ట్రై సిరీస్: ఆసీస్ పై జింబాబ్వే ఘన విజయం | Chigumbura guides Zimbabwe to remarkable win over Aussies | Sakshi
Sakshi News home page

ట్రై సిరీస్: ఆసీస్ పై జింబాబ్వే ఘన విజయం

Published Sun, Aug 31 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

Chigumbura guides Zimbabwe to remarkable win over Aussies

హరారే: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ముక్కోణపు పోటీలో జింబాబ్వే చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. 210 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే 48 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 31 ఏళ్ల తరువాత ఆసీస్ పై జింబాబ్వేకు రెండో విజయం దక్కింది. జింబాబ్వే ఆటగాళ్లలో చిగుంబరా(52), టేలర్(32), ఉత్సేయా(30),సికందర్ రాజా(22)పరుగులు చేసి జట్టు గెలుపుకు సహకరించారు.

 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 209 పరుగులు మాత్రమే చేసింది.ఆసీస్ కెప్టెన్ క్లార్క్(68),హడిన్(49), కట్టింగ్(26)పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో విలియమ్స్, తిరిపానో, ఉత్సేయాలకు తలో రెండు వికెట్లు తీసి ఆసీస్ ను తక్కువ పరుగులకు కట్టడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement