టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో తన చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో మొదటి బంతికే ఔట్ అయిన సూర్యకుమార్ యాదవ్.. మూడు వన్టేల్లోనూ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన సూర్య.. అష్టన్ అగర్ బౌలింగ్‌లో మొదటి బంతికే పెవిలియన్‌కు చేరాడు.
అగర్ వేసిన స్ట్రెయిట్ లెంగ్త్ బాల్‌కు బ్యాక్‌ఫుట్‌పై షాట్ ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయి స్టంప్‌లను తాకింది. దీంతో ఖాతా తెరవకుండానే సూర్య నిరాశతో మైదానాన్ని వీడాడు.
అత్యంత చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో గోల్డన్‌డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్ యాదవ్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో వరుసగా మూడు సార్లు డకౌటైన ఆరో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు.
అంతకుముందు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వరుసగా మూడు డకౌట్‌లుగా వెనుదిరిగారు. కానీ వీరంతా తొలి బంతికే ఔట్ కాలేదు. అయితే ప్రపంచ క్రికెట్‌లో వరుసగా అత్యధిక డకౌట్‌లు అయిన రికార్డు మాత్రం శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉంది. వన్డేల్లో మలింగ వరుసగా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: IND vs AUS: అదే మా కొంప ముంచింది.. అస్సలు ఊహించలేదు! క్రెడిట్ మొత్తం వారికే
Comments
Please login to add a commentAdd a comment