హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అతిథ్య జట్టుకు 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం 290 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు జింబాబ్వే ఓపెనర్లు ఇన్నోసెంట్ కైయా, కైటినో బరిలోకి దిగారు. అయితే భారత పేసర్ దీపక్ చాహర్ తొలి ఓవర్ వేసే క్రమంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న కైయాను మన్కడింగ్(రనౌట్) చేసే ప్రయత్నం చేశాడు.
కాగా చాహర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి.. కైయా క్రీజు నుంచి దూరంగా ఉన్నాడు. అయితే చాహర్ బెయిల్స్ పడగొట్టినప్పటికీ రనౌట్‌కు మాత్రం అప్పీల్ చేయలేదు. ఒక వేళ చాహర్ అప్పీల్ చేసి వుంటే మాత్రం కచ్చితంగా రనౌట్‌గానే అంపైర్ ప్రకటించే వాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చహర్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి చాహర్ ఇది.. అశ్విన్‌ను చూసి నేర్చుకున్నావా..?" అంటూ కామెంట్ చేశాడు. కాగా 2012లో శ్రీలంకపై, 2019 ఐపీఎల్ సీజన్‌లో జోస్ బట్లర్‌ను ఈ విధంగానే అశ్విన్ ఔట్ చేశాడు. అయితే బట్లర్‌ను మన్కడింగ్ చేసిన అశ్విన్ అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్’ ఔట్ ను సాధారణ రనౌట్ గా చేస్తూ ఈ ఏడాది మార్చిలో మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయం తీసుకుంది.
Deepak Chahar didn't Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl
— Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022
Shades of Ashwin in Deepak Chahar. Kaia was almost Mankad had he appealed.
— Gagan Thakur (@gagan_gt) August 22, 2022
చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి!
Comments
Please login to add a commentAdd a comment