Utseya
-
ట్రై సిరీస్: ఆసీస్ పై జింబాబ్వే ఘన విజయం
హరారే: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ముక్కోణపు పోటీలో జింబాబ్వే చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. 210 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే 48 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 31 ఏళ్ల తరువాత ఆసీస్ పై జింబాబ్వేకు రెండో విజయం దక్కింది. జింబాబ్వే ఆటగాళ్లలో చిగుంబరా(52), టేలర్(32), ఉత్సేయా(30),సికందర్ రాజా(22)పరుగులు చేసి జట్టు గెలుపుకు సహకరించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 209 పరుగులు మాత్రమే చేసింది.ఆసీస్ కెప్టెన్ క్లార్క్(68),హడిన్(49), కట్టింగ్(26)పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో విలియమ్స్, తిరిపానో, ఉత్సేయాలకు తలో రెండు వికెట్లు తీసి ఆసీస్ ను తక్కువ పరుగులకు కట్టడి చేశారు. -
ఉత్సెయ హ్యాట్రిక్ వృథా
దక్షిణాఫ్రికా చేతిలో జింబాబ్వే ఓటమి హరారే: జింబాబ్వే స్పిన్నర్ ఉత్సెయ (5/36) ఆ దేశ క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్గా రికార్డు సాధించినా... దక్షిణాఫ్రికా చేతిలో జట్టు పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ప్రొటీస్ జట్టు 61 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఆమ్లా (66), డి కాక్ (76) రాణించారు. నయుంబు 3, చతారా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 38.3 ఓవర్లలో 170 పరుగులకే పరిమితమైంది. సీన్ విలియమ్స్ (46) టాప్ స్కోరర్. స్టెయిన్ మూడు, మెక్లారెన్ రెండు వికెట్లు తీశారు