దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై ఐసీసీ 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్‌పై ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఈ ఆరోపణలను ఖండించిన స్ట్రీక్.. తాజాగా వాటిని అంగీకరించాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కోచ్‌గా వ్యవహరించిన హీత్ స్ట్రీక్ ఆ సమయంలోనే అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
2017, 2018లలో వివిధ మ్యాచ్‌ల సందర్భంగా అతడు తన టీమ్‌లోని ప్లేయర్స్ దగ్గరికి బుకీలను అనుమతించడాన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండగా.. ఐపీఎల్, బీపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రిమియర్ లీగ్‌లలోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫలితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధక కౌన్సిలింగ్ సెషన్లకు హాజరైన స్ట్రీక్ ఇలా చేయడం బాధాకరమని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు.
చదవండి: మ్యాచ్ ఓడినందుకు షారుఖ్ క్షమాపణ.. స్పందించిన రసెల్
సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment