సూర్య కుమార్ యాదవ్.. ఈ పేరు గురుంచి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చినా తన ఆటతీరుతో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్నాడు. మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య.. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. అయితే ఇదింతా టీ20 క్రికెట్‌లో మాత్రమే.
గత కొంత కాలంగా టీ20ల్లో నెం1 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ ముంబైకర్.. వన్డేల్లో మాత్రం తన శైలిగా భిన్నంగా ఆడుతున్నాడు. అతడికి ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగ పరుచుకో లేకపోయాడు. చివరగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కూడా అదే ఆటతీరు.
ఏ మాత్రం మార్పు లేదు. ఆసియాకప్‌కు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితం. దీంతో వన్డేల్లో అతడి కథ ముగిసిందని అంతా భావించారు. కానీ భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం అతడిపై పూర్తినమ్మకంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సూర్యను ఎంపిక చేశారు.
సూర్య గ్రహణం వీడింది..
అయితే ద్రవిడ్ నమ్మకాన్ని సూర్య భాయ్ వమ్ము చేయలేదు. ఎట్టకేలకు సూర్యగ్రహణం వీడింది. ఎక్కడైతే తల దించుకున్నాడో.. అక్కడే మళ్లీ సత్తా చాటాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యి ఘోర ఆ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. ఈ సారి మాత్రం కంగారూలకు ఆ అవకాశం సూర్య ఇవ్వలేదు. వన్డేల్లో 590 రోజుల తర్వాత తొలి హాఫ్ సెంచరీని సూర్య సాధించాడు.
కీలక సమయంలో తన బ్యాటింగ్ పొజిషేన్‌కు భిన్నంగా వచ్చిన సూర్యకుమార్.. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న సూర్య 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్‌కు ముందు సూర్య ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఇదే ఫామ్‌ను మిస్టర్ 360 కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు 28 వన్డేలు ఆడిన సూర్య.. 25.52 సగటుతో 587 పరుగులు చేశాడు.
చదవండి: IND vs AUS: ఇదేమి బౌలింగ్‌రా బాబు.. ఇతడితోనా వరల్డ్‌కప్ ఆడేది! రోహిత్ సపోర్ట్‌తోనే!!
Comments
Please login to add a commentAdd a comment