స్ట్రయికర్‌ క్రీజ్‌ దాటినప్పుడు అతడిని అవుట్‌ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement