Lalchand Rajput
-
యూఏఈ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ నియమితుడయ్యాడు. ఈ పదవిలో రాజ్‌పుత్ మూడేళ్ల పాటు కొనసాగుతాడని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రాజ్‌పుత్ నియామకానికి ముందు యూఏఈ తాత్కాలిక కోచ్‌గా పాక్ మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్ వ్యవహరించారు. భారత మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం నాజర్ కొన్ని రోజుల పాటు తాత్కాలిక కోచ్‌గా పని చేశాడు. 62 ఏళ్ల రాజ్‌పుత్‌కు గతంలో అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. టీమిండియా 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఇతనే భారత జట్టు కోచ్‌గా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా లభించడంలో రాజ్‌పుత్ కోచ్‌గా క్రీయాశీలకపాత్ర పోషించాడు. 2018-2022 వరకు అతను జింబాబ్వే హెడ్‌కోచ్‌గా పని చేశాడు. యూఏఈ కోచ్‌గా నియమితుడైన అనంతరం రాజ్‌పుత్ ఇలా అన్నాడు. ఇటీవలికాలంలో యూఏఈ బలమైన అసోసియేట్ దేశంగా ఎదిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో యూఏఈ ఆటగాళ్లు టెస్ట్ హోదా కలిగిన దేశాల ఆటగాళ్లతో పోటీపడుతున్నారు. ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కాగా, లాల్‌చంద్ రాజ్‌పుత్ 1985-87 మధ్యలో భారత తరఫున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడాడు. -
లాల్ మంత్రం పని చేసింది.. జింబాబ్వేను మార్చేసింది
టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చి రెండు రోజులు కావొస్తుంది. అయినా ఇంకా ఆ జట్టు గురించి.. వాళ్లు చేసిన అద్భుతం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. టైటిల్ సాధిస్తుందో లేదో తెలియదు కానీ జింబాబ్వే ఆటతీరు మునుపటిలా లేదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇంతలా జింబాబ్వే ఆటలో మార్పు రావడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా. టీమిండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్. 2018 నుంచి 2022 వరకు లాల్ చంద్ రాజ్‌పుత్ జింబాబ్వే హెడ్‌కోచ్‌గా పని చేశాడు. ఈ నాలుగేళ్లలో జింబాబ్వే ఆటగాళ్లను సాన పట్టిన విధానం తాజాగా ప్రపంచకప్‌లో బయటపడింది. మరో విషయం ఏంటంటే 2007 అరంగేట్రం టి20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు లాల్‌చంద్ రాజ్‌పుత్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. లాల్‌చంద్ రాజ్‌పుత్ పనికి ముచ్చటపడిన బోర్డు టెక్నికల్ డైరెక్టర్‌గా నియమించుకుంది. టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడేవరకు రాజ్‌పుత్ జట్టుతోనే ఉన్నాడు. ఈలోగా దీపావళి పండుగ.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఇండియాకు తిరిగి వచ్చిన రాజ్‌పుత్ ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఈలోగా పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. జింబాబ్వే ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన లాల్‌చంద్ రాజ్‌పుత్ పీటీఐకి ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ''తేది కరెక్ట్‌గా గుర్తులేదు.. కానీ అది జూలై 2018 అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఆరోజే జింబాబ్వే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాను. నేను పదవి చేపట్టిన సమయంలోనే పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు జింబాబ్వే సీనియర్ క్రికెటర్లు అయిన సీన్ ఇర్విన్, క్రెయిగ్ విలియమ్స్, బ్రెండన్ టేలర్, సికందర్ రజాలు బోర్డుతో ఉన్న విభేదాల కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నారు. నేను ఎంత చెప్పి చూసినా నా మాట కూడా వినలేదు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే ఇలా సీనియర్ ఆటగాళ్లు దూరం కావడం నాకు బాధను కలిగించింది. ఏం చేయలేని పరిస్థితి. అప్పటికే జింబాబ్వే క్రికెట్ బోర్డు ఎండీ గివ్మోర్ మాకోని సిరీస్‌ను రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పాడు. దీంతో అందుబాటులో ఉన్న జట్టుతోనే సిరీస్ ఆడి క్వీన్‌స్వీప్ అయ్యాం. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో వంద లోపే ఆలౌట్ అయ్యాం. అలా జింబాబ్వే జట్టుతో నా తొలి అనుభవమే వింతగా జరిగింది. ఈ ప్రదర్శన జింబాబ్వేను 2019 వన్డే ప్రపంచకప్‌కు దూరం చేసింది. జింబాబ్వే జట్టును మార్చాల్సిన అవసరం చాలా ఉందని అప్పుడే నిశ్చయించుకున్నా. ఈ నాలుగేళ్లలో రెండు మేజర్ టోర్నీలకు కనీసం అర్హత సాధించలేకపోయాం. ఒక ఇంజనీర్ బిల్డింగ్‌ను కట్టడానికి ఎంత కష్టపడతాడో.. ఈ నాలుగేళ్లలో ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మార్చిన తీరు నాకు సంతోషాన్ని ఇచ్చింది. 2022 టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే అర్హత సాధించడం నా కల. ఆ కలను ఇవాళ మా ఆటగాళ్లు నెరవేర్చారు. కుర్రాళ్లకు తాము రాణించగలమనే ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఎంగరా, రియాన్ బర్ల్, చటార, లూక్ జాంగ్వే లాంటి యువ క్రికెటర్లు జింబాబ్వే క్రికెట్ ఎదుగుదలకు కారణమవుతున్నారు.'' అని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జింబాబ్వే పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరీస్‌లు గెలవకున్నా ఆటగాళ్లు మాత్రం తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అలా అని జింబాబ్వేను తేలికగా తీసిపారేయడానికి లేదు. రెండు దశాబ్దాల కింద ప్లవర్ సోదరులు, హిత్స్ట్రీక్, అలిస్టర్ క్యాంప్‌బెల్, నీల్ జాన్సన్, ముర్రే గుడ్విన్స్, పాల్ స్ట్రాంగ్స్, హెన్రీ ఒలాంగా లాంటి ఆటగాళ్లతో జింబాబ్వే జట్టు బలంగానే కనిపించేది. గత 15 ఏళ్లలో వీరంతా తప్పుకోవడం.. క్రమంగా జింబాబ్వే ఆటను మసకబారేలా చేసింది. బోర్డుతో విబేధాలు ఆటగాళ్లకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. వరుసగా సిరీస్‌లు ఆడినప్పటికి అన్నింటిలోనూ ఓడిపోతూ వచ్చింది. ఒకానక దశలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ల కంటే దారుణమైన ఆటతీరు కనబరిచింది. కానీ గతేడాది నుంచి జింబాబ్వే ఆటలో చాలా మార్పు వచ్చింది. సీనియర్లు, జూనియర్లు మంచి సయన్వయంతో కలిసి ఆడుతు జింబాబ్వే జట్టును శక్తివంతంగా తయారు చేస్తున్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో ఈసారి జింబాబ్వే టైటిల్ కొట్టకపోయినా సెమీస్‌కు చేరినా అది పెద్ద విజయం అనే చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి.. జింబాబ్వే ఇలాగే ఆడి ఫైనల్ చేరి టైటిల్ విజేతగా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఏ జట్టును ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. 2012లో వెస్టిండీస్ కూడా ఇలాగే ఎవరు ఊహించని రీతిలో టైటిల్‌ను ఎగరేసుకుపోయి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమో గుర్రం ఎగరావచ్చు.. చదవండి: క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు పాక్ మూలాలున్న క్రికెటర్ ముచ్చెమటలు పట్టించాడు -
Ind Vs Zim: టీమిండియాను 2-1తో ఓడిస్తాం.. సిరీస్ మాదే: జింబాబ్వే బ్యాటర్
India tour of Zimbabwe, 2022- 3 ODIs: స్వదేశంలో టీమిండియాను కచ్చితంగా ఓడించి తీరతామని జింబాబ్వే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇన్నోసెంట్ కియా అన్నాడు. కేఎల్ రాహుల్ బృందాన్ని మట్టికరిపించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా భారత్‌తో పోరులో తాను అత్యధిక పరుగులు సాధించి.. టాప్ స్కోరర్‌గా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు ఆగష్టు 18న మొదటి మ్యాచ్ ఆడనుంది. ఇక.. పర్యాటక బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై ఓడించి.. టీ20, వన్డే సిరీస్‌లలో 2-1తో గెలుపొంది జోరు మీదున్న జింబాబ్వే.. భారత్‌కు సైతం గట్టి పోటీనివ్వాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియాపై 2-1తో గెలుస్తాం! ఈ నేపథ్యంలో బంగ్లాపై గెలుపులో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు ఇన్నోసెంట్ కియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్ నౌతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఈ 30 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్... ‘‘టీమిండియాతో సిరీస్‌లో జింబాబ్వే 2-1తో గెలుస్తుంది. ఇక వ్యక్తిగతంగా.. వరుస సెంచరీలు సాధించాలని నేను కోరుకుంటున్నా. తద్వారా టాప్ స్కోరర్‌గా నిలవాలని భావిస్తున్నా. భారత్‌తో సిరీస్‌లో నా ప్రధాన లక్ష్యం అదే’’ అని చెప్పుకొచ్చాడు. ఇన్నోసెంట్ కియా(PC: Zimbabwe Cricket) విరాట్, రోహిత్ లేరు!... ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు భయ్యా! ఇక తమ దేశంలో పర్యటించనున్న భారత జట్టులో సీనియర్లు లేకపోవడం తమకు సానుకూల అంశమన్న కియా.. ‘‘మేము కచ్చితంగా గెలుస్తామని నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే.. ప్రస్తుత భారత జట్టులో విరాట్ లేడు.. రోహిత్ శర్మ, రిషభ్ పంత్ ఇలాంటి కీలక ప్లేయర్లు ఎవరూ లేరు. మా దేశానికి వచ్చే జట్టు పటిష్టమైనదే అని నాకు తెలుసు. వాళ్లను తక్కువగా అంచనా వేసే ఉద్దేశం మాకు లేదు. అయితే.. మేము మాత్రం పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కియా వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అద్భుత విజయాలతో మీరు దూసుకుపోతున్న తీరు ప్రశంసనీయం. అయితే.. కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే కానీ.. మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో కియా 110 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడింది 6 వన్డేలు ఇక గతేడాది స్కాట్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కియా.. ఈ ఏడాది జూన్‌లో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌తో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు జింబాబ్వే తరఫున 6 వన్డేలు ఆడి 245 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 110. ఇక టీ20 ఫార్మాట్లో 8 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 54. ఇదిలా ఉంటే.. జింబాబ్వే కోచ్ డేవిడ్ హౌన్, టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ సైతం భారత్‌కు తాము పోటీనివ్వగలమని పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup 2022 : కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్ వార్నింగ్! India Tour Of Zimbabwe: స్టార్ ఆల్‌రౌండర్ దూరం..! IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! -
టీమిండియా పటిష్టమైన జట్టే కావొచ్చు.. ధీటుగా పోటీ ఇస్తాం..!
ముంబై: భారత్ గట్టి ప్రత్యర్థి అని జింబాబ్వే టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. ఈ భారత మాజీ ఓపెనర్ 2018 నుంచి జింబాబ్వేకు హెడ్ కోచ్‌గా తదనంతరం ఈ జూన్ నుంచి టెక్నికల్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టీమిండియా పర్యటిస్తున్న నేపథ్యంలో హరారేలో ఉన్న ఆయన మీడియాతో ముచ్చటించారు. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్లు జింబాబ్వేతో తరచూ ఆడాలని ఆశించారు. 2016 తర్వాత భారత్ ఇక్కడ పర్యటించడం జింబాబ్వే ఆటగాళ్లకు చక్కని అవకాశమని, గట్టి పోటీ జట్టును ఎదుర్కోవడం ద్వారా ఆటగాళ్లకు మేలు జరుగుతుందని లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించిన తమ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత జింబాబ్వే జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలబోతతో దీటుగా ఉందన్నారు. -
ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా..!
టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్ట్ 18 నుంచి 22 వరకు జరగనుంది. ఈ విషయాన్ని జింబాబ్వే టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించారు. ప్రపంచ స్థాయి భారత ఆటగాళ్లతో తలపడే ఈ సిరీస్ జింబాబ్వే క్రికెటర్లకు గొప్ప అవకాశం అని రాజ్‌పుత్ తెలిపాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్ జింబాబ్వే క్రికెట్‌కు మంచి చేస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు. ఇక పర్యటన గురించి జింబాబ్వే క్రికెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. "భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నాము. అదే విధంగా ఈ చిరస్మరణీయ సిరీస్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము" అని పేర్కొన్నాడు. ఇక భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్, వన్డే సిరీస్ అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. విండీస్ టూర్లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగనుండంతో జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉంది. ఇక చివర సారిగా 2016లో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. చదవండి: Malaysia Masters: ముగిసిన పీవీ సింధు పోరాటం.. మళ్లీ తైజు చేతిలో ఓటమి -
టూర్ నుంచి లాల్‌చంద్‌ను తప్పించిన భారత్
కరాచీ: భారత్ మాజీ క్రికెటర్, జింబాబ్వే హెడ్ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ పాకిస్తాన్ పర్యటనకు గైర్హాజరయ్యారు. హరారేలోని భారత రాయబార కార్యాలయం 58 ఏళ్ల రాజ్‌పుత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరడంతో జింబాబ్వే ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆయన జింబాబ్వే జట్టుతో కలిసి పాక్ పర్యటనకు వెళ్లలేదు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో వెల్లడించింది. ‘లాల్‌చంద్‌కు హరారేలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వీసా జారీ చేసింది. అయితే భారత్ ఆయన్ని టూర్ నుంచి తప్పించాలని కోరింది. దీంతో ఆయన జట్టుతో పాటు పాక్‌కు బయలుదేరలేదు’ అని జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. (చదవండి: ‘పింక్’ టెస్టు ఎక్కడో క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ) ఆయన గైర్హాజరీ నేపథ్యంలో బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండోకు తాత్కాలికంగా హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించింది. భారత్ తీరుపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. జట్టుతో పాటు ఆయనకు అసాధారణ భద్రత ఏర్పాట్లు చేశామని... వీసా జారీ చేశాక కూడా రాజ్‌పుత్‌ను నిలువరించడం అర్థం లేని చర్యని పీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు జింబాబ్వే జట్టు మంగళవారం పాక్ చేరుకుంది. ఈ జట్టు గతంలో 2015లో చివరిసారిగా పాక్ పర్యటనకు వెళ్లింది. తాజాగా క్వారంటైన్, కోవిడ్ టెస్టులు ముగిశాక రావల్పిండిలో ఈ నెల 30, నవంబర్ 1, 3 తేదీల్లో మూడు వన్డేలు అనంతరం లాహోర్‌లో 7, 8, 10 తేదీల్లో మూడు టి20లు ఆడుతుంది. -
‘ఆ ముగ్గురు’ పశ్చాత్తాప పడి ఉంటారు
ముంబై: ఎమ్మెస్ ధోని నేతృత్వంలో 2007 టి20 ప్రపంచకప్ గెలిచి భారత జట్టు సంచలనం సృష్టించింది. అయితే ఈ మెగా టోర్నీలో ఆడరాదని నాటి సీనియర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ అంతకు కొద్దిరోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. ఫలితంగా ధోని కెప్టెన్‌గా యువ జట్టు బరిలోకి దిగింది. దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అంశాన్ని ఆ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన లాల్‌చంద్ రాజ్‌పుత్ పంచుకున్నారు. అప్పటి టెస్టు, వన్డే కెప్టెన్ ద్రవిడ్ తనతో పాటు మిగతా ఇద్దరినీ ఇందు కోసం ఒప్పించాడని ఆయన చెప్పారు. ‘తానే కాదు... సచిన్, గంగూలీ కూడా టి20 వరల్డ్‌కప్ ఆడాల్సిన అవసరం లేదని ద్రవిడ్ భావించాడు. తనే స్వయంగా వారికి చెప్పి నిరోధించాడనేది వాస్తవం. దానికి ముందు జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో ద్రవిడ్‌గా కెప్టెన్‌గా ఉన్నాడు. కొందరు ఆటగాళ్లయితే నేరుగా ఇంగ్లండ్ నుంచే వరల్డ్‌కప్ కోసం దక్షిణాఫ్రికా వచ్చారు. ఆ సమయంలో కుర్రాళ్లకు చాన్స్ ఇద్దామని ద్రవిడ్ చెప్పాడు. అయితే మన జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత వారంతా కచ్చితంగా పశ్చాత్తాప పడి ఉంటారు. ఎందుకంటే నేను ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు అని సచిన్ నాతో తరచుగా చెప్పేవాడు’ అని రాజ్‌పుత్ అన్నారు. -
జింబాబ్వే కోచ్‌గా భారత మాజీ ఆటగాడు
క్రికెట్ పసికూన జింబాబ్వే జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆటగాడు, కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ నియమితులయ్యారు. ప్రస్తుతం జింబాబ్వేకు తాత్కాలిక కోచ్‌గా ఉన్న రాజ్‌పుత్‌ను పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్టు జింబాబ్బే క్రికెట్ బోర్డ్ ట్వీట్ చేసింది. ‘రాజ్‌పుత్ సేవలు జింబాబ్వే జట్టు వినియోగించుకోనుంది. అతని అనుభవం, కష్టపడేతత్వం, ఆటపై ఉన్న మక్కువ మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.’ అంటూ ట్వీట్లో పేర్కొంది. ఇక కోచ్‌గా నియమిచండం పట్ల రాజ్‌పుత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘నన్ను కోచ్‌గా నియమించింనందుకు జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. దీన్ని గౌరవంగా, ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాను. జట్టును మరో లెవల్‌కు తీసుకవెళ్లడానికి కృషి చేస్తాను. త్వరలోనే జింబాబ్వే ఆటలో మార్పులు చూస్తారు’ అంటూ రాజ్‌పుత్ పేర్కొన్నారు. వన్డే వరల్డ్ కప్‌కు జింబాబ్వే జట్టు అర్హత సాధించకపోవడంతో కోచ్‌గా ఉన్న హీత్‌స్ట్రీక్‌ను తప్పించి రాజ్‌పుత్‌ను తాత్కాలిక కోచ్‌గా బోర్డు నియమించిన విషయం తెలిసిందే. 2007లో దక్షిణాఫ్రిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు రాజ్‌పుత్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు. భారత్ తరపున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడిన రాజ్‌పుత్ 2016లో అఫ్గనిస్థాన్ కోచ్‌గా పనిచేశారు. @ZimCricketv is thrilled to announce Lalchand Rajput has been appointed as the substantive head coach of our men’s national team. The former @BCCI international is a respected and successful coach reputed for his passion, hard work and intimate knowledge of the game #AllTheBest pic.twitter.com/nT3Tpt1NbZ — Zimbabwe Cricket (@ZimCricketv) August 24, 2018 -
రోహిత్ ఓపెనర్‌గా రావాలి: మాజీ క్రికెటర్
ముంబై : ఈ సీజన్ ఐపీఎల్లో వరుస ఓటములతో చతికిలపడ్డ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టాలంటే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా రావాలని మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఓపెనర్‌గా వస్తే ముంబైకి మంచి శుభారంభం అందుతుందని, దీంతో భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుందని తెలిపాడు. ‘‘రోహిత్ విజయవంతమైన ఓపెనర్, భారత్ ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. కావునా అతను స్వేచ్ఛగా ఆడేందుకు ఓపెనర్‌గా రావడం అతనికి చాలా ముఖ్యం. రోహిత్ శుభారంభాన్నందిస్తే జట్టు భారీ స్కోర్ చేయగలదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే.. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి పరిస్థితి కఠినంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో రోహిత్ స్వేచ్ఛగా ఆడలేడు.’’ అని ఈ మాజీ ముంబై ఓపెనర్ పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ మాజీ కోచ్ అయిన రాజ్‌పుత్.. ముంబై విజయాల కోసం జట్టులో మరో మార్పు చేయాలని సూచించాడు. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమిని తీసుకోవాలని సలహా ఇచ్చాడు. ‘పొలార్డ్ మంచి ఫామ్‌లో లేడు. అతను పరుగుల కోసం తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ముంబై అతని స్థానంలో జేపీ డుమినీని తీసుకోవడం ఉత్తమం’ అని అభిప్రాయపడ్డాడు. ఇక గత ఐదు మ్యాచ్‌ల్లో పోలార్డ్ అత్యధిక స్కోర్ 28 పరుగులు మాత్రమే. ఇక శనివారం పుణె వేదికగా ముంబై బలవంతమైన చెన్నైతో తలపడునుంది. ఈ జట్ల మధ్య ఈ సీజన్లో తొలి మ్యాచ్ జరగగా.. హోరాహోరి సాగిన పోరులో చివరకు విజయం చెన్నైనే వరించింది. -
రవిశాస్త్రి, సెహ్వాగ్ లు పోటీ కాదు..
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రాబోతున్న సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) నూతన కోచ్ ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ తరుణంలో అసలు కోచ్ పదవి ఎవర్ని వరించబోతున్నది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరికి బీసీసీఐలోని పెద్దల అండదండలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో కోచ్ పదవి అనేది ఇద్దరిలో ఒకరికి ఖాయంగా కనబడుతోంది. అయితే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన మరో మాజీ భారత ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా రేసులోకి వచ్చాడు. గతంలో భారత జట్టుతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న రాజ్ పుత్.. కోచ్ పదవిపై స్పందించాడు. 'ఇక్కడ రవిశాస్త్రి, సెహ్వాగ్‌ల నుంచి మాత్రమే పోటీ ఉందని అనుకోవడం లేదు. వారిద్దరికీ నేను పోటీ కూడా కాదు. కోచ్ ను ఎంపిక చేసే సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ ఎవరు బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. నా వరకూ అయితే నాపై నమ్మకం ఉంది. నా రికార్డులే నా గురించి చెబుతాయి. నేను భారత క్రికెటర్లతో కలిసి పని చేసిన 2007వ సంవత్సరమే అందుకు ఉదాహరణ. నాకొక సొంత గుర్తింపు కూడా. ఇక్కడ నాలాగే కోచ్ గా దరఖాస్తు చేసిన అందరికీ సొంత గుర్తింపు ఉంది. కోచ్ గా ఎవరైతే అర్హలని సీఏసీ భావిస్తుందో వారికే ఇవ్వండి. అంతేకానీ కొంతమంది నుంచి పోటీ ఉందని అనడం సబబు కాదు.'మేమంతా కోచ్ కాంపిటేషన్ లో ఉన్నాం. దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, టామ్ మూడీలు కూడా పోటీలో ఉన్నారు' అని లాల్ చంద్ రాజ్‌పుత్ పేర్కొన్నాడు. 2007లో రాజ్‌పుత్ పర్యవేక్షణలోని భారత జట్టు వన్డే సిరీస్ ను, టెస్టు సిరీస్‌ను గెలవగా, 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. -
మళ్లీ దరఖాస్తులు ఎందుకోసం?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ తిరిగి దరఖాస్తుల్ని ఆహ్వానించడంపై కోచ్ రేసులో ఉన్న లాల్ చంద్ రాజ్‌పుత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకసారి కోచ్ పదవి కోసం గడువు ముగిసినా, మళ్లీ దరఖాస్తుల్ని ఆహ్వానించాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజ్‌పుత్ మండిపడ్డారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్స్ ను మాటను పక్కకు పెట్టి, తాజా దరఖాస్తులంటూ కొత్త పల్లవి అందుకోవడం ఎవరి కోసమని ప్రశ్నించాడు. 'ఇది కచ్చితంగా మంచి పరిణామం కాదు. కోచ్ పదవి కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. అయినప్పటికీ మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తులంటూ బీసీసీఐ ముందుకొచ్చింది. అసలు బీసీసీఐ ఉద్దేశం ఏమిటి. ఎవరి ప్రయోజనాల కోసం కోచ్ దరఖాస్తుల్ని తిరిగి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు అభ్యర్ధులు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశారు. వారిపై మీకు నమ్మకం లేదనేది అర్ధమవుతోంది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ప్రజల్ని ఎందుకు అయోమయంలో పడేస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు. కోచ్ గా చేసే వాడికి ఆటగాడిగా భారీ రికార్డు అవసరం లేదనేది బీసీసీఐ తెలుసుకోవాలి. ఫలాన వ్యక్తితో సక్సెస్ సాధిస్తామనేది గ్యారంటీ లేనిది. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ అవసరం. ఇక్కడ ఇంగ్లిష్ క్రికెట్ బోర్డును పరిశీలించండి. ఇంగ్లండ్ జట్టును కోచ్ ట్రెవర్ బెయిలిస్ ఎలా ముందుగా తీసుకువెళుతున్నాడో చూడండి. అతనికి ఆటగాడిగా మెరుగైన రికార్డు లేదు. టెక్నికల్ గా మంచి పరిజ్ఞానం ఉంది. ఈ విషయాన్ని బీసీసీఐ అర్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కానీ, కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాల్సిన అవసరం లేదు'అని రాజ్ పుత్ పేర్కొన్నాడు. -
అఫ్ఘానిస్తాన్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు
కాబూల్:అఫ్ఘానిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ ఎంపికయ్యాడు.ఇటీవల భారత క్రికెట్ చీఫ్ కోచ్ పదవికి పోటీ పడిన రాజ్‌పుత్‌ను అఫ్ఘానిస్తాన్ కోచ్ గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమాముల్ హక్ ఆ దేశ క్రికెట్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్ఘాన్ క్రికెట్‌కు కోచ్ నియామకం అనివార్యమైంది. దీనిలోభాగంగా భారత్ లో కోచ్ గా పని చేసిన అనుభవం ఉన్నకారణంగానే రాజ్‌పుత్‌ను ప్రధాన కోచ్ గా నియమించినట్లు అప్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అఫ్ఘాన్ కోచ్ పదవి కోసం రాజ్ పుత్ తో పాటు పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ యూసఫ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్ష్లీ గిబ్స్‌లు పోటీ పడ్డారు. 'రాజ్‌పుత్ అనుభవం మేర అతనికి అప్ఘాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవిని అప్పజెప్పాం. సాంకేతికంగా, ఆటగాడిగా రాజ్‌పుత్ బలమైన కోచ్. అతని నియామకంతో అప్ఘాన్ క్రికెట్‌కు మంచి రోజులు వస్తాయి. స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ పర్యటన నాటికి రాజ్‌పుత్ జట్టుతో కలుస్తాడు. ఈ పదవికి భారత మాజీ ఆటగాడు మొహ్మద్ కైఫ్ కూడా దరఖాస్తు చేశాడు. అప్ఘాన్ కోచ్ పదవికి కోసం చాలా అప్లికేషన్లు వచ్చినా రాజ్‌పుత్, కైఫ్‌ల పేర్లను షార్టు లిస్టు చేశాం. అయితే ఫైనల్ రౌండ్ ఇంటర్య్వూలో రాజ్‌పుత్ ను కోచ్ గా నియమిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది' అని క్రికెట్ బోర్డు చైర్మన్ దనీష్ నసిముల్లా తెలిపారు. గతంలో భారత అండర్ -19 క్రికెట్ జట్టుకు, 2008లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు రాజ్ పుత్ కోచ్‌గా పని చేశాడు.