IND vs AUS: మాక్స్‌వెల్‌ విధ్వంసకర సెంచరీ.. భారత్‌పై ఆసీస్‌ విజయం | India Vs Australia 3rd T20I Live Updates | Sakshi
Sakshi News home page

India Vs Australia 3rd T20I: మాక్స్‌వెల్‌ విధ్వంసకర సెంచరీ.. భారత్‌పై ఆసీస్‌ విజయం

Published Tue, Nov 28 2023 6:29 PM | Last Updated on Tue, Nov 28 2023 10:58 PM

India Vs Australia 3rd T20I Live Updates - Sakshi

గౌహతి వేదికగా టీమిండియాతో  జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అద్బుత విజయం సాధించింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి  దిగిన ఆస్ట్రేలియా ఆఖరి బంతికి 5 వికెట్లు ​కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మెరుపు సెంచరీతో  కీలక పాత్ర పోషించాడు.

ప్రసిద్ద్‌ కృష్ణ వేసిని ఆఖరి ఓవర్‌లో ఆసీస్‌ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని ఆసీస్‌ కెప్టెన్‌ మాథ్యూ వెడ్‌ ఫోర్ బాదాడు. అనంతరం రెండో బంతికి సింగిల్‌ తీసి మాక్స్‌వెల్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు.  4 బంతుల్లో 16 పరుగులు ​కావాల్సిన నేపథ్యంలో వరుసగా ఒక సిక్స్‌, మూడు ఫోర్లు బాది తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి మాక్సీ ఆజేయంగా నిలిచాడు. కాగా ఈ విజయంతో సిరీస్‌ అధిక్యాన్ని 2-1కు ఆసీస్‌ తగ్గించింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీతో అదరగొట్టాడు.  57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్‌ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

19 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 202 /5
19 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఆసీస్‌ విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు కావాలి.

18 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 180/5
18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆసీస్‌ విజయానికి 12 బంతుల్లో 43 పరుగులు కావాలి.

16 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 174/5
గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు.16 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆసీస్‌ విజయానికి 18 బంతుల్లో 49 పరుగులు కావాలి.

మాక్స్‌వెల్‌ హాఫ్‌ సెంచరీ..
మాక్స్‌వెల్‌ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 29 బంతుల్లో మాక్సీ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

ఐదో వికెట్‌ డౌన్‌..
భారత బౌలర్లు తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. టిమ్‌ డేవిడ్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 136/5

నాలుగో వికెట్‌ డౌన్‌.. 
128 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మార్క్‌స్‌ స్టోయినిష్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

9 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 99/3
9 ఓవర్లు ముగిసే  సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్‌వెల్‌(26), స్టోయినిష్‌(5) పరుగులతోఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
జోష్‌ ఇంగ్లీష్‌(10) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లీష్‌ను బిష్ణోయ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

రెండో వికెట్‌ డౌన్‌.. 
66 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌.. అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఆరోన్ హార్డీ.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 56/1. క్రీజులో ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లీష్‌(10) పరుగులతో ఉన్నారు.

రుత్‌రాజ్‌ విధ్వంసకర సెంచరీ.. 
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆసీస్‌ రుతురాజ్‌ బౌలర్లను ఊచ కోశాడు. ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్‌ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.  కాగా రుత్‌రాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. అతడితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌(39), తిలక్‌ వర్మ(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.


రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీ.. 
ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో సెంచరీతో సత్తాచాటాడు. 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో రుతురాజ్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

17 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 155/3
17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(71), తిలక్‌ వర్మ(21) పరుగులతో ఉన్నారు.

రుతురాజ్‌ గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీ.. 
టీమిండియా యువ ​ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లతో రుతు తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.15 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 143/3. క్రీజులో గైక్వాడ్‌(63), తిలక్‌ వర్మ(17) పరుగులతో ఉన్నారు.

టీమిండియా మూడో వికెట్‌ డౌన్‌.. సూర్యకుమార్‌ ఔట్‌
81 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 101/3

దూకుడుగా ఆడుతున్న సూర్య.. 
8ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపిస్తున్నాడు. 33 పరుగులతో సూర్య బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడితో పాటు క్రీజులో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(12) ఉన్నాడు.

5 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 39/2
5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(13), రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(6) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు.

టీమిండియాకు బిగ్‌ షాక్‌.. ఇషాన్‌ కిషన్‌ ఔట్‌
24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిలోకి బిగ్‌ షాక్‌ తగిలింది.  యువ ఓపెనర్‌ జైశ్వాల్‌(6) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్‌ కిషన్‌ వచ్చాడు. 2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 18/1

గౌహతి వేదికగా మూడో టీ20లో ఆస్ట్రేలియా-భారత్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా ముఖేష్‌ ​కుమార్‌ దూరమయ్యాడు. అతడి స్ధానంలో అవేష్‌ ఖాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, కేన్ రిచర్డ్‌సన్, బెహ్రెన్‌డార్ఫ్ వచ్చారు.

తుది జట్లు
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్

భారత్‌: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement