పాక్‌దే వన్డే సిరీస్
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో గెలుచుకుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న మిస్బాసేన శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 108 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 260 పరుగులు చేసింది.
మిస్బా (67), అహ్మద్ షెహజాద్ (54) అర్ధసెంచరీలతో చెలరేగారు. నాజిర్ జంషేద్ (38), ఉమర్ అమిన్ (33) ఫర్వాలేదనిపించారు. చివర్లో సర్ఫార్రాజ్ అహ్మద్ (22) వేగంగా ఆడాడు. టెండి చతారాకు మూడు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడింది. వాలర్ (48) టాప్ స్కోరర్. హమిల్టన్ మసకద్జా (25), టేలర్ (26), ఉత్సెయా (23)లు ఓ మోస్తరుగా ఆడారు. మహ్మద్ హఫీజ్, అబ్దుర్ రెహమాన్, అజ్మల్ తలా రెండేసి వికెట్లు తీశారు. మిస్బాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, హఫీజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
సోమవారం చెల్లిస్తాం: జింబాబ్వే బోర్డు
తమకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని లేదంటే మ్యాచ్ ఆడబోమని హెచ్చరించిన జింబాబ్వే ఆటగాళ్లు ఎట్టకేలకు శాంతించారు. బకాయిలను సోమవారం చెల్లిస్తామని బోర్డు హామీ ఇవ్వడంతో పాక్‌తో ఆఖరి వన్డేలో బరిలోకి దిగారు. అయితే ఇప్పటికే పలుసార్లు బోర్డు మాట తప్పడంతో అటు ఆటగాళ్లు కూడా అల్టిమేటం జారీ చేశారు. సోమవారం డబ్బులు చెల్లించకుంటే పాక్‌తో జరగబోయే టెస్టు మ్యాచ్‌లు ఆడబోమని హెచ్చరించారు.