
ముంబై: భారత్ గట్టి ప్రత్యర్థి అని జింబాబ్వే టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. ఈ భారత మాజీ ఓపెనర్ 2018 నుంచి జింబాబ్వేకు హెడ్ కోచ్‌గా తదనంతరం ఈ జూన్ నుంచి టెక్నికల్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టీమిండియా పర్యటిస్తున్న నేపథ్యంలో హరారేలో ఉన్న ఆయన మీడియాతో ముచ్చటించారు. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్లు జింబాబ్వేతో తరచూ ఆడాలని ఆశించారు.
2016 తర్వాత భారత్ ఇక్కడ పర్యటించడం జింబాబ్వే ఆటగాళ్లకు చక్కని అవకాశమని, గట్టి పోటీ జట్టును ఎదుర్కోవడం ద్వారా ఆటగాళ్లకు మేలు జరుగుతుందని లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించిన తమ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత జింబాబ్వే జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలబోతతో దీటుగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment